కొత్త అప్డేట్ తో బజాజ్ డొమినర్ 400 భారత మార్కెట్ లోకి వెచ్చేసింది..!
బజాజ్ భారత మార్కెట్లో అప్డేట్ చేయబడిన డొమినర్ 400(2019) ను ప్రారంభించింది. ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ప్రకారం కొత్త బజాజ్ డొమినార్ 400 (2019) ధర రూ .1.73 లక్షలుగా ఉన్నది. ఇది మునుపటి మోడల్తో పోలిస్తే కొత్త అప్డేట్లు మరియు అదనపు ఫీచర్లతో వస్తుంది. ఇందులో డొమినార్ 400(2019) మోడల్ కు చాల యాంత్రిక మార్పులు చేసారు.అంతే కాకుండా ఇందులో కొత్త అప్డేట్ తో బాడీ గ్రాఫిక్స్ తో రిఫ్రెష్ స్టైలింగ్ను తెచ్చారు.

బజాజ్ డొమినార్ 400 ఇప్పుడు అప్డేటెడ్ హార్డ్వేర్ తో పాటు రిఫ్రెష్డ్ ఎల్ఇడి హెడ్ల్యాంప్స్ మరియు ఎల్ఇడి టైల్ లైట్లు అప్డేటెడ్ ఇంటర్నల్లతో వస్తుంది.డొమినార్(2019) పూర్తిస్థాయి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు గేర్ ఇండికేటర్, ఓడోమీటర్ మరియు గడియారం వంటి అదనపు సమాచారాన్ని ప్రదర్శించే ఇంధన ట్యాంకుపై ఒక కొత్త తెరతో వస్తుంది.

కొత్త బజాజ్ డొమినార్ 400 కూడా పూర్తిగా కొత్త సస్పెన్షన్ సెటప్తో వస్తుంది. కొత్త డోమినర్ 400 మునుపటి మోడల్ పై సాంప్రదాయ టెలిస్కోపిక్ సెటప్ స్థానంలో, పైకి క్రిందికి ఉన్న ఫోర్క్ తో మరియు వెనుక సస్పెన్షన్ అదే మోనోషాక్ ఏర్పాటుతో వస్తుంది.

బజాజ్ డొమినార్ 400 లో బ్రేకులు కూడా మారలేదు. ఇది ముందు మరియు వెనుక భాగంలో 320ఎంఎం మరియు 230ఎంఎం డిస్క్ లను కలిగి ఉంది. రెండూ ప్రామాణికమైన రెండు-ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం వ్యవస్థకు అనుగుణ్ణంగా ఉన్నాయి. డొమినార్ 400 లోని చక్రాలు రెండు-టోన్ తో అప్డేట్ చేయబడ్డాయి.

ఇందులోఇంకా బజాజ్ ఎగ్సాస్ట్ కూడా అప్డేట్ చేయబడింది. అయితే, కొత్త బజాజ్ డొమినార్ 400 లో ప్రధాన అప్డేట్ లలో ఒకటి ఇంజిన్.దీని యొక్క పవర్ అవుట్ ఫుట్ ను కూడా బజాజ్ అప్డేట్ చేసింది.

ఇది 373 సిసీ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్తో వస్తుంది, కానీ ఇప్పుడు 40bhp (6bhp పెరుగుదల) మరియు 34Nm గరిష్ట టార్క్లను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ ఆరు స్పీడ్ గేర్బాక్స్ లతో జత చేయబడ్డాయి.

బజాజ్ డొమినార్ 400 (2019) పై డ్రివెస్పార్క్ యొక్క అభిప్రాయం
మార్కెట్లో భారతీయ బైక్ తయారీదారు అయిన బజాజ్ యొక్క డొమినార్ 400 ప్రధాన నమూనాగా చెప్పవచ్చు. కొత్త బజాజ్ డొమినార్ 400 ఇప్పుడు అంతకుముందు మోడల్లో అప్డేట్ లను మరియు లక్షణాల హోస్ట్ తో వస్తుంది. కొత్త బజాజ్ డొమినార్ 400 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310, కెటిఎమ్ 390 డ్యూక్, హోండా సీబీ300ఆర్ మరియు బిఎండబల్యూ జి310 లు భారతీయ మార్కెట్లో గట్టి పోటీను కలిచి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








