బజాజ్ పల్సర్ 220ఎఫ్ లాంచ్ చేసిన బజాజ్: ధర, ఫీచర్ వివరాలు

బజాజ్ పల్సర్ గురించి తెలియని వారుండరు, ఇది ఎంత పాపులర్ అంటే వీటి రాకతో బజాజ్ కంపెనీ దేశీయ మార్కెట్లో తిరిగి తన స్థానాన్ని పుంజుకొంది. ఇంకా పల్సర్ 150 పై ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అయితే బజాజ్ ఇప్పుడు పల్సర్ 220ఎఫ్ కొత్త బైక్ ను మార్కెట్లో విడుదల చేసింది, ఇందులో ఉన్న అప్ డేటెడ్ ఫీచర్లను, ఇంజిన్ వివరాలను తెలుసుకొందాం రండి..

బజాజ్ పల్సర్ 220ఎఫ్ లాంచ్ చేసిన బజాజ్: ధర, ఫీచర్ వివరాలు

బజాజ్ పల్సర్ 220ఎఫ్ అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా ఉందన్న విషయం తెలిసిందే. ' వోల్కేనో రెడ్ ' అనే కొత్త పెయింట్ స్కీమ్ లో పల్సర్ 220ఎఫ్ ను బజాజ్ ఆటో ప్రారంభించింది. కొత్త పెయింట్ స్కీమ్ సైడ్ ఫెయిరింగ్, బెల్లీ పాన్, ఫ్రంట్ ఫెండర్ మరియు టెయిల్ విభాగంలో బ్లాక్ అండ్ ఆరెంజ్ డెబల్స్ తో బేస్ మ్యాట్ రెడ్ కలర్ తో వస్తుంది.

బజాజ్ పల్సర్ 220ఎఫ్ లాంచ్ చేసిన బజాజ్: ధర, ఫీచర్ వివరాలు

అలాగే ముందు మరియు వెనుక చక్రాలపై చిన్న ఆరెంజ్ స్ట్రిప్ కూడా ఉంటుంది. కొత్త పెయింట్ స్కీమ్ కాకుండా, మోటార్ సైకిల్ కు ఎలాంటి ఇతర మార్పులు చేయలేదు. అదే యాంత్రికతాను కలిగి ఉంటుంది.

బజాజ్ పల్సర్ 220ఎఫ్ లాంచ్ చేసిన బజాజ్: ధర, ఫీచర్ వివరాలు

అలాగే, కొత్త ' వోల్కేనో రెడ్ ' రంగు కాకుండా, బజాజ్ పల్సర్ 220ఎఫ్ రెండు ఇతర డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ లో కూడా అందుబాటులో ఉంది అవి నలుపు/నీలం మరియు నలుపు/ఎరుపు. బజాజ్ పల్సర్ 220ఎఫ్ లో, సింగిల్-సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ ద్వారా వస్తుంది.

బజాజ్ పల్సర్ 220ఎఫ్ లాంచ్ చేసిన బజాజ్: ధర, ఫీచర్ వివరాలు

ఇది 21బిహెచ్పి మరియు 19ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయును, ఇందులో ఐదు స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. పల్సర్ 220ఎఫ్ పై సస్పెన్షన్ డ్యూటీల విషయానికి వస్తే ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్స్ ద్వారా మరియు వెనుక వైపున ఏర్పాటు చేసిన డ్యూయల్-షాక్ అబ్జార్బర్ ద్వారా ఉంటుంది.

బజాజ్ పల్సర్ 220ఎఫ్ లాంచ్ చేసిన బజాజ్: ధర, ఫీచర్ వివరాలు

బ్రేకింగ్ విషయానికి వస్తే రెండు చివరల్లో ఏర్పాటు చేసిన సింగిల్ డిస్క్ ద్వారా, స్టాండర్డ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ద్వారా దీనిని అప్ డేట్ చేసారు. అంతేగాక పల్సర్ 220ఎఫ్ పై కొత్త పెయింట్ స్కీమ్ ను అదనంగా బజాజ్ రాబోయే బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తన ఇంజిన్లను అప్ డేట్ చేసే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు.

Most Read:' డ్రైవర్ లెస్ ' కారు లో సచిన్ టెండూల్కర్.. వీడియో సంచలనం

బజాజ్ పల్సర్ 220ఎఫ్ లాంచ్ చేసిన బజాజ్: ధర, ఫీచర్ వివరాలు

బజాజ్ పల్సర్ శ్రేణి తన రాబోయే బిఎస్-6 ఇంజిన్లను అనేక సార్లు పరీక్షించింది. కంపెనీ మొత్తం అంతటా పరిచయం చేయడానికి ముందు, నవీకరించిన ఇంజిన్ తో ముందుగా పల్సర్ 150 ను పరిచయం చేసే అవకాశం ఉంది. కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ వోల్కేనో రెడ్ ధర రూ.1.07 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) గా ఉంది.

Most Read: అంబులెన్స్ కు దారి ఇవ్వడానికి సీఎం జగన్ ఏమి చేసాడో తెలుసా !

బజాజ్ పల్సర్ 220ఎఫ్ లాంచ్ చేసిన బజాజ్: ధర, ఫీచర్ వివరాలు

దేశంలో బ్రాండ్ ద్వారా ప్రవేశించాలని ఆశించిన ఎంట్రీ లెవల్ పల్సర్ 125 కూడా ఉంది. కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 ఈ నెలలో దేశీయ మార్కెట్లో లాంచ్ అవుతోంది. కొత్త పల్సర్ ఎన్ఎస్125 మార్కెట్ లో పాత 125 ఎల్ఎస్ ను భర్తీ చేస్తుంది.

Most Read:భారతదేశంలోనే మొట్ట మొదటి ఎల్ఈడి ట్రాఫిక్ లైట్స్.. మన హైదరాబాద్ లో

బజాజ్ పల్సర్ 220ఎఫ్ లాంచ్ చేసిన బజాజ్: ధర, ఫీచర్ వివరాలు

బజాజ్ నుంచి పాపులర్ 220ఎఫ్ పై లభ్యమవుతున్న సరికొత్త పెయింట్ స్కీమ్ గా వోల్కేనో రెడ్ మార్కెట్లో అందుబాటులో ఉంది. కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ వోల్కేనో రెడ్, కెటిఎమ్ డ్యూక్ 250, హోండా సిబిఆర్ 250ఆర్, కెటిఎమ్ డ్యూక్ 200 మరియు ఇండియన్ మార్కెట్లో యమహా ఎఫ్జెడ్ 25 లపై పోటీని కొనసాగిస్తుంది.

Most Read Articles

English summary
Bajaj Pulsar 220F Launched In ‘Volcanic Red’ Paint Scheme — Priced At Rs 1.07 Lakh - Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X