కొత్త 250సిసి మోటార్ సైకిల్ ని పరిచయం చేయనున్న రాయల్ ఎన్ఫీల్డ్
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ఎంత పాపులరో అందరికీ తెలుసు. వీటిపై వెలితే ఆ దర్జానే వేరు. కంపెనీ ప్రస్తుతం టూవీలర్ మార్కెట్‌లో దూసుకెళ్తోందంటే దానికి కారణం ఇవే. ఈ నేపథ్యంలోనే కంపెనీ త్వరలో సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ భారత మార్కెట్ కోసం ఒక కొత్త మోటార్ సైకిల్ ని తీసుకురానుంది. ఇప్పటికే దీని తయారీ పనులను మొదలు పెట్టిందని తెలిసింది. ఈ బ్రాండ్ నుంచి కొత్త మోటార్ సైకిల్ 250సిసి రూపంలో రానుంది. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ 250సిసి మోటార్ సైకిల్ ప్రస్తుతం దాని ప్రణాళికా దశల్లో ఉంది మరియు మార్కెట్ లో ప్రవేశపెట్టటానికి కొంత టైం పడుతుంది.

ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ నుండి వస్తున్న కొత్త 250సిసి మోటార్ సైకిల్ భారతీయ మార్కెట్లో తగ్గిన అమ్మకాలు మరియు మార్కెట్ వాటాను అభివృద్ధి పథంలో నడిపిస్తుంది అని చెప్పింది. కొత్త 250సిసి బ్రాండ్ కస్టమర్ యొక్క అభిరుచులకు అనుగుణంగా ఉంటుందని రాయల్ ఎన్ఫీల్డ్ ఆశిస్తోంది.

అయితే, మార్కెట్ లో తమ ఉత్పత్తులను మరింత సరసమైన ధరతో అమ్మే విధంగా తయారు చేయనుంది. కంపెనీ యొక్క మార్కెట్ షేరు మరియు వాల్యూమ్ అమ్మకాలు ఇప్పుడు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న ధరలు, తప్పనిసరి భద్రతా నవీకరణ కారణంగా మరియు రాబోయే ఉద్గార నిబంధనల కారణంగా భారతదేశం లో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు చాలా వరకు మందగించాయి.

దీంతో పాటు మార్కెట్లో ఇతర బ్రాండ్ల నుంచి పోటీ పెరగడంతో, ఈ బ్రాండ్ కు అమ్మకాలు తగ్గిపోవడానికి మరో కారణంగా చెప్పవచ్చు. ఈ ఏడాది ఆరంభం నుంచే ఈ కంపెనీ యొక్క అమ్మకాలు పతనమయ్యాయి. దాదాపు దశాబ్ద కాలంలో రాయల్ ఎన్ఫీల్డ్ భారత మార్కెట్లో అమ్మకాలు తగ్గడం ఇదే తొలిసారి.

రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుతం 350సిసి సెగ్మెంట్ నుండి క్లాసిక్, బుల్లెట్ మరియు థండర్ బర్డ్ ఉత్పత్తులతో ప్రారంభమయ్యే మోటార్ సైకిళ్లను అందిస్తోంది. ఈ మోడల్స్ మార్కెట్ లో అత్యంత ప్రజాదరణ పొందాయి, అయితే అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగలేదని కంపెనీ భావిస్తోంది.

350సిసి సెగ్మెంట్ తోపాటుగా, రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల 650సిసి సెగ్మెంట్ లో మిసైల్ మరియు కాంటినెంటల్ జిటి లతో ప్రవేశించింది, ఇది భారతదేశంలో బ్రాండ్ కొరకు అమ్మకాల గణాంకాలను మెరుగుపరచడానికి దోహదపడింది. వీటి ధర సుమారు రూ. 2.5 లక్షలు(ఎక్స్-షోరూమ్) ఉండగా, ఈ సెగ్మెంట్లో అత్యంత సరసమైన మోటార్ సైకిళ్లలో మిసైల్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 రెండూ ఉన్నాయి

డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం
రాయల్ ఎన్ఫీల్డ్ నుండి కొత్త 250సిసి మోటార్ సైకిల్ ను తరువాతి సంవత్సరంలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే, దీని ఉత్పత్తి ప్రారంభ ప్రణాళికా దశల్లో ఉంది, ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ రాబోయే బిఎస్-6 నిబంధనలను తన ప్రస్తుత ఉత్పత్తులకు నవీకరించే దిశగా అడుగులు వేస్తోంది.


Click it and Unblock the Notifications








