యమహా ఆర్15 కొంటున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

పదహారు ప్రాయం నుండి పాతికేళ్ల యువత వరకు యమహా ఆర్15 బైక్ అంటే ఇష్టపడని వారుండరు. బడ్జెట్ ధరలో స్పోర్ట్స్ బైక్ ఫీలింగ్ ఇచ్చే ఏకైక మోడల్ యమహా ఆర్15. యువతలో ఇంతటి పాపులారిటీ దక్కించుకున్న ఆర్15 బైకులో కీలక అప్‌డేట్స్ జరుగుతున్నాయి. దీనికి సంభందించిన కొన్ని కీలక విషయాలు బయటికొచ్చాయి.

యమహా ఆర్15 కొంటున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

జపాన్ దిగ్గజం యమహా తమ పాపులర్ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకులో నూతన ఇంజన్ తీసుకొస్తోంది. అవును, అతి త్వరలో అమల్లోకి రానున్న భారత్ స్టేజ్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే ఇంజన్‌ను దిగ్గజం సిద్దం చేస్తోంది.

యమహా ఆర్15 కొంటున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

అతి త్వరలో విడుదల కానున్న యమహా ఆర్15 బైకులో బిఎస్-6 ఇంజన్ అందిస్తున్నట్లు కంపెనీ ఇది వరకే ప్రకటించింది. తాజాగా అత్యంత రహస్యంగా బయటికొచ్చిన ఓ డాక్యుమెంట్లో ఈ వివరాలు లీకయ్యాయి. ఈ డాక్యుమెంట్ ప్రకారం, యమహా ఆర్15లో 18.3బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే బిఎస్-6 155సీసీ కెపాసిటీ గల ఇంజన్ రానుంది.

యమహా ఆర్15 కొంటున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

మునుపటి ఇంజన్‌తో పోల్చుకుంటే యమహా ఆర్‌15లోని బిఎస్-6 ఇంజన్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. పాత ఇంజన్‌ కంటే 0.7బిహెచ్‌పి పవర్ తగ్గింది. బిఎస్-4 ఇంజన్ 19బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసేది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ అది స్పీడ్‌లో దూసుకెళుతుంది. బిఎస్-6 బైకుల్లో తప్పనిసరి చేసిన ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ కూడా ఇందులో వచ్చింది.

యమహా ఆర్15 కొంటున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

డాక్యుమెంట్ ప్రకారం, యమహా ఆర్15 బైక్ పొడవు 1990ఎమ్ఎమ్, వెడల్పు 725ఎమ్ఎమ్ మరియు ఎత్తు 1135ఎమ్ఎమ్ వరకు ఉంది. దీని వీల్ బేస్ 1325ఎమ్ఎమ్ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 170ఎమ్ఎమ్‌గా ఉంది.

యమహా ఆర్15 కొంటున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

పలు సాంకేతికంగా మార్పు చేర్పులు మినహాయిస్తే డిజైన్ మరియు ఫీచర్ల పరంగా పెద్దగా చెప్పుకోదగిన మార్పులేవీ జరగలేదని తెలుస్తోంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, స్ల్పిట్ స్టైల్ స్టెప్ అప్ సీటు వంటివి రానున్నాయి. అంతే కాకుండా బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీ న్యూ వెర్షన్ ఆర్15లో వచ్చే అవకాశం ఉంది.

యమహా ఆర్15 కొంటున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

సస్పెన్షన్ విషయానికి వస్తే, బిఎస్-4 ఆర్15లో బైకులో ఉన్నటువంటి అవే టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు మోనోషాక్ అబ్జార్వర్ యధావిధిగా వచ్చాయి. బ్రేకింగ్ విధులు నిర్వర్తించేందుకు ముందు వైపున 282ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి, సురక్షితమైన బ్రేకింగ్ కోసం డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది.

యమహా ఆర్15 కొంటున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

బిఎస్-6 యమహా ఆర్15 వెర్షన్ పూర్తి స్థాయిలో విడుదలైతే దీని ధర సుమారుగా 10% నుండి 15% మేర పెరగనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యమహా వైజడ్ఎప్ ఆర్15 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1.40 లక్షలు మరియు డార్క్ నైట్ ఎడిషన్ ధర రూ. 1.42 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

యమహా ఆర్15 కొంటున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎస్-6 ప్రమాణాలతో వస్తోన్న యమహా వైజడ్ఎఫ్ ఆర్15 బైకులో ఇంజన్ మినహాయిస్తే చూడదగిన మార్పులేమీ పెద్దగా చోటు చేసుకోలేదు. రైడర్ గొప్ప అనుభూతిని కలిగించే స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్ ఇందులో వచ్చే అవకాశం ఉంది. సరికొత్త యమహా వైజడ్ఎఫ్ ఆర్15 మార్కెట్లో ఉన్న కెటీఎమ్ ఆర్సీ 125, సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్155, టీవీఎస్ అపాచే ఆర్‌టీఆర్ 160 4వి మరియు బజాజ్ పల్సర్ 160 ఎన్ఎస్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha YZF-R15 BS-VI Engine Specs Leaked: India Launch Expected This Year. Read in Telugu.
Story first published: Friday, October 18, 2019, 9:53 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X