Just In
- 54 min ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- 1 hr ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 2 hrs ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 2 hrs ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
Don't Miss
- Finance
కరోనా టైంలో ముఖేష్ అంబానీ ప్రతి గంట సంపాదన రూ.90 కోట్లు, వారి సంపద రూ.3వేలే!
- Lifestyle
రాత్రి ఫోన్ వాడకుండా జాగ్రత్త వహించండి .. డేంజర్ !!
- News
పెళ్లికి పెద్దల ‘నో’: జగిత్యాలలో యువతి, దుబాయ్‌లో యువకుడు బలవన్మరణం
- Sports
విమాన ప్రమాదంలో నలుగురు ఆటగాళ్లు మృతి!!
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జీఎస్టీ ఎఫెక్ట్.. ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్ లపై ధరల తగ్గింపు
ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం జీఎస్టీని తగ్గించిన విషయం తెలిసినదే, ఇది జరిగిన కొద్ది రోజులకే చాలా మటుకు విద్యుత్ వాహనాలపై ధరలను ఒకొక్క సంస్థ తాగిస్తూ వస్తున్నాయి. ఈ దారిలోనే ఒకినావా కూడా వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలపై జిఎస్టి తగ్గింపు వలన ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు తగ్గింపు వివరాలను వెల్లడించింది.

ఈ ధరల కోత ఫలితంగా అమ్మకాలు పెరుగుతాయని భారత ఎలక్ట్రిక్ వాహన తయారీ దారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇక భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయని దాదాపు అందరికీ తెలుసు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు చాలా కాలం నుంచి పెట్రోల్ ఆధారిత వాహనాల నుంచి విద్యుత్ శక్తితో నడిచే వాహనలకు తయారు చేసేవిధంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు.

వారు పూర్తిగా మారేందుకు ఎంత కాలం పడుతుందో చూడాలి. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల యొక్క వేగవంతమైన తయారీ వంటి ప్రోత్సాహాకాలు చేస్తోంది. ఇటీవల, ప్రభుత్వం మరొక ప్రధాన పనిని చేపట్టింది, దీని వలన ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని భావిస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన ప్రభుత్వం, తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ను తక్కువ ధరకే తయారు చేసింది. ఆ తర్వాత, తమ ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించడానికి మరో అవకాశానికి ధరి తీసింది.

అయితే ఇటీవల హుందాయ్ కోనా ఎలక్ట్రిక్ పై ధరల తగ్గించిన విషయం తెలిసిందే, అలాగే ఏథర్ ఎనర్జీ 450 ధరలు కూడా తగ్గించబడ్డాయి మరియు ఇప్పుడు ఒకినావా కూడా వారి ఎలక్ట్రిక్ స్కూటర్లు ధరలు తగ్గించ్చినట్లు ప్రకటించింది. వీటి వివరాలలోకి వెళితే..

లెడ్ యాసిడ్ బ్యాటరీతో నడిచే ఒకినవ స్కూటర్ల ధరలు రూ.2,500 నుండి రూ.4,700 రేంజ్ లో ధర తగ్గింపు చేసాయి. లిథియం-అయాన్ బ్యాటరీ ద్వారా నడిచే స్కూటర్లు రూ.3,400 నుండి రూ.8,600 మధ్య అధిక ధర తగ్గింపు చేసింది.

ఒకినవ ఆటోటెక్ ప్రయివేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ జితేంధర్ శర్మ మాట్లాడుతూ, "స్థిరమైన మొబిలిటీ కొరకు ఈ తాజా రాయితీ ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఐసి ఇంజిన్ వాహనాల మధ్య ధరల తగ్గించడం జరిగింది.
Most Read:"ఎగిరే కారు" ను ఆవిష్కరించిన జపాన్ ఎలక్ట్రిక్ సంస్థ

పెరుగుతున్న వినియోగ సామర్ధ్యం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా ఉత్పత్తి జరుగుతుంది. జీఎస్టీ తాగించడం వలన భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల యొక్క ఎక్స్-షోరూమ్ ధరలను తగ్గించింది మరియు క్లీనర్ వాహనాలకు గిరాకీ పెరుగుతుందని భావిస్తున్నారు.
Most Read:కొత్త విధానంతో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న హీరో మోటోకార్ప్

ఎలక్ట్రిక్ వాహనాలను ఆచరణీయ ఆప్షనల్స్ గా కనిపించేలా మరింత మంది ప్రజలను ప్రోత్సహిస్తారని నమ్మకంగా ఉన్నాం. ఒకినవ చెప్పిన ప్రకటన 18 శాతం నుంచి 5 శాతం వరకు కూడా ఎలక్ట్రిక్ వాహనాల చార్జులపై జీఎస్టీ తగ్గింపు, ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి మరింత తోడ్పడుతుందని పేర్కొన్నారు."
Most Read:' డ్రైవర్ లెస్ ' కారు లో సచిన్ టెండూల్కర్.. వీడియో సంచలనం

గురుగ్రామ్ లో ప్రధాన కార్యాలయం ఉన్న ఒకినావా ఆటోటెక్ ఒక భారతీయ ఎలక్ట్రిక్ వాహన తయారీదారుగా పేరుగాంచింది. ప్రస్తుతం ఈ సంస్థ భారత మార్కెట్లో ఏడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది, ఇవి రూ.42,400 నుండి రూ.1,15000 మధ్య ధర పలుకుతున్నాయి.