Just In
- 6 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 7 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 7 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 9 hrs ago
భారత్లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అదిరిపోయే ఆఫర్లు: ఇప్పుడే చెక్ చేసుకోండి
దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఒకినవ తమ అన్ని స్కూటర్ల మీద అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఆగష్టు నెలతో ప్రారంభమయ్యే పండుగ సీజన్ పురస్కరించుకొని ఒకినవ మోటార్స్ తమ అన్ని ఉత్పత్తుల మీద ఆగష్టు 12 నుండి అక్టోబరు 31, 2019 వరకు ప్రత్యేక ఆఫర్లు మరియు డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఒకినవ డీలర్ల వద్ద లభిస్తున్నాయి.

పండుగ ఆఫర్ క్రింద ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద రూ. 1000 ఖచ్చితమైన డిస్కౌంట్ అందిస్తున్నారు. క్యాష్ బ్యాక్ మాత్రమే కాకుండా, 20 మంది లక్కీ కస్టమర్లు వివిధ రకాల ఎలక్ట్రిక్ ఉత్పత్తులు గెలుపొందే అవకాశం ఉంది. ఏసీ, ఎల్ఈడీ టీవీసు, మైక్రోవేవ్స్ మరియు ఇతర ఎలక్ట్రిక్ గృహోపకరణాలను పొందవచ్చు.

అంతే కాకుండా, ఈ ఆఫర్ కాలంలో ఒక లక్కీ విన్నర్ ఫారిన్ ట్రిప్ గెలిచే ఛాన్స్ కూడా ఉంది. ఆఫర్ కాలం ముగిసిన అనంతరం నవంబర్ 2019 లో ఒకినవ సంస్థ ప్రతినిధులు విజేతలను ప్రకటిస్తారు.

దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సేల్స్ పెంచుకోవడానికి ఒకినవ సంస్థ ఈ ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఒకినవ ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరక్టర్ జితేందర్ శర్మ మాట్లాడుతూ, "స్వాతంత్ర్యదినోత్సవం, రాఖీ పండుగ, నవరాత్రి, దసరా మరియు దీపావళి వంటి పండుగ రోజుల్లో కస్టమర్లు కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు, ఈ సందర్భంగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్లను ప్రవేశపెట్టినట్లు" పేర్కొన్నారు.

ప్రస్తుతం తమ అన్ని స్కూటర్ల మీద సుమారుగా 12 నుండి 15 శాతం వరకు ధరలు తగ్గించినట్లు తెలిపారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఫేమ్-2 స్కీమ్ క్రింద అన్ని ఎలక్ట్రిక్ కార్లు మరియు బైకుల మీద జీఎస్టీ తగ్గించాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. దీంతో తమ ఉత్పత్తుల మీద జీఎస్టీ తగ్గినందున వాటి ధరలను కూడా తగ్గించినట్లు ఒకినవ ప్రతినిధులు వెల్లడించారు.

ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ శరవేగంగా వృద్ది చెందుతోంది. గతంతో పోల్చుకుంటే ఒకినవ సంస్థ కార్యకలాపాలాను విరివిగా విస్తరించింది. అంతే కాకుండా సేల్స్ కూడా గణనీయంగా పెరుతుగున్నాయి. కస్టమర్లు కూడా పెట్రోల్ మరియు డీజల్తో నడిచే వాహనాలకు స్వస్తి పలికి పర్యావరణాన్ని పరిక్షించే ఉద్గారరహిత ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుతున్నారు.