Just In
- 1 hr ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 1 hr ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 2 hrs ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 3 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
Don't Miss
- Sports
ఆ క్షణం నా గుండె పగిలినట్లనిపించింది: రిషభ్ పంత్
- Lifestyle
తమకు కాబోయే వారిలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఏమి కోరుకుంటారో తెలుసా...
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- News
జగన్ సర్కార్‌కు మళ్లీ ఎదురుదెబ్బ: విచారణ చేపట్టిన నిమిషాల్లోనే: ఉద్యోగులపై ఘాటు వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మార్కెట్లోకి ఒకినవ లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్: చీపెస్ట్ ధరలో బెస్ట్ స్కూటర్!
ఒకినవ స్కూటర్స్ సరికొత్త స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఒకినవ లైట్ పేరుతో పిలువబడే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 59,990 ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు ప్రకటించింది. సిటీల్లో తక్కువ దూరం ప్రయాణించే కస్టమర్లను టార్గెట్ చేసుకొని ఈ స్కూటర్ తీసుకొచ్చారు.

లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ యూజర్ ఫ్రెండ్లీ, వాడటానికి ఎంతో సులభంగా, తక్కువ బరువుతో చాలా తేలికగా సిటీల్లో చిన్న చిన్న రైడింగ్స్ చేయడానికి ఎంతో అనువుగా ఉంటుందని ఒకినవ కంపెనీ పేర్కొంది. సిటీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇందులో ఎన్నో అత్యాధునిక ఫీచర్లను తీసుకొచ్చారు.

ఒకినవ లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఫ్రంట్ హెడ్ ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్స్ చుట్టూ ఎల్ఈడీ లైట్లు వచ్చాయి. డ్యాష్ బోర్డులో ఎల్ఈడీ లైటింగ్ గల స్పీడో మీటర్, పుష్-బటన్ సెల్ఫ్-స్టార్ట్ మరియు ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ హ్యాండిల్ వంటివి ఫీచర్లు ఉన్నాయి.

ఒకినల లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్నటువంటి 40V, 1.25kWh లిథియం-అయాన్ బ్యాటరీ సిస్టమ్ 250W BLDC ఎలక్ట్రిక్ మోటార్‌కు పవర్ సప్లే చేస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 50 నుండి 60 కిమీల వరకు ప్రయాణిస్తుంది మరియు దీని గరిష్టం వేగం గంటకు 25కిమీలుగా ఉంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లోని బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్లోని బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటార్ మీద 3 సంవత్సరాల వారంటీ అందిస్తోంది.

ఒకినవ లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్లో రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ కూడా కలదు. సస్పెన్షన్ కోసం ముందువైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డ్యూయల్-స్ప్రింగ్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఒకినవ లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడల్. తేలికపాటి బరువుతో అన్ని రకాల వయస్సున్న వారు సులభంగా వినియోగించుకునేలా సిటీ అవసరాల కోసం దీనిని రూపొందించారు. మార్కెట్లో ఉన్న ఏవన్ ట్రెండ్-ఇ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఇది గట్టి పోటీనిస్తుంది.