ఏపీలో 40 శాతం బైకులకు ఇన్సూరెన్స్ లేదు: మీ బైకు ఇందులో ఉందా..?

తెలుగు రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డు మీదకొచ్చే వాహనాలకు లెక్కేలేదు. ప్రాణాపాయం కలిగించే ప్రమాదాలకు అధికంగా కారణమయ్యే టూ వీలర్లు అయితే ఏకంగా 40 శాతం వరకు ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డెక్కుతున్నాయి. ప్రత్యేకించి తెలుగు ప్రజల గురించి విస్మయపరిచే కొన్ని వాస్తవాలను అధికారులు వెల్లడించారు. వీటిని చూస్తే... భవిష్యత్తు ప్రశ్నార్థకాన్ని తలపిస్తోంది

వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీ కోసం మన డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేకంగా కథనం అందిస్తోంది. చూద్దాం రండి...

ఏపీలో 40 శాతం బైకులకు ఇన్సూరెన్స్ లేదు: మీ బైకు ఇందులో ఉందా..?

అసలు తప్పిదం

అవగాహన లేమి, లెక్కలేని తనం మరియు బాధ్యతారాహిత్యం ఇలా ఒక్కటి కాదు ఇన్సూరెన్స్ తీసుకోకపోవడానికి ఎన్నో కారణాలు... కానీ చివరగా చింతించాల్సిందే మనమే. వెయ్యి రూపాయలలోపే ఖర్చయ్యే ఇన్సూరెన్స్‌ జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనపుడు (ప్రమాదాలు జరిగితే) మిమ్మల్ని మీ కుటుంబాల్ని గట్టెక్కిస్తాయి.

ఏపీలో 40 శాతం బైకులకు ఇన్సూరెన్స్ లేదు: మీ బైకు ఇందులో ఉందా..?

40 శాతం బైకర్లు

జేబులో ఇన్సూరెన్స్ కాగితం లేకపోతే ఎలాంటి ప్రమాదం జరగదు. కానీ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండటం వలన ఏదైనా ప్రమాదం జరిగితే మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే అధికారులు వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరి చేశారు. కానీ అధికారులు వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే ఒక్క ఏపీలోనే 40 శాతం టూ వీలర్లు థర్డ్ ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డెక్కుతున్నాయి.

ఏపీలో 40 శాతం బైకులకు ఇన్సూరెన్స్ లేదు: మీ బైకు ఇందులో ఉందా..?

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్

మీరు బైక్ నడుపుతున్నడు ప్రమాదం జరిగితే, ఆ ప్రమాదం కారణం ఇతర వ్యక్తులు మరణిస్తే లేదా తీవ్ర గాయాలైతే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలాంటి సంఘటనల్లో మీ వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించి ఉంటే, ఆ ఇన్సూరెన్స్ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది.

ఏపీలో 40 శాతం బైకులకు ఇన్సూరెన్స్ లేదు: మీ బైకు ఇందులో ఉందా..?

చట్టం ఏం చెబుతోంది

వ్యక్తిగత ఇన్సూరెన్స్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లను ప్రభుత్వం ప్రజాహితం కోసం ప్రోత్సహించడంలేదు. మోటార్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 146 ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి అని చట్టాన్ని తీసుకొచ్చింది.

ఏపీలో 40 శాతం బైకులకు ఇన్సూరెన్స్ లేదు: మీ బైకు ఇందులో ఉందా..?

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

గణాంకాలు

కేంద్ర రోడ్డు మరియు రవాణా మంత్రిత్వ శాఖ అందించిన 2017 రిపోర్ట్ మేరకు ఆ ఒక్క ఏడాదిలోనే 8,060 మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించగా, 27,475 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఏపీలో 40 శాతం బైకులకు ఇన్సూరెన్స్ లేదు: మీ బైకు ఇందులో ఉందా..?

ఇన్సూరెన్స్ ధరలు

ప్రభుత్వం తప్పనిసరిగా చేసిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఖర్చుతో కూడకున్న విషయమేమీ కాదు. 75సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న టూ వీలర్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం ధర రూ. 482 లు మరియు 75సీసీ-150సీసీ మధ్య ఇంజన్ సామర్థ్యం ఉన్న బైకుల ప్రీమియం రూ. 752లుగా ఉంది. అదే విధంగా ఇంజన్ కెపాసిటీ 150సీసీ నుండి 350సీసీ మధ్యనున్న బైకుల ప్రీమియం 1200 రూపాయలుగా ఉంది.

ఏపీలో 40 శాతం బైకులకు ఇన్సూరెన్స్ లేదు: మీ బైకు ఇందులో ఉందా..?

జరిమానా & శిక్షలు

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా ప్రయాణిస్తే రూ. 1000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు.

ఏపీలో 40 శాతం బైకులకు ఇన్సూరెన్స్ లేదు: మీ బైకు ఇందులో ఉందా..?

ప్రయోజనాలు

1200 రూపాయలలోపు ఖర్చుతే ముగిసే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. జరిమానాలు ఉండవు, జైలు శిక్షలు ఉండలు, ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడతామనే భయం ఉండదు.. అన్నింటికీ మించి మీరు చేసిన ప్రమాదంలో ఎవరికైనా మరణం సంభవించిన, అంగవైకల్యం కలిగినా మీ బదులు ఇన్సూరెన్స్ సంస్థ వారికి డబ్బు చెల్లిస్తుంది.

Most Read Articles

English summary
Over 40% vehicles without insurance in Andhra Pradesh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X