రివోల్ట్ ఆర్వి400 గురించి మీకు తెలియని అద్భుతమైన విషయాలు

రివోల్ట్ మోటార్స్ భారత మార్కెట్ లో తమ మొదటి ఉత్పత్తి, ఆర్వి400 ప్రారంభించటానికి ఏర్పాటు చేసింది. ఈ రివోల్ట్ ఆర్వి400 గత నెలలో ఆవిష్కరించి దేశీయంగా తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను, జూలై 22 న లాంచ్ చేయనున్నారు. రివోల్ట్ ఆర్వి400 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కోసం తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా అలాగే అమెజాన్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో దీని లాంచ్ కు ముందు, రాబోయే ఆర్టిఫిషల్ ఇంటెలిజెంట్-ఎనేబుల్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయాలు చూద్దాం రండి.

రివోల్ట్ ఆర్వి400 గురించి మీకు తెలియని అద్భుతమైన విషయాలు

డిజైన్

ఈ రివోల్ట్ ఆర్వి400 నాక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్ సైకిల్ డిజైన్ తో అందిస్తారు. ఇది ట్రెడిషనల్ మోటార్ సైకిల్స్ తరహాలోనే స్లిమ్, మినిలిస్టిక్ డిజైన్ ఫీచర్లను అందిస్తోంది. దీనికి సింగిల్ సీటు, ముందు వైపు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ మరియు వెనుక వైపు ఎల్ఈడి టెయిల్ లైట్లు ఉన్నాయి.

రివోల్ట్ ఆర్వి400 గురించి మీకు తెలియని అద్భుతమైన విషయాలు

ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో పైలయన్ రైడర్స్, బ్లాక్ అవుట్ అల్లాయ్ వీల్స్ మరియు ఫుల్లీ-డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ కోసం పెద్ద గ్రాబ్ రైల్స్ కూడా వస్తాయి. ఆర్వీ400 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కూడా నిటారుగా ఉండే సీటింగ్ పొజిషన్ ను కలిగి ఉంది, ఫార్వర్డ్ సెట్ ఫుట్ పీగ్స్ తో ఇది సౌకర్యవంతమైన మరియు రిలాక్సేషన్ రైడింగ్ పొజిషన్ ను అందిస్తుంది.

రివోల్ట్ ఆర్వి400 గురించి మీకు తెలియని అద్భుతమైన విషయాలు

పెర్ఫామెన్స్ మరియు రేంజ్

రివోల్ట్ ఇంకా అధికారికంగా ఆర్వి400 యొక్క బ్యాటరీ గురించి ఖచ్చితమైన సాంకేతిక వివరాలను ప్రకటించాల్సి ఉంది. అయితే, మోటార్ సైకిల్ 85 కిమీ/గం యొక్క టాప్-స్పీడ్ తో ఉందని, ఒకసారి ఛార్జ్ చేస్తే 156కిమీ రేంజ్ ను అందిస్తుందని వారు ప్రకటించారు. మోటార్ సైకిల్ మూడు రైడింగ్ మోడ్ లతో వస్తుంది: సిటీ, ఎకో మరియు స్పోర్ట్. ఈ మూడింటిలో వేర్వేరు పెర్ఫామెన్స్ మరియు రేంజ్ అందించే ప్రోగ్రామ్ లు ఉన్నాయి.

రివోల్ట్ ఆర్వి400 గురించి మీకు తెలియని అద్భుతమైన విషయాలు

ఫీచర్లు

ఈ రివోల్ట్ ఆర్వి400 ఆర్టిఫిషల్ ఇంటెలిజెంట్ ఆధారిత సాంకేతికతతో వస్తుంది, ఇందులో ఇన్-బిల్ట్ ఫీచర్లు మరియు కనెక్టివిటీ పరికరాలతో వస్తుంది. వాటిలో జియో ఫెన్సింగ్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, చార్జింగ్ స్టేషన్ లొకేషన్ వంటి ఫీచర్లను అందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను ఫోన్ లోని ఓ యాప్ కు అనుసంధానం చేయవచ్చు.

రివోల్ట్ ఆర్వి400 గురించి మీకు తెలియని అద్భుతమైన విషయాలు

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

ఈ యాప్ రైడింగ్ స్టైల్ ని కూడా తెలియ చేస్తుంది, ఇది మోటార్ సైకిల్ యొక్క రేంజ్ మరియు పనితీరును పెంచడానికి దోహదపడుతుంది. మోటార్ సైకిల్ కూడా ఒక ఇ-సిమ్ తో వస్తుంది, ఇది బ్యాటరీ డయగ్నాస్టిక్స్ ను పంపుతుంది, అయితే ఏదైనా మాల్ ఫంక్షన్స్ జరిగినప్పుడు రైడర్ కు హెచ్చరికలు కూడా పంపుతాడు. మోటార్ సైకిల్ పై ఉండే ఇతర ఫీచర్లు కీలెస్ స్టార్ట్/స్టాప్ ' పవర్ ' బటన్ ను కలిగి ఉంటాయి.

రివోల్ట్ ఆర్వి400 గురించి మీకు తెలియని అద్భుతమైన విషయాలు

రివోల్ట్ ఆర్వి400 నాలుగు ప్రీ లోడెడ్ ఎగ్జాస్ట్ లను కూడా కలిగి ఉంది. మోటార్ సైకిల్ పై ఉండే స్పీకర్ల ద్వారా ఎగ్జాస్ట్ సౌండ్ వస్తుంది. అయితే, రైడర్ లు ఎగ్జాస్ట్ నోట్ ని మరింత కస్టమైజ్ చేయవచ్చు, యాప్ నుంచి మరింత డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా, సింగిల్ సిలెండర్ నుంచి ఇన్ లైన్ ఫోర్ కు ఏదైనా ఎగ్జాస్ట్ నోట్ ద్వారా యూజర్ లు తమ స్వంత సౌండ్ ని సృష్టించవచ్చు మరియు యాప్ మీద కూడా లోడ్ చేయవచ్చు.

రివోల్ట్ ఆర్వి400 గురించి మీకు తెలియని అద్భుతమైన విషయాలు

ఛార్జింగ్ సౌకర్యాలు

రివోల్ట్ వారి ఆర్వీ400 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కోసం ఒక శ్రేణి ఛార్జింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. రివోల్ట్ మోటార్ సైకిల్ ను ఛార్జింగ్ సౌకర్యాన్ని నాలుగు విభిన్న మార్గాలుగా అందించటం జరుగుతుంది అవి :

హోమ్-ఛార్జింగ్ వ్యవస్థ: ప్రతిచోటా అందుబాటులో ఉన్న ప్రామాణిక 15ఎ సాకెట్ ఉపయోగించి రివోల్ట్ ఆర్వీ400 ఛార్జ్ చేయవచ్చు. ఇది పూర్తి చార్జ్ అవ్వడానికి 4 గంటల సమయం పడుతుంది.

రివోల్ట్ ఆర్వి400 గురించి మీకు తెలియని అద్భుతమైన విషయాలు

రిమూవబుల్ బ్యాటరీ: మోటార్ సైకిల్ కు రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది, వీటిని బయటకు తీసి విడిగా ఛార్జ్ చేయవచ్చు. అయితే, బ్యాటరీ 15కిలోల్లో బరువు ఉంటుంది.

మొబైల్ బ్యాటరీ స్టేషన్లు: రివోల్ట్ అన్ని ప్రధాన నగరాల అంతటా ప్రత్యేక బ్యాటరీ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. ఇది వినియోగదారులు తమ సమీప స్టేషన్ కు వచ్చి, పూర్తిగా ఛార్జ్ చేయబడిన ఒక దానితో తీసుకోవచ్చు.

రివోల్ట్ ఆర్వి400 గురించి మీకు తెలియని అద్భుతమైన విషయాలు

బ్యాటరీ డెలివరీ: ఇది బహుశా రివోల్ట్ ద్వారా అందించే అత్యంత విశిష్టమైన ఛార్జింగ్ సౌకర్యం. పూర్తిగా ఛార్జ్ చేయబడ్డ బ్యాటరీని తమ ఇంటి వద్ద డెలివరీ చేయించుకునేందుకు ఇది కస్టమర్ లకు ఆఫర్ చేస్తుంది.

రివోల్ట్ ఆర్వి400 గురించి మీకు తెలియని అద్భుతమైన విషయాలు

ధర వివరాలు

ఈ రివోల్ట్ ఆర్వీ400 125 సిసి మోటార్ సైకిల్ సెగ్మెంట్ కు సమానమైన శ్రేణిలో ధర ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇది రూ .1 లక్ష, ఎక్స్ షోరూమ్ ధర ఉండవచ్చు. ఎక్కడెక్కడ మార్కెట్లో ఉంటాయంటే రివోల్ట్ ముందుగా ఆర్వీ400 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను ఢిల్లీలో మొదటగా లాంచ్ చేయనుంది.

రివోల్ట్ ఆర్వి400 గురించి మీకు తెలియని అద్భుతమైన విషయాలు

దీంతో తర్వాతి నెలల్లో పుణె, బెంగళూరు, హైదరాబాద్, నాగపూర్, అహ్మదాబాద్, చెన్నైలు త్వరలో రానున్నాయి. ఈ బైక్ ను వాటి షోరూమ్ ల ద్వారా గాని లేదా అమెజాన్ వెబ్ సైట్ ద్వారా గాని విక్రయిస్తారు, ఇది ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ముందస్తు బుకింగ్ చేసుకోవాలంటే రూ.1000 చెల్లించి చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Revolt RV400 Electric Motorcycle, Top Things To Know About India’s First ‘AI-Enabled’ Electric Bike. Read in Telugu.
Story first published: Friday, July 12, 2019, 10:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X