Just In
Don't Miss
- News
ముస్లింలకు తలదాచుకునే చోటు కూడా దక్కదు: పౌరసత్వ బిల్లు ప్రతులను చింపి, గాల్లోకి విసిరేసిన ఒవైసీ..!
- Lifestyle
మీ రాశిని బట్టి 2020లో ఏ నెల మీకు ప్రమాదకరమైన మరియు దురదృష్టకరమైన నెల అవుతుందో మీకు తెలుసా?
- Movies
మెగా అభిమాని మరణం.. ఫ్యామిలీని ఆదుకునేందుకు రంగంలోకి రామ్ చరణ్
- Technology
పీసీ సరిగా పనిచేయడం లేదా, అయితే ఇది చూడండి
- Sports
85 కోట్లు: రాజస్థాన్ రాయల్స్‌లో తన 3 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధమైన షేన్ వార్న్
- Finance
మరో రూ.1 లక్ష కోట్లు టార్గెట్, వస్తువుల ధరలు పెరిగే ఛాన్స్: నేరుగా కాకుండా...
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 మీద భారీగా పెరిగిన ధరలు
రాయల్ ఎన్ఫీల్డ్ పాపులర్ మోటార్ సైకిల్ బుల్లెట్ 350 ఏబీఎస్ మోడల్ ధరను భారీగా పెంచింది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఎబిఎస్ లభించే స్టాండర్డ్ మరియు ఇఎస్ (ఎలక్ట్రిక్ స్టార్ట్) రెండు వేరియంట్ల మీద కూడా ధరలు పెరిగాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్ సైకిల్‌ను ఆగష్టు 2019లో చీపెస్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1.12 లక్షలు మరియు ఇఎస్ వేరియంట్ ధర రూ. 1.26 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా నిర్ణయించింది.

అయితే, రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో బుల్లెట్ 350 మీద ఏకంగా రూ. 4,000 వరకు ధర పెరిగింది. దీంతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఏబిఎస్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1.14 లక్షలు (రూ. 2,000 పెరిగింది). అదే విధంగా బుల్లెట్ 350 ఏబిఎస్ ఇఎస్ వేరియంట్ ధర రూ. 1.30 లక్షలు (రూ. 4,000 ధర పెరిగింది)గా ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

ధరలు పెంపు మినహాయిస్తే, బుల్లెట్ 350 బైకులో ఎలాంటి మార్పులు జరగలేదు. సాంకేతికంగా ఇందులో బిఎస్-4 ప్రమాణాలను పాటించే 349సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 19.8బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రాయల్ ఎన్పీల్డ్ తమ అన్ని బైకుల్లో త్వరలో బిఎస్-6 ప్రమాణాలను పాటించే ఇంజన్ తీసుకురావాలని భావిస్తోంది. భారత ప్రభుత్వం ప్రకటించిన ఏప్రిల్ 01, 2020 గడువులోపే రాయల్ ఎన్ఫీల్డ్ తమ అన్ని బైకుల్లో బిఎస్-6 ప్రమాణాలు పాటించే ఇంజన్ ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తోంది.

అన్ని బైకుల్లో బిఎస్-6 ఇంజన్ తీసుకొస్తే ఆయా మోడళ్ల ధరలు మళ్లీ పెరగనున్నాయి. వీటిలో బుల్లెట్ 350 మోడల్ ధరలు కూడా పెరుగుతాయి. ఇంజన్‌తో పాటు సాంకేతికంగా కూడా పలు మార్పులు చేర్పులు నిర్వహించినున్నట్లు సమాచారం.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 విషయానికి వస్తే, ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో లభించే రాయల్ ఎన్ఫీల్డ్ చీపెస్ట్ మోటార్ సైకిల్ ఇదే. స్వల్పంగా ధర పెరిగినప్పటికీ, బుల్లెట్ 350 బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూముల్లో లభించే చీపెస్ట్ మోడల్. యువతను ఆకట్టుకోడానికి పలు విభిన్న పెయింట్ స్కీముల్లో లభిస్తోంది.

కస్టమర్లు ఓనిక్స్ బ్లాక్, బుల్లెట్ సిల్వర్ మరియు సఫైర్ బ్లూ రంగులో స్టాండర్డ్ బుల్లెట్ 350 బైకును ఎంచుకోవచ్చు. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఇఎస్ వేరియంట్‌ను మెరూన్, సిల్వర్, జెట్ బ్లాక్, రీగాల్ రెడ్ మరియు రాయల్ బ్లూ వంటి ఐదు విభిన్న కలర్ ఆప్షన్లలో సెలక్ట్ చేసుకోవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 మోడల్ మార్కెట్లో లభిస్తున్న చీపెస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. పలు రకాల పెయింట్ ఆప్షన్స్ మరియు ఎన్నో మార్పులు చేర్పులతో ఇటీవలె మార్కెట్లోకి విడుదలయ్యింది. బజాజ్ డామినర్ 400 మరియు జావా మోటార్ సైకిళ్లకు గట్టి పోటీనిస్తున్న ఈ మోడల్ యువతను ఎంతగానో ఆకట్టుకుంటోంది.