2 సంవత్సరాల వారంటీని 4 సంవత్సరాలకు పెంచిన రాయల్ ఎన్ఫీల్డ్!
ఇప్పుడు కుర్రకారుని ఉర్రుతలూగిస్తున్న వాహనాలలో ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్. యువకులందరికి నచ్చిన మెచ్చిన వాహనం ఏదైనా ఇకటి ఉంది అంటే అది రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అందులో ఉన్న ఫీచర్స్, డిజైన్ మదలైనవన్నీ అందరిని ఆకర్షితులను చేస్తుంది. ఇది విడుదలైన అతి తక్కువ కాలంలో అందరి అభిమానాన్ని పొందింది.

మార్కెట్లో ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న వాహనాలలో రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఒకటి. దీని కలర్ మరియు ఇంజిన్ సామర్త్యాలు మొదలైనవి ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. చాలా మంది రైడర్స్ మాత్రమే కాకుండా యువకులుకూడా బాగా ఇష్టపడుతున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ మూడు ప్యాకేజిలను కలిగి ఉంటుంది. దీనిలో ఇంతకుముందు 2 సంవత్సరాల వారంటీ మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు రెండు సంవత్సరాల స్థానంలో 4 సంవత్సరాల వారంటీని పొడిగించింది. అంతే కాకుండా దానికి తోడుగా 2,3 మరియు 4 సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెంట్ ని కూడా అందిస్తుంది.

ఇందులో 4 సంవత్సరాల వారంటీని ఇవ్వడమేకాకుండా దానికున్న ప్రీమియం పైన కేబుల్స్, బ్రేక్ ప్యాడ్లు మరియు బ్రేక్ షూలను 4సంవత్సరాలపాటు అందిస్తుంది. ఇది ఇప్పుడు కేవలం రాయల్ ఎన్ఫీల్డ్ కి మాత్రమే ఈ సదవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ లో ఇంజిన్ సిలిండర్ హెడ్, ఫ్యూయల్ ట్యాంక్, పుష్రోడ్ కిట్, ఇంజిన్ బ్లాక్ అసెంబ్లీ, కార్బ్యురేటర్, సెన్సార్లు, ట్రాన్స్మిషన్, మాగ్నెటో కవర్, సబ్‌ఫ్రేమ్, పిస్టన్ మరియు కనెక్ట్ రాడ్ అసెంబ్లీ, స్ప్రాగ్ క్లచ్, ఫ్యూయల్ పైప్, ఫ్రేమ్ అసెంబ్లీ, థొరెటల్ బాడీ , కామ్ ప్లేట్, స్టార్టర్ మోటర్, రియర్ షాకర్, హైడ్రాలిక్ టాప్పెట్ లు 4 సంవత్సరాల వారంటిలో పొందే అవకాశం ఉంటుంది.

ఇవే కాకుండా అన్ని ఇంజిన్ బేరింగ్లు, ఇసియులు, ఇంజిన్ ఫ్లాషర్ యూనిట్, ఆర్‌హెచ్ కవర్, చైన్‌స్టే, ఫ్యూయల్ ఇంజెక్టర్, వాల్వ్ & వాల్వ్ మెకానిజం, ఫ్రంట్ ఫోర్క్ అసెంబ్లీ, ఫ్రంట్ & రియర్ కాలిపర్స్, క్రాంక్కేస్, ఇంజిన్ ఫాస్టెనర్లు, ఆయిల్ కూలర్, ఆయిల్ పంప్, హెడ్‌ల్యాంప్ కేసింగ్ మరియు ఇంధన పంపు వంటివి రైడ్ ష్యూర్ కింద కవర్ చేయబడి ఉంటాయి.

సాధారణంగా వాహనం కొనుగోలు చేసిన తరువాత కొంతసమయం అంటే ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు వారంటీ ఇవ్వడం సహజం . కానీ రాయల్ ఎన్ఫీల్డ్ లో మాత్రం 2 సంవత్సరాలు ఉన్న వారంటీని నాలుగు సంవత్సరాలకు పెంచడమే కాకుండా, ఆ నాలుగు సంవత్సరాలలో రైడర్లకు వాహనంలో ఏదైనా పార్ట్స్ స్థానంలో కొత్త పరికరాలను తిరిగి పొందే అవకాశాన్ని ఎన్ఫీల్డ్ వినియోగదారులకి కల్పించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ విధమైన అవకాశాన్ని కల్పించడం వల్ల వినియోగదారులు ఇంకా ఆసక్తితో కొనుగోలు చేయనున్నారు. ఇప్పటిదాకా ఏ సంస్థ తీసుకోనటువంటి సంచలనాత్మకమైన నిర్ణయాన్ని వీరు తీసుకున్నారు. దీని వల్ల వారి అమ్మకం యొక్క యూనిట్లు పెరిగే అవకాశం ఉంది.
Source: Team bhp


Click it and Unblock the Notifications








