యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసిన సుజుకి: ధర, ఫీచర్లు

కొత్త భద్రతా ప్రమాణాలు రావడంతో అన్ని వాహనాల అమ్మకాలు తగ్గిపోయాయి, దీని వలన అన్ని సంస్థలు నష్టాల బాటలో నడుస్తున్నాయి. ఈ నష్టాన్ని కొంతవరకు పూడ్చడానికి వాహన తయారీదారులు కొత్త అప్డేటెడ్ వాహనాలను తీసుకువస్తున్నారు. ఈ మార్గంలోనే సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా, భారత మార్కెట్లో రిఫ్రెష్ వర్షన్ యాక్సెస్ 125 ఎస్ఈ స్కూటర్ ను లాంచ్ చేసింది. మరి ఇందులో ఉన్నటువంటి కొత్త ఫీచర్లను తెలుసుకుందాం రండి..

యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసిన సుజుకి: ధర, ఫీచర్లు

సుజుకి యాక్సెస్ 125 భారత మార్కెట్లో ఎటువంటి విజయాన్ని సాధించిందో మనకి తెలుసు, ఇప్పుడు ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్ టాప్-స్పెక్ ' డిస్క్-బ్రేక్ ' వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ క్రమంలోనే స్టాండర్డ్ డిస్క్ వేరియంట్ కంటే కొత్తగా సుజుకి యాక్సెస్ 125 ఎస్ఈ కేవలం రూ 1,600 ఎక్కువ ఖరీదైనదని మాత్రమే.

యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసిన సుజుకి: ధర, ఫీచర్లు

రిఫ్రెష్ అయిన సుజుకి యాక్సెస్ 125 ఎస్ఈ కొన్ని అదనపు ఫీచర్లతో పాటు, అనేక సూక్ష్మ సౌందర్య నవీకరణలను కలిగి వస్తుంది. రిఫ్రెష్ అయిన ఎస్ఈ వేరియంట్ కు కాస్మోటిక్ మార్పులు కూడా చేసింది.

యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసిన సుజుకి: ధర, ఫీచర్లు

గుండ్రని ఆకారంలో ఉండే క్రోమ్ అద్దాలు, క్రోమ్ ఫినిష్ లుక్, అప్ డేట్ చేసిన బాడీవర్క్, ఆల్-బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు కలర్ లెదర్ సీట్లు కలిగి ఉన్నాయి. సుజుకి కొత్త రంగులలో మెటాలిక్ మ్యాట్ బోర్డెక్స్ తో యాక్సెస్ 125 ఎస్ఈ కూడా అందిస్తోంది.

యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసిన సుజుకి: ధర, ఫీచర్లు

అదనపు ఫీచర్ల పరంగా, యాక్సెస్ 125 ఎస్ఈ ఫోన్ ఛార్జింగ్, లాంగ్ సీట్ మరియు మరింత సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్, డిజిటల్ మీటర్, పెద్ద అండర్ సీట్ స్టోరేజీ మరియు స్టైలిష్ హెడ్ ల్యాంపుల కొరకు స్టాండర్డ్ డిసి సాకెట్ తో వస్తుంది.

యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసిన సుజుకి: ధర, ఫీచర్లు

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

దేవశిష్ హండా( వైస్ ప్రెసిడెంట్, సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్) ఈవిధంగా అన్నారు, "సుజుకి యాక్సెస్ 125 దేశంలో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ టైటిల్ ను కొనసాగిస్తూ ఉంది, మరియు ఇప్పుడు ఒక పునరుద్ధరించబడిన ప్రత్యేక సంచికను తీసుకువచ్చినందుకు సంతోషిస్తున్నాం.

యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసిన సుజుకి: ధర, ఫీచర్లు

ఈ స్కూటర్ లో పవర్, పెర్ఫార్మెన్స్, స్టైల్ విషయంలో రాజీపడకుండా మెరుగైన మైలేజ్ ను అందిస్తుంది. యాక్సెస్ 125 అనేది సుజుకీ యొక్క ఇండియా గ్రోత్ స్టోరీలో ప్రధాన కంట్రిబ్యూటర్ మరియు కస్టమర్ నుంచి అందుకున్న ఆదరణ ప్రతిధ్వనించే విధంగా చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం."

యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసిన సుజుకి: ధర, ఫీచర్లు

రిఫ్రెష్ అయిన సుజుకి యాక్సెస్ 125 ఎస్ఈ లో, 124 సిసి సింగిల్-సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ తో పవర్ ఫుల్ గా వస్తుంది. ఇది 8.7 బిహెచ్ పి వద్ద 7,000 ఆర్పిఎమ్ మరియు 10.2 ఎన్ఎమ్ టార్క్ వద్ద 5,000 ఆర్పిఎమ్ ను ఉత్పత్తి చేయును.

యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసిన సుజుకి: ధర, ఫీచర్లు

సుజుకి తన టెక్నాలజీ, వన్-పుష్ ఈజీ-స్టార్ట్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్ మరియు ఒక ఇన్ బిల్ట్ సెక్యూరిటీ సిస్టమ్ తో స్కూటర్ కు అదనపు ఫీచర్లను కూడా అందిస్తోంది.

యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసిన సుజుకి: ధర, ఫీచర్లు

పైన చెప్పిన కొత్త రంగులలో కాకుండా రిఫ్రెష్ అయిన సుజుకి యాక్సెస్ 125 ఎస్ఈ మెటాలిక్ మ్యాట్ బ్లాక్, మెటాలిక్ సోనిక్ సిల్వర్ మరియు పియర్ల్ మిరేజ్ వైట్ లో అందుబాటులో ఉంది. సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ ధర రూ. 61,788, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసిన సుజుకి: ధర, ఫీచర్లు

125 సిసి సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ లలో సుజుకి యాక్సెస్ 125 ఒకటి. ఈ ప్రత్యేక సంచిక నమూనా అదనపు లక్షణాలు మరియు నవీకరించబడిన స్టైలింగ్ తో వస్తుంది. సుజుకి యాక్సెస్ 125 ఎస్ఈ పై టీవీఎస్ ఎన్ టార్క్ 125, హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125 మరియు హోండా ఆక్టివా 125 పోటీ పడుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 17, 2019, 11:42 [IST]
English summary
2019 Suzuki Access 125 SE Launched In India. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+