జిక్సర్ సిరీస్ లో మరో బైక్ విడుదల చేసిన సుజుకి

సుజుకీ జిక్సర్ బైక్స్‌ రోడ్లపై కనిపిస్తూనే ఉంటాయి. దేశంలోని స్ట్రీట్‌ఫైటర్ బైక్స్‌లో ఇవి కూడా ఒకటి. ఇదివరకు ఇవి ఇతర బైక్స్‌తో బాగానే పోటీ పడుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఎందుకనో డల్ అయ్యిపోయాయి. మార్కెట్లో దేశీయంగా తిరిగి పుంజుకోవడానికి సుజికి కొత్త జిక్సర్ ఎడిషన్ ను లాంచ్ చేసింది, ఇందులో ఉన్న కొత్త ఫీచర్లను, అప్ డేట్ లను, ధర వివరాలను తెలుసుకొందామా..

జిక్సర్ సిరీస్ లో మరో కొత్త బైక్ ను విడుదల చేసిన సుజుకి

సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ఈ రోజు జిక్సర్ ఎస్ఎఫ్ మోటోజిపి ఎడిషన్ ను ప్రారంభించింది. సుజుకి రేసింగ్ లెవెల్లో ఇది ఒక ట్రిబ్యూట్ అని చెప్పవచ్చు. ఇందులో డిజైన్ ఎలిమెంట్ కలిసి టీమ్ సుజుకీ ఎస్టార్ డికల్స్, వీల్ పిన్ స్ట్రైప్స్, మరియు రేసింగ్ స్ఫూర్తితో దీనిని తీసుకొచ్చారు.

జిక్సర్ సిరీస్ లో మరో కొత్త బైక్ ను విడుదల చేసిన సుజుకి

కొత్త జిక్సర్ ఎస్ఎఫ్ మోటోజిపి ఎడిషన్, 2019 సుజుకి మోటోజిపి జిఎస్ఎక్స్-ఆర్ఆర్ ఎడిషన్ నుండి ప్రేరణ పొందిన అదే థీమ్ మరియు సుజుకి రేసింగ్ బ్లూ కలర్ ను కలిగి ఉంది.

జిక్సర్ సిరీస్ లో మరో కొత్త బైక్ ను విడుదల చేసిన సుజుకి

జిక్సర్ ఎస్ఎఫ్ మోటోజిపి ఎడిషన్ లో 155 సిసి, ఫోర్ స్ట్రోక్, సింగిల్ సిలెండర్ ఫ్యూయల్ ఇంజెక్షన్, ఎయిర్ కూల్డ్ ఎస్ఓహెచ్సి ఇంజిన్ తో 14.1బిహెచ్ పి వద్ద 8000 ఆర్పిఎమ్, మరియు 14.0 ఎన్ఎమ్ వద్ద 6000 ఆర్పిఎమ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

జిక్సర్ సిరీస్ లో మరో కొత్త బైక్ ను విడుదల చేసిన సుజుకి

ఇంధన సమర్థత మరియు పనితీరు విషయానికి వస్తే ఒక ఏరోడైనమిక్ డిజైన్, షార్ప్ క్యారెక్టర్ లైన్స్, మరియు గ్రావిటీ సెంటర్ వంటి లక్షణాలుంటాయి. ఇది వేహికల్ స్టైలింగ్ మరియు ఫంక్షనాలిటీని పెంపొందిస్తుంది. మెరుగైన సౌకర్యం కొరకు క్లిప్ ఆన్ హ్యాండిల్ రైడర్ పొజిషన్ ని మెరుగుపరుస్తుంది.

జిక్సర్ సిరీస్ లో మరో కొత్త బైక్ ను విడుదల చేసిన సుజుకి

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

దీనిని హ్యాండిల్ చేయడం తేలిక, ఇది ఏబిఎస్ తో స్పోర్టివ్ రైడింగ్ అనుభూతిని కలిగిస్తుంది. జిక్సర్ ఎస్ఎఫ్ మోటోజిపి ఎడిషన్ ఔత్సాహికులకు ఈ బ్రాండ్ నుంచి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు.

జిక్సర్ సిరీస్ లో మరో కొత్త బైక్ ను విడుదల చేసిన సుజుకి

దేవశిష్ హాండా( వైస్ ప్రెసిడెంట్, సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్) మాట్లాడుతూ, "జిక్సర్ ఎస్ఎఫ్ సీరిస్ మోటోజిపి ఎడిషన్ ని మేం పరిచయం చేయడం సంతోషంగా ఉంది, లెజెండరీ జిఎస్ఎక్స్-ఆర్ సీరిస్ ' స్ఫూర్తితో దీనిని తాయారు చేసారు.

జిక్సర్ సిరీస్ లో మరో కొత్త బైక్ ను విడుదల చేసిన సుజుకి

ఆర్ట్ డిజైన్ యొక్క స్థితి, హై అవుట్ పుట్ మరియు తక్కువ ఫ్యూయల్ వినియోగ ఇంజిన్ తో పాటు ఈజీ టూ హ్యాండిల్ ఛాసిస్ జిక్సర్ ఎస్ఎఫ్ సీరిస్ మోటోజిపి ఎడిషన్ ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయబడింది.

జిక్సర్ సిరీస్ లో మరో కొత్త బైక్ ను విడుదల చేసిన సుజుకి

సుజుకి మోటార్ సైకిల్ ఇండియా, మోటోజిపి రంగు విషయానికి వస్తే నూతనంగా ప్రారంభించిన జిక్సర్ ఎస్ఎఫ్ సిరీస్ కు అమోఘమైన స్పందన లభించింది. ఈ రోజు భారత మార్కెట్లో దీని లాంచ్ చేయడం సంతోషగా ఉంది" అని అన్నాడు.

జిక్సర్ సిరీస్ లో మరో కొత్త బైక్ ను విడుదల చేసిన సుజుకి

కొత్త సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ మోటోజిపి ఎడిషన్ రూ.1.10 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధర వస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ కంటే కేవలం రూ. 800 ఎక్కువ.సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 మోటోజిపి ఎడిషన్ ను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నారు, ఇది వచ్చే నెలలో రావచ్చు.

జిక్సర్ సిరీస్ లో మరో కొత్త బైక్ ను విడుదల చేసిన సుజుకి

దీనిలో 249 సిసి నుంచి పవర్ పొందుతుంది, సుజుకీ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ (SOCS), ఫోర్ స్ట్రోక్, సింగిల్ సిలెండర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ SOCS ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇందులోని ఇంజన్ 26.5బిహెచ్పి వద్ద 9000 ఆర్పిఎమ్ మరియు 22.6 ఎన్ఎమ్ వద్ద 7500 ఆర్పిఎమ్ కలిగి ఉంది. ఇందులో తేలికపాటి మరియు వేగవంతమైన ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఫీచర్స్ డ్యూయల్ ఛానల్ యాంటి లాక్ బ్రేక్ సిస్టం (ఏబిఎస్) కూడా ఉండవచ్చు.

Most Read Articles

English summary
New Suzuki Gixxer SF MotoGP Edition Launched In India. Read in Telugu.
Story first published: Thursday, July 18, 2019, 17:03 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X