2020 సుజుకి హయాబుసా విడుదల: ధర రూ. 13.75 లక్షలు

సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా మార్కెట్లోకి సరికొత్త 2020సుజుకి హయాబుసా బైకును లాంచ్ చేసింది. 2020 సుజుకి హయాబుసా ధర రూ. 13.75 లక్షల ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు సుజుకి ప్రతినిధులు పేర్కొన్నారు.

2020 సుజుకి హయాబుసా విడుదల: ధర రూ. 13.75 లక్షలు

సరికొత్త హయాబుసా మెటాలిక్ థండర్ గ్రే మరియు క్యాండీ డేరింగ్ రెడ్ అనే రెండు విభిన్న రంగుల్లో లభిస్తోంది. కొత్త తరం హయాబుసాలో అప్‌డేటెడ్ గ్రాఫిక్స్ మరియు ఫ్రంట్ వీల్‌‌కు న్యూ బ్రేక్ కాలిపర్స్ వచ్చాయి.

2020 సుజుకి హయాబుసా విడుదల: ధర రూ. 13.75 లక్షలు

పైన పేర్కొన్న మార్పులు మినహాయిస్తే సరికొత్త 2020 సుజుకి హయాబుసా బైకులో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇందులో అదే మునుపటి బిఎస్-IV వెర్షన్ ఇంజన్ యధావిధిగా వచ్చింది. అతి త్వరలో బిఎస్-VI ఇంజన్ తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దీనిని పరిమిత సంఖ్యలోనే విక్రయిస్తున్నారు.

2020 సుజుకి హయాబుసా విడుదల: ధర రూ. 13.75 లక్షలు

ఇండియన్ మార్కెట్లో సుజుకి హయాబుసా మోడల్‌కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు, అంతే కాకుండా సుజుకి మోటార్ సైకిల్స్ మొట్టమొదటి మేడిన్ ఇండియన్ అతి పెద్ద బైక్ కూడా ఇదే. కస్టమర్ల కోసం ఈ మోస్ట్ పాపులర్ పర్ఫామెన్స్ సూపర్ బైకును 2020 ఎడిషన్‌లో మళ్లీ లాంచ్ చేశామని పేర్కొన్నారు.

2020 సుజుకి హయాబుసా విడుదల: ధర రూ. 13.75 లక్షలు

2020 హయాబుసా బైకులోని 1,340సీసీ కెపాసిటీ గల నాలుగు సిలిండర్ల లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 197బిహెచ్‌‌పి పవర్ మరియు 155ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కేవలం 2.74 సెకండ్లలోనే 100కిమీల వేగాన్ని అందుకునే హయాబుసా గరిష్ట వేగం గంటకు 299కిమీలుగా ఉంది.

2020 సుజుకి హయాబుసా విడుదల: ధర రూ. 13.75 లక్షలు

పూర్తి స్థాయిలో దేశీయంగా తయారైన విడి భాగాలతో ఇండియాలో తయారవుతున్న మొట్టమొదటి సుజుకి స్పోర్ట్స్ బైక్ సుజుకి హయాబుసా. 2017 నుండి సుజుకి హయాబుసాను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నారు. దిగుమతి చేసుకునే వాటి కంటే దేశీయంగా తయారయ్యే బైకుల ధరలు చాలా తక్కువగా ఉంటాయి.

2020 సుజుకి హయాబుసా విడుదల: ధర రూ. 13.75 లక్షలు

వచ్చే రెండు మూడేళ్లలోపు సరికొత్త హయాబుసా మోడల్‌ను ప్రపంచ మార్కెట్ కోసం కొత్తగా డెవలప్ చేస్తున్నట్లు సుజుకి ఓ కథనంలో పేర్కొంది. సరికొత్త హయాబుసా పూర్తిగా కొత్త డిజైన్, నూతన ఇంజన్‌తో రానుంది. ఈ మోడల్ 2021 లేదా ఆ తర్వాతనే విపణిలోకి వచ్చే అవకాశం ఉంది.

2020 సుజుకి హయాబుసా విడుదల: ధర రూ. 13.75 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో హయాబుసా అంటే తెలియనివారుండరు, ఈ సరికొత్త 2020 సుజుకి హయాబుసా మోడల్ ఈ జనరేషన్ యొక్క చివరి వెర్షన్ ఇదే. ఏప్రిల్ 01, 2020 తర్వాత ఈ మోడల్ మార్కెట్లో ఉండదు. నూతన ఉద్గార ప్రమాణాల కారణంగా ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ మార్కెట్లలో దీని సేల్స్ నిలిపివేశారు. దీని స్థానంలో బిఎస్-6 రెగ్యులేషన్స్‌కు అనుగుణంగా కొత్త హయాబుసాను తీసుకురానున్నట్లు తెలిసింది.

More from DriveSpark

Article Published On: Monday, December 16, 2019, 12:18 [IST]
English summary
New (2020) Suzuki Hayabusa Launched In India: Priced At Rs 13.75 Lakh. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+