జులై 2019 భారత్ లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్: హీరో మోటార్స్ దే పైచేయి

జూలై నెలలో భారత్ లో టాప్ సెల్లింగ్ బైక్ జాబితాను విడుదల చేసారు. టాప్-సెల్లింగ్ బైకు యొక్క జాబితా హీరో మోటోకార్ప్ ను మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది, వాటిలో హీరో స్ల్పెండర్ మరియు హెచ్ఎఫ్ డీలక్స్ మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. అయితే మిగిలిన స్థానాలలో ఏ ఏ బైకులు ఉన్నాయో, పోయిన ఏడాది జూలై తో పోలిస్తే 2019 జులై లో అమ్మకాలు ఎలా ఉన్నాయో ఇవాల్టి కథనంలో..

జులై 2019 భారత్ లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్: హీరో మోటార్స్ దే పైచేయి

టాప్-10 జాబితా నుంచి చూస్తే జూలై 2019 లో మొదటి స్థానాన్ని ఈ సారి కూడా హీరో స్ల్పెండర్ ఆక్రమించింది. ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ మోటార్ సైకిల్ లలో హీరో స్ల్పెండర్ ఒకటి అని చెప్పవచ్చు.

జులై 2019 భారత్ లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్: హీరో మోటార్స్ దే పైచేయి

అయితే ఈ కంపెనీ గత నెలలో 1,78907 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది జూలై 2018 లో 2.60 లక్షల పైచిలుకు అమ్మకాలను తో పోలిస్తే 30 శాతానికి పైగా క్షిణించింది.

జులై 2019 భారత్ లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్: హీరో మోటార్స్ దే పైచేయి

అలాగే రెండో స్థానాన్ని ఆక్రమించుకున్న హీరో హెచ్ఎఫ్ డీలక్స్ గత నెలలో 1,69632 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. హెచ్ఎఫ్ డీలక్స్ కూడా ఇండియన్ మార్కెట్లో స్ల్పెండర్ తో సహా విక్రయించే ఒక కమ్యూటర్ స్థాయి మోటార్ సైకిల్ ఆఫరింగ్.

జులై 2019 భారత్ లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్: హీరో మోటార్స్ దే పైచేయి

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ జూలై 2019 లో తన స్థానాన్ని నిలుపుకున్నప్పటికీ, అమ్మకాల పరంగా కూడా తక్కువ గణాంకాలను నమోదు చేసింది. అయితే, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అమ్మకాల క్షిణించిన శాతం మాత్రం స్ల్పెండర్ కంటే 7 శాతం తక్కువగా ఉంది.

జులై 2019 భారత్ లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్: హీరో మోటార్స్ దే పైచేయి

జూలై 2019 లో బైక్ అమ్మకాల జాబితాలో హోండా సిబి షైన్ మూడవ స్థానంలో ఉంది. సిబి షైన్ గత నెలలో అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేసుకుంది. గత ఏడాది ఇదే నెల వ్యవధిలో 86,160 యూనిట్లతో పోలిస్తే జూలై 2019 లో 94,559 యూనిట్ల బైక్ లను కంపెనీ విక్రయించింది.

జులై 2019 భారత్ లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్: హీరో మోటార్స్ దే పైచేయి

తరువాత స్థానాలను వరుసగా హీరో గ్లామర్, బజాజ్ పల్సర్, బజాజ్ ప్లాటినా మరియు హీరో ప్యాషన్ ఆక్రమించాయి. ఈ బైకులు వరుసగా నాలుగు, ఐదు, ఆరవ మరియు ఏడవ స్థానాలలో నిలిచాయి. ఇంకా వివరంగా చూస్తే..

Most Read: బన్నీ లేటెస్ట్ లగ్జరీ రేంజ్ రోవర్.. ధర ఎంతో తెలుసా

జులై 2019 భారత్ లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్: హీరో మోటార్స్ దే పైచేయి

హీరో గ్లామర్ గత నెలలో 71,160 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకోగా, జూన్ 2019 బజాజ్ పల్సర్ అమ్మకాలను దాటేసింది. మరోవైపు బజాజ్ పల్సర్ గత నెలలో 62,469 యూనిట్లు నమోదు చేసింది.

Most Read: దారుణంగా మోసపోయాం... జావా కంపెనీపై మండిపడుతున్న కస్టమర్లు

జులై 2019 భారత్ లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్: హీరో మోటార్స్ దే పైచేయి

అదే విధంగా బజాజ్ ప్లాటినా, హీరో ప్యాషన్ బైకులు 2019 జూలై నెలలో వరుసగా 52,489 యూనిట్లు, 43,439 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుని ఆరు, ఏడో స్థానాలలో నిలిచాయి.

భారత్ లో టాప్-10 బెస్ట్ సెల్లింగ్ బైకుల జాబితా ఇదిగో:

Rank Motorcycle Jul-19 Jul-18 Diff%
1 Hero Splendor 1,78,907 2,60,865 -31.42
2 Hero HF Deluxe 1,69,632 1,83,694 -7.66
3 Honda CB Shine 94,559 86,160 9.75
4 Hero Glamour 71,160 74,553 -4.55
5 Bajaj Pulsar 62,469 63,388 -1.45
6 Bajaj Platina 52,489 40,074 30.98
7 Hero Passion 43,439 88,354 -50.84
8 Bajaj CT 100 39,728 76,776 -48.25
9 Royal Enfield Classic 350 29,439 44,054 -33.18
10 Honda CB Unicorn 28,250 24,753 14.13

Most Read: బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

జులై 2019 భారత్ లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్: హీరో మోటార్స్ దే పైచేయి

టాప్-10 జాబితాలో చివరి మూడు స్థానాలను 39,728 యూనిట్ల అమ్మకాల తో ఎనిమిదో స్థానంలో బజాజ్ సిటి100 ఆక్రమించింది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లో తొమ్మిదవ స్థానంలో 29,439 యూనిట్లు అమ్మకాలను నమోదు చేసింది.

జులై 2019 భారత్ లో బెస్ట్ సెల్లింగ్ బైక్స్: హీరో మోటార్స్ దే పైచేయి

అలాగే 28,250 యూనిట్ల అమ్మకాలతో పదవ స్థానంలో హోండా సిబి యునికార్న్ నిలిచింది. గత నెలలో ఈ జాబితాలో పదవ స్థానంలో ఉన్న టీవీఎస్ అపాచీ ని, 14 శాతం వృద్ధితో హోండా సిబి యునికార్న్ టాప్-10 జాబితా నుంచి వెనక్కి నెట్టేసింది.

Most Read Articles

English summary
Top-Selling Bikes In India For July 2019: Hero Splendor Tops The List With 1.78 Lakh Units - Read in Telugu
Story first published: Monday, August 26, 2019, 16:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more