మే నెల టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు ఇవే!

భారత్‌లో స్కూటర్లను ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే గతేడాది మే నెలతో పోలిస్తే ప్రస్తుత ఏడాది అదే నెలలో టాప్ సెల్లింగ్ స్కూటర్ల అమ్మకాలలో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ మోడళ్లకు కస్టమర్ల ఆదరణ పొందాయి. అయితే వీటి అమ్మకాలు, కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన మోడళ్ల అమ్మకాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం రండి.

మే నెల టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు ఇవే!

మే 2019 నెల భారత్ లో టాప్ సెల్లింగ్ స్కూటర్లు వివరాలు విడుదల అయ్యాయి. ఈ టాప్-10 స్కూటర్లు సెల్లింగ్ లిస్ట్ లో హోండా యాక్టివా భారత మార్కెట్లో మరో సారి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో హోండా యాక్టివా 5జి ఒకటి.

మే నెల టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు ఇవే!

మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ఈ జాబితాలో టాప్-ఫైవ్ స్కూటర్లు ఏప్రిల్ 2019 ఉన్న స్కూటర్లు యథాతథంగా వాటి స్థానంలో ఉన్నాయి. హోండా యాక్టివా, టివిఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ 125, హోండా డియో మరియు టివిఎస్ ఎన్‌టార్క్ 125 ఏప్రిల్ మే మే నెలలో తమ స్థానాలను నిలుపుకొన్నాయి.

మే నెల టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు ఇవే!

అయితే ఈ స్కూటర్ల అమ్మకాల సంఖ్య మాత్రం మారింది. మే 2019 లో హోండా యాక్టివా 2,18734 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకుంది, ఏప్రిల్ తో పోలిస్తే దాదాపు 8,000 యూనిట్ల పెరుగుదల. టివిఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ 125 అమ్మకాలు కూడా ఈ నెల పెరిగాయి.

మే నెల టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు ఇవే!

టివిఎస్ జూపిటర్ రెండవ స్థానంలో 56,797 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకోగా, సుజుకి యాక్సెస్125 మాత్రం 51,414 యూనిట్లు అమ్ముడై, ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

మే నెల టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు ఇవే!

హోండా డియో నాలుగవ స్థానంలో 46,840 యూనిట్ల అమ్మకాలతో వద్ద స్థిరపడింది.టివిఎస్ ఎన్‌టార్క్ 125 ఈ నెలలో 21,010 యూనిట్ల రికార్డ్ చేసిన అమ్మకాల తో టాప్-ఫైవ్ స్కూటర్ లిస్ట్ లో ఉంది.

మే నెల టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు ఇవే!

ఈ జాబితాలో చివరి 5 స్థానాలలో హీరో డెస్టినీ 125, యమహా ఫాస్సినో, హీరో మాస్ట్రో, హోండా గ్రాజియా, యమహా రాయ్ మోడల్ లు నిలిచాయి. వాటి వివరాలను చూస్తే

మే నెల టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు ఇవే!

16,752 అమ్మకాలతో హీరో డెస్టినీ 125 ఆరవ స్థానంలో కొనసాగుతోంది. తరువాత యమహా ఫాస్సినో 15,459 యూనిట్లతో 7వ స్థానంలో నిలిచింది. హీరో మాస్ట్రో- 13,423 యూనిట్లతో, హోండా గ్రాజియా - 11,513 యూనిట్లతో వరుసగా తరువాతి స్థానాలలో కొనసాగుతున్నాయి.

మే నెల టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు ఇవే!

చివరగా యమహా రాయ్ -10,920 యూనిట్లతో నిలిచింది. హీరో గత నెలలో ఇండియన్ మార్కెట్లో రెండు కొత్త స్కూటర్లను లాంఛ్ చేశారు. ఇందులో హీరో ప్లెషర్ 110 మరియు హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125.

మే 2019 నెలలో ఇండియాలో టాప్ సెల్లింగ్ స్కూటర్ లిస్ట్:

ర్యాంక్ మోడల్ మే 2019 అమ్మకాలు
1

హోండా యాక్టివా5జి 2,18,734

2

టివిఎస్ జూపిటర్ 56,797

3

సుజుకి యాక్సెస్ 125 51,414

4

హోండా డియో 46,840

5

టివిఎస్ ఎన్‌టార్క్ 21,010

6

హీరో డెస్టినీ 125 16,752

7

యమహా ఫాస్సినో 15,459

8

హీరో మాస్ట్రో 13,423

9

హోండా గ్రాజియా 11,513

10

యమహా రాయ్ 10,920

మే నెల టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు ఇవే!

ఈ కొత్త స్కూటర్లు రెండూ కొత్త ఫీచర్లు మరియు కొత్త ఎక్విప్మెంట్ తో అందించారు. అయితే భారత మార్కెట్ లో ఈ రెండు కొత్త ఉత్పత్తులతో తన అమ్మకాలను మెరుగుపరుచుకోవాలని హీరో మోటోకార్ప్ ఆశిస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, June 22, 2019, 15:39 [IST]
English summary
The top-selling scooters in India for May 2019 is out. The top-selling scooters list showcases the Honda Activa continuing its dominant run in the segment for another month in the Indian market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+