టివిఎస్ నుంచి కొత్త ఫ్యూయల్ పవర్ తో అపాచీ ఆర్టిఆర్ విడుదల

By N Kumar

ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ టివిఎస్, భారత మార్కెట్ లోకి మరో కొత్త మోడల్ బైక్ ని ప్రవేశపెట్టింది. టివిఎస్ అపాచీ ఆర్టిఆర్ ఎఫ్ఐ ఈ100 పేరిట బైక్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. మరి ఇదో కొత్త ఫ్యూయల్ పవర్ తో వస్తోంది, ఏంటా ఫ్యూయల్, అలాగే ఇందులో ఉన్న కొత్త ఫీచర్ల వివరాలను తెలుసుకొందాం రండి.

టివిఎస్ నుంచి కొత్త ఫ్యూయల్ పవర్ తో అపాచీ ఆర్టిఆర్ విడుదల

ప్రస్తుత పెట్రోల్ మరియు డీజల్ పరిస్తితి నుండి ఆటోమొబైల్ పరిశ్రమ నెమ్మదిగా మారుతోంది అనడంలో సందేహం లేదు. తరిగిపోతున్న వనరులతో, తయారీదారులు హైడ్రోజన్ ఆధారిత వాహనాలతో సహా అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను అందించటం ప్రారంభించారు.

టివిఎస్ నుంచి కొత్త ఫ్యూయల్ పవర్ తో అపాచీ ఆర్టిఆర్ విడుదల

భారతదేశ మార్కెట్ క్రమంగా కొత్త ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తులను పొందుతోంది. టివిఎస్ అపాచీ ఆర్టిఆర్200 ద్వారా ఈథనాల్ ఫ్యూయల్ ద్వారా పవర్ పొందే మొట్టమొదటి తయారీదారుగా అవతరించింది. ప్రత్యామ్నాయ ఇంధనాలపై వాహనాల ఆవశ్యకత పెరుగుతోందని, అలాంటి ఎకో ఫ్రెండ్లీ బయో ఫ్యూయల్ ఒకటి ఈథనాల్.

టివిఎస్ నుంచి కొత్త ఫ్యూయల్ పవర్ తో అపాచీ ఆర్టిఆర్ విడుదల

ఇది చెరకు మొలాసిస్ మరియు జొన్న వంటి మొక్కల అవశేషాల నుండి తయారు చేయబడి శిలాజ ఇంధనాల కంటే గణనీయంగా శుభ్రపడుతుంది.

ఇథనాల్ ప్రాథమికంగా ఆల్కహాల్ మరియు గ్యాసోలిన్ యొక్క ఆక్సిజనేటెడ్ ఫ్యూయల్ మిశ్రమం, ఇది తక్కువ ఖర్చుల్లో అధిక ఆక్టన్ నెంబరును ఇస్తుంది మరియు క్లీనర్ కంబస్టన్ కూడా ఉంటుంది. ఇథనాల్ ను ఇంధనంగా వాడడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాన్ని 35 శాతం వరకు తగ్గిస్తుంది.

టివిఎస్ నుంచి కొత్త ఫ్యూయల్ పవర్ తో అపాచీ ఆర్టిఆర్ విడుదల

సల్ఫర్ డై ఆక్సైడ్ మరియు నలుప పదార్థం యొక్క ఉద్గారంలో గణనీయమైన తగ్గుదల ఉంది. ఇది పునరుత్పాదక మొక్కల వనరుల నుండి తయారు చేయబడుతుంది, ఇథనాల్ బయో డీగ్రేడబుల్ మరియు ఇథనాల్ యొక్క వాడకం పెరగడం వలన పెట్రోలియం దిగుమతిని కూడా పెద్ద స్థాయిలో తగ్గించవచ్చు.

టివిఎస్ నుంచి కొత్త ఫ్యూయల్ పవర్ తో అపాచీ ఆర్టిఆర్ విడుదల

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

ఇక ఈ కొత్త బైక్ విషయానికి వస్తే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ కొత్త అపాచీ ఆర్టిఆర్200 ఎఫ్ఐ ఈ100 ను లాంచ్ చేసాడు. టివిఎస్ మొదటిగా అపాచీ ఆర్టిఆర్ 200 4వి ఇథనాల్ కాన్సెప్ట్ ప్రొడక్ట్ గా 2018 ఆటో ఎక్స్ పో లో ప్రదర్శించడం జరిగింది.

టివిఎస్ నుంచి కొత్త ఫ్యూయల్ పవర్ తో అపాచీ ఆర్టిఆర్ విడుదల

తొలుత ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. తరువాత దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈథనాల్ ఆధారిత అపాచీ ఆర్టిఆర్ 200 లభిస్తుంది. టివిఎస్ ఈ మోటార్ సైకిల్ ను రూ. 1.2 లక్షల ధరతో, ప్రస్తుతం మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటకల్లో అందుబాటులో ఉంచనుంది.

టివిఎస్ నుంచి కొత్త ఫ్యూయల్ పవర్ తో అపాచీ ఆర్టిఆర్ విడుదల

అపాచీ ఆర్టిఆర్200 ఎఫ్ఐ ఈ100, బైక్ అని పిలవటం వలన ఖచ్చితంగా అపాచీ యొక్క రెగ్యులర్ వర్షన్ గా కనిపిస్తుంది. అందువలన విభిన్నంగా కనిపించేలా చేయడానికి దీనికి కొత్త వైబ్రెంట్ గ్రీన్ గ్రాఫిక్స్ ను జోడించింది మరియు ఈ బైక్ యొక్క గ్రీన్ పవర్ ను కూడా కనపడే విధంగా ఉంటుంది.

టివిఎస్ నుంచి కొత్త ఫ్యూయల్ పవర్ తో అపాచీ ఆర్టిఆర్ విడుదల

ఈ గ్రాఫిక్స్ లో "ఈథనాల్" అనే పదాన్ని కూడా అమర్చారు. ఈ బైక్ కొత్త ట్విన్-స్ప్రే-ట్విన్-పోర్ట్ ఈఎఫ్ఐ టెక్నాలజీని కలిగి ఉంది, ఇది ప్రత్యేకంగా బర్నింగ్ ఈథనాల్ ఇంధనాన్ని కలిగి ఉంది. కొత్త సాంకేతికత మరింత మెరుగైన డ్రైవబిలిటీ, మాసివ్ రిడక్షన్ మరియు ఎమిషన్ లేవెళ్లను భారీగా తగ్గిస్తుందని టివిఎస్ పేర్కొంది.

టివిఎస్ నుంచి కొత్త ఫ్యూయల్ పవర్ తో అపాచీ ఆర్టిఆర్ విడుదల

అపాచీ ఆర్టిఆర్200 ఎఫ్ఐ ఈ100 లో 8,500 ఆర్పిఎమ్ వద్ద గరిష్టంగా 21బిహెచ్పి మరియు 7,000 ఆర్పిఎమ్ వద్ద 18.1 ఎన్ఎమ్ యొక్క టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 129 కిమీ /గం ఎగువ వేగాన్ని చేరుకోగలదు.

టివిఎస్ నుంచి కొత్త ఫ్యూయల్ పవర్ తో అపాచీ ఆర్టిఆర్ విడుదల

ఈథనాల్ ఫ్యూయల్ వలన ఇది చాలా ప్రత్యేకమైనది స్థానాన్ని పొందింది. వాహనాల్లో ఈథనాల్ వాడకం వల్ల కాలుష్య నివారణను కూడా చేయవచ్చు. భవిష్యత్తులో, టివిఎస్ ఇదే టెక్నాలజీతో స్కూటర్లను కూడా లాంఛ్ చేయవచ్చు.

Most Read Articles

English summary
TVS Apache RTR200 EF100 launched; India’s first ethanol bike. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X