టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ విడుదల: ధర ఎంతంటే?

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను రేస్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 62,995 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. సాధారణ ఎన్‌టార్క్ 125తో పోల్చుకుంటే రేస్ ఎడిషన్‌లో పలు రకాల కలర్ అప్‌డేట్స్ మరియు ఎన్నో కొత్త ఫీచర్లు వచ్చాయి.

ఈ పండుగ సీజన్‌లో కొత్త స్కూటర్ కొనాలనుకుంటున్నారా..? అయితే టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ గురించి తెలుసుకుందాం రండి..

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ విడుదల: ధర ఎంతంటే?

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లో వచ్చిన ప్రధాన హైలెట్ కొత్త ఫీలింగ్‌నిచ్చే సరికొత్త పెయింట్ స్కీమ్ మరియు స్పోర్టివ్ ఫీలింగ్‌నిచ్చే అగ్రెసివ్ బాడీ డిజైన్. అదనంగా రేస్ ఎడిషన్ స్కూటర్ మ్యాట్ బ్లాక్/మెటాలిక్ బ్లాక్ మరియు మెటాలిక్ రెడ్ అనే మూడు రకాల కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ విడుదల: ధర ఎంతంటే?

సరికొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్లో బాడీ మీద అక్కడక్కడా "రేస్ ఎడిషన్" లోగోలు వచ్చాయి. అదే విధంగా రైడర్‍కు రేసింగ్ ఫీలింగ్ కల్పించే "టీవీఎస్ రేసింగ్ "బాడీ డీకాల్స్ కూడా వచ్చాయి. కొత్త కలర్ ఆప్షన్లతో పాటు పలు కొత్త ఫీచర్లు కూడా వచ్చాయి. టీవీఎస్ ఎన్‍టార్క్ 125లో సరికొత్త ఎల్ఈడీ హెడ్‍‌ల్యాంప్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఈడీ ఫ్రంట్ లైట్లు ఉన్నాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ విడుదల: ధర ఎంతంటే?

పైన పేర్కొన్న మార్పులు మినహాయిస్తే డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకులేదు. స్టాండర్డ్ స్కూటర్‌ను ఏ మాత్రం తీసిపోకుండా అన్ని ఫీచర్లు ఇందులో కూడా యథావిధిగా వచ్చాయి. స్కూటర్ మరియు రైడర్ స్మార్ట్ ఫోన్‌కు అనుసంధానమై ఉండే బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీ కూడా అలాగే వచ్చింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ విడుదల: ధర ఎంతంటే?

స్మార్ట్ఎక్స్‌కనెక్ట్ అని పిలువబడే బ్లూటూత్ కనెక్టివిటీ రైడర్ ఫోన్‌కు వచ్చే కాల్స్, మెసేజ్‌లు మరియు ఇతర నోటిఫికేషన్లను స్కూటర్ హ్యాండిల్ మీద ఉన్న డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో చూపిస్తుంది. మొబైల్ యాప్ ద్వారా రైడర్ తన స్మార్ట్‌ఫోన్‌తో స్కూటర్‌ను కనెక్ట్ చేయవచ్చు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ విడుదల: ధర ఎంతంటే?

సాంకేతికంగా టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ స్కూటర్‌లో అదే మునుపటి శక్తివంతమైన 124సీసీ కెపాసిటీ గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 9.4బిహెచ్‌పి పవర్ మరియు 10.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2020లో నూతన ఉద్గార ప్రమాణాలు అమల్లోకి వచ్చేవరకూ బిఎస్-4 ఇంజన్ కొనసాగుతుందని సమాచారం.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ విడుదల: ధర ఎంతంటే?

టీవీఎస్ మోటార్ కంపెనీ సేల్స్ విభాగాధిపతి అనిరుధ్ హల్దార్ మాట్లాడుతూ, "టీవీఎస్ మోటార్ కంపెనీ 37 సంవత్సరాలు టీవీఎస్ రేసింగ్ సుధీర్ఘ అనుభవంతో ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను నిర్మించింది. ఈ స్కూటర్ విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 4 లక్షలకుపైగా ఎన్‌టార్క్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు వివరించారు."

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ విడుదల: ధర ఎంతంటే?

ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఒకటి, ఈ స్కూటర్ ఇప్పుడు "రేస్ ఎడిషన్"లో విడుదలవ్వడంతో యువ కస్టమర్లను ఎంతగానో ఆకర్షించనుంది. ఇది మార్కెట్లో ఉన్న సుజుకి యాక్సెస్ 125, హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125 మరియు హోండా యాక్టివా 125 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

ఈ పండుగ సీజన్‌లో మీరు ఏ స్కూటర్ కొంటున్నారో క్రింది కామెంట్ బాక్స్‌ ద్వారా మాతో పంచుకోండి...

Most Read Articles

English summary
TVS NTorq 125 Race Edition Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X