54 వేల ధరకే టీవీఎస్ రేడియాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల

టీవీఎస్ మోటార్ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి రేడియాన్ స్పెషల్ ఎడిషన్ బైకును లాంచ్ చేసింది. సరికొత్త టీవీఎస్ రేడియాన్ స్పెషల్ ఎడిషన్ మోటార్ సైకిల్ ధర రూ. 54,665 లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నట్లు ప్రకటించింది.

54 వేల ధరకే టీవీఎస్ రేడియాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల

టీవీఎస్ మోటార్ కంపెనీ "కమ్యూటర్ ఆఫ్ ది ఇయర్" అవార్డు పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని టీవీఎస్ రేడియాన్ బైకును స్పెషల్ ఎడిషన్‌లో ప్రవేశపెట్టారు. టీవీఎస్ రేడియాన్ బైకు కమ్యూటర్-లెవల్ మోటార్ సైకిల్‌గా దేశీయ మార్కెట్లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

54 వేల ధరకే టీవీఎస్ రేడియాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల

స్పెషల్ ఎడిషన్ టీవీఎస్ రేడియాన్ మోటార్ సైకిల్‌లో ఎన్నో మార్పులు జరిగాయి. ఇది వరకు లభించే రంగులతో పాటు అదనంగా క్రోమ్-బ్లాక్ మరియు క్రోమ్-బ్రౌన్ రంగుల్లో లభిస్తోంది. గ్రాఫిక్స్ మరియు బాడీ డీకాల్స్ స్టైల్‌ కూడా మారింది.

54 వేల ధరకే టీవీఎస్ రేడియాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల

క్రోమ్ ఫినిషింగ్ గల సైడ్ మిర్రర్లు, కార్బోరేటర్ కవర్, సరికొత్త ప్రీమియం బాడీ గ్రాఫిక్స్, కొత్త మెటాలిక్ లీవర్లు, "R" లోగో గల సరికొత్త ఫ్యూయల్ ట్యాంక్ మరియు ఎత్తైన రూపాన్ని కలిగి ఉన్న ఓవరాల్ డిజైన్ వంటివి హైలెట్‌గా నిలిచాయి. సురక్షితమైన రైడింగ్ కోసం బైక్ ఫ్రంట్ వీల్‌కు డిస్క్ బ్రేకింగ్ కూడా అందించారు.

54 వేల ధరకే టీవీఎస్ రేడియాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల

టీవీఎస్ సంస్థ రేడియాన్ కమ్యూటర్ మోటార్ సైకిల్‌ను తొలిసారిగా 2018 ఆగష్టులో ప్రవేశపెట్టారు. విడుదలైనప్పటి నుండి మార్కెట్లో అత్యుత్తమ సేల్స్ సాధిస్తూ.. కంపెనీ మంచి వృద్ధిని తెచ్చిపెట్టింది. గత ఏడాది కాలంలో సుమారుగా 2 లక్షలకు పైగా రేడియాన్ బైకులు రోడ్డెక్కాయి.

54 వేల ధరకే టీవీఎస్ రేడియాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల

టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెటింగ్ విభాగాధిపతి అనిరుధ్ హల్దార్ మాట్లాడుతూ, "టీవీఎస్ రేడియాన్ బైక్ పట్ల దేశవ్యాప్తంగా ఎంతో మంది కస్టమర్లు ధీమా వ్యక్తం చేశారు. విపరీతమైన పోటీ ఉన్న కమ్యూటర్ బైకుల సెగ్మెంట్లో టీవీఎస్ రేడియాన్ ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది. ఈ విజయానికి గుర్తుగా రేడియాన్ బైకును పలు విభిన్నమైన అప్‌డే‌ట్స్‌తో కస్టమర్ల కోసం స్పెషల్ ఎడిషన్‌గా తీసుకొచ్చినట్లు" చెప్పుకొచ్చారు.

Most Read: చెప్పులేసుకుని బండి నడిపితే వెయ్యి, లుంగీ కడితే 2 వేలు ఫైన్.. జైలు కూడా!!

54 వేల ధరకే టీవీఎస్ రేడియాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల

సాంకేతికంగా టీవీఎస్ రేడియాన్ బైకులో 109.7సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ డ్యూరో-లైఫ్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8.7ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రేడియాన్ మైలేజ్ లీటర్‌కు 69.3కిమీలు మరియు ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లుగా ఉంది.

Most Read: హోండా కొత్త స్కూటర్: సైడ్ స్టాండ్ వేసి ఉంటే స్టార్ట్ కాదు!

54 వేల ధరకే టీవీఎస్ రేడియాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల

టీవీఎస్ రేడియాన్ స్పెషల్ ఎడిషన్ బైకు రెండు విభిన్న కలర్ ఆప్షన్‌లతో పాటు, సాధారణ వెర్షన్ రేడియాన్ బైకు ఆరు విభిన్న రంగుల్లో లభిస్తోంది. అవి, పర్ల్ వైట్, మెటాలిక్ బ్లాక్, గోల్డెన్ బీజి, రాయల్ పర్పుల్, వొల్కానో రెడ్ మరియు టైటానియం గ్రే.

Most Read: ఫార్చ్యూనర్ ఫ్యాన్స్ కోసం: సెప్టెంబర్ 12న వస్తున్నా... సిద్దంగా ఉండండి

54 వేల ధరకే టీవీఎస్ రేడియాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ రేడియాన్ బైకు విడుదలైన ఏడాది కాలంలోనే మోస్ట్ పాపులర్ కమ్యూటర్ మోటార్ సైకిల్‌గా నిలిచింది. రేడియాన్ బైకు ధరను అత్యంత పోటీతత్వం ఉండేలా చాకచక్యంగా నిర్ణయించారు. ఇది విపణిలో ప్రస్తుతం ఉన్న హీరో స్ల్పెండర్, యమహా సెల్యూటో ఆర్ఎక్స్ మరియు హోండా సీబీ షైన్ మోడళ్లకు పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
TVS Radeon ‘Special Edition’ Launched In India: Priced At Rs 54,665
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X