లేడీస్‌కు శుభవార్త: అదిరిపోయే ధరకే విడుదలైన టీవీఎస్ స్కూటీ

టీవీఎస్ మోటార్ కంపెనీ లేడీస్‌ కోసం ఎంతో ప్రత్యేకంగా తీసుకొచ్చిన స్కూటీ పెప్+ స్కూటర్‌ను ఇప్పుడు సరికొత్త ఎడిషన్‌లో విడుదల చేశారు. మహిళలు, అమ్మాయిలు ఎంతగానో ఇష్టపడే స్కూటీ పెప్‌+ స్కూటర్‌ ఇప్పుడు సరికొత్త మ్యాట్ ఎడిషన్‌లో లభ్యమవుతోంది. టీవీఎస్ స్కూటీ పెప్+ మ్యాట్ ఎడిషన్ ధర రూ. 44,332 ఎక్స్-షోరూమ్‌గా ఖరారు.

లేడీస్‌కు శుభవార్త: అదిరిపోయే ధరకే విడుదలైన టీవీఎస్ స్కూటీ

టీవీఎస్ స్కూటీ పెప్+ ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పురస్కరించుకొని సరికొత్త మ్యాట్ ఎడిషన్‌ను లాంచ్ చేశారు. సరికొత్త స్కూటీ పెప్+ రెండు విభిన్న పెయింట్ స్కీమ్‌లో లభ్యమవుతోంది. అవి, కరోలా మ్యాట్ మరియు ఆక్వా మ్యాట్.

లేడీస్‌కు శుభవార్త: అదిరిపోయే ధరకే విడుదలైన టీవీఎస్ స్కూటీ

కొత్తగా వచ్చిన రెండు కొత్త పెయింట్ స్కీమ్స్‌తో పాటు 3డీ లోగో, ఫ్రెష్ గ్రాఫిక్, ఆకర్షణీయమైన సీట్ వంటి కొత్త హంగులు 25 ఏళ్ల స్కూటర్‌కు సరికొత్త రూపాన్ని తీసుకొచ్చాయి. ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ స్కూటర్ అంటే తెలియనివారుండరు. లేడీ కస్టమర్లకు మోస్ట్ ఫేమస్ స్కూటర్‌గా నిలిచిపోయింది.

లేడీస్‌కు శుభవార్త: అదిరిపోయే ధరకే విడుదలైన టీవీఎస్ స్కూటీ

సరికొత్త టీవీఎస్ స్కూటీ పెప్+ స్కూటర్‌లో స్టాండర్డ్ వేరియంట్‌ నుండి తీసుకొచ్చిన అదే 87.8సీసీ కెపాసిటీ గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ "ఇకో-థ్రస్ట్" పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 4.9బిహెచ్‌పి పవర్ మరియు 5.8ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

లేడీస్‌కు శుభవార్త: అదిరిపోయే ధరకే విడుదలైన టీవీఎస్ స్కూటీ

ఫీచర్ల విషయానికి వస్తే ముందువైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, అత్యుత్తమ గ్రౌండ్ క్లియరెన్స్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్, సైడ్ స్టాండ్ అలారమ్ మరియు అండర్-సీట్ స్టోరేజ్ హుక్స్ వంటివి మరెన్నో ఎక్స్‌ట్రా ఫీచర్లు ఉన్నాయి.

లేడీస్‌కు శుభవార్త: అదిరిపోయే ధరకే విడుదలైన టీవీఎస్ స్కూటీ

ఇందులో డే టైం రన్నింగ్ ల్యాంప్స్ మరియు ఓపెన్ గ్లోవ్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. టీవీఎస్ కంపెనీ పేటెంట్ హక్కులు పొందిన "ఈజీ (Eazy)" స్టాండ్ టెక్నాలజీని కూడా అందించారు. 30 శాతం తక్కువ బలాన్ని ఉపయోగించి సెంటర్ స్టాండ్ సులభంగా వేయొచ్చు. స్కూటీ పెప్+ స్కూటర్‍లో బిఎస్-6 ఇంజన్ అప్‌డేట్ అందివ్వాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

Most Read Articles

English summary
TVS Scooty Pep+ Matte Edition Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X