Just In
Don't Miss
- Sports
రెండో టీ20లో సిమ్మన్స్ హాఫ్ సెంచరీ.. వెస్టిండీస్ ఘన విజయం
- News
చట్టాల మార్పులు సరిపోవు: మహిళలపై నేరాలపై వెంకయ్యనాయుడు
- Finance
ఆర్బీఐ ప్రకటనతో ఇన్వెస్టర్లలో జోష్
- Movies
ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా.. జీవిత రాజశేఖర్ కామెంట్స్
- Technology
ఆపిల్ వాచీల కోసం కొత్త ఫీచర్, చిర్ప్ 2.0
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 14 వరకు
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
పెట్రోల్‌తో నడిచే బైకులకు మూడింది.. మార్కెట్లోకి పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ బైక్
ఎలక్ట్రిక్ బైకులు తయారు చేసే బెంగళూరు ఆధారిత స్టార్టప్ సంస్థ అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ మార్కెట్లోకి తమ తొలి బైకును విడుదల చేసింది. అల్ట్రావైలెట్ F77 మోటార్ సైకిల్ ధర రూ. 3 లక్షల నుండి రూ. 3.25 లక్షల ఆన్-రోడ్ బెంగళూరుగా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

F77 మోటార్ సైకిల్, మార్కెట్లోకి వచ్చిన తొలి పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ బైక్‌గా పేర్కొన్నారు. 4.2kWh గరిష్ట సామర్థ్యం గల మూడు మోడ్యులర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ సిస్టమ్ దీని సొంతం. బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 33.5బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

పెట్రోల్‌తో నడిచే బైకులకు గట్టిగా పోటీనిచ్చే ఈ మోటార్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 147కిలోమీటర్లుగా ఉంది మరియు 0-100కిమీల వేగాన్ని కేవలం 2.9 సెకండ్లలోనే అందుకుంటుంది. అంతే కాకుండా ఒక్కసారి ఛార్జింగ్‌తో ఏకెంగా 150కిమీల వరకు ప్రయాణిస్తుంది.

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, అల్ట్రావైలెట్ F77 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ మీద ఎలక్ట్రిక్ మోటార్‌ను ఫిక్స్ చేసి నిర్మించారు. ముందు వైపున ఇన్వర్టెడ్ క్యాట్రిడ్జ్ టైప్ ఫోర్క్ మరియు వెనుక వైపున ప్రిలోడ్ అడ్జస్టబిలిటీ గల మోనో-షాక్ అబ్జార్వర్ కలదు.

అల్ట్రావైలెట్ F77 ఎలక్ట్రిక్ బైకులో ముందు చక్రానికి 320ఎమ్ఎమ్ డిస్క్ మరియు వెనుక చక్రానికి 230ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు ముందు మరియు వెనుక వైపున 110/70 మరియు 150/60 కొలతల్లో టైర్లు అందించారు.

అల్ట్రావైలెట్ F77 డిజైన్ ఫ్యూచర్‌ను ప్రతిబింబిస్తుంది, దీనిని ఏవియేషన్ ఇండస్ట్రీ ప్రేరణతో డిజైన్ చేశారు. కంపెనీ దీనిని ఈ బైకును మూడు విభిన్న వేరియంట్లలో ఆవిష్కరించింది. అవి, లైటింగ్, లేజర్ మరియు షాడో. ఈ మూడు వేరియంట్లలో సాంకేతికంగా ఒక్కటే అయినప్పటికీ ఎక్ట్సీరియర్ డిజైన్‌లో కాస్త విభిన్నంగా ఉంటాయి.

ఫ్యూచర్ స్టైలింగ్ లక్షణాలతో వచ్చిన అల్ట్రావైలెట్ F77 బైకులో అతి తక్కువ బాడీ గ్రాఫిక్స్, మృదువైన ఫ్లో డిజైనింగ్ లైన్స్ ఇంకా ఎన్నో స్టైలిష్ అంశాలున్నాయి. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌లో స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి, వీటిలో ఇ-సిమ్ సపోర్ట్ గల ఎల్‌టీఈ కనెక్టివిటీ, 9-తలాల ఐఎమ్‌యు (ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్), ఉష్ణోగ్రతను పసిగట్టే సెన్సార్లు, యాక్టివ్ ట్రాకింగ్, షాక్ మరియు ఇంపాక్ట్ సెన్సార్లు, కస్టమర్లకు నచ్చినట్లుగా మార్చుకునే పర్ఫామెన్స్ ప్రొఫైల్ ఇంకా ఎన్నో ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
అల్టావైలెట్ F77 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మార్కెట్లో ఉన్న పర్ఫామెన్స్ బైకుల్లో ఒకటి. ఫీచర్లు, డిజైన్ మరియు పెట్రోల్ ఆధారిత బైకులకు ధీటైన పోటీనిచ్చే పర్ఫామెన్స్ దీని సొంతం. F77 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఎలక్ట్రిక్ బైకుల మార్కెట్లో ఉన్న రివోల్ట్ RV400 మోడల్‌కు గట్టి పోటినిస్తుంది.