ముంబై లో ప్రారంభమైన మొట్టమొదటి వెర్దెంచి లైఫ్ స్టైల్ గ్యారేజ్ని.
మోటారుసైకిల్ డిజైన్ మరియు కస్టమైజేషన్ విషయానికి వస్తే వెర్దెంచి భారతదేశ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధ కంపెనీలలో ఒకటి. ఇది కస్టమ్ ఆక్సిస్సోరీస్ రూపకల్పన, లేదా మొత్తం మోటార్సైకిల్ పునఃరూపకల్పన చేయడంలో ప్రసిద్ధి చెందింది , వెర్దెంచి వారి మోటార్ సైకిళ్ళు ప్రీమియం మార్పులు కోరుతూ మోటార్సైకిల్ ఔత్సాహికులకు గో టు బ్రాండ్ను ప్రారంభించింది.

2019 ఏప్రిల్ 2, న భారత్ లో వారి మొదటి లైఫ్ స్టైల్ గ్యారేజ్ ను ప్రారంభించనున్నట్లు వెర్దెంచి ప్రకటించింది. వెర్దెంచి లైఫ్స్టయిల్ గ్యారేజ్ను ముంబైలోని గోర్గావ్ లో స్థాపించారు,ఎక్కడ బైక్లు మరియు బైక్ ల యొక్క అప్గ్రేడ్ లను పొందవచ్చును.

వెర్దెంచి లైఫ్స్టైల్ గ్యారేజ్ ఇక్కడ ప్రధాన స్టోర్ గా ఉంది మరియు బైకర్ యొక్క లైఫ్స్టైల్ ని పెంచడానికి బెస్పోక్ మోటార్సైకిల్ అప్గ్రేడ్ సొల్యూషన్స్ నుంచి బైకర్ ఉత్పత్తుల విస్తృత శ్రేణిని పొందవచ్చును.

ప్రదర్శన మరియు అమ్మకం ఉత్పత్తులలో కస్టమ్ ఫ్యాషన్ హెల్మెట్లు, లైఫ్స్టైల్ రైడింగ్ గేర్,టి- షర్టులు,హూడిఎస్ మరియు షూస్ ఉంటాయి. వెర్దెంచి మోటార్సైకిళ్లకు అప్గ్రేడ్ మరియు భద్రతా ఉపకరణాలు, లైట్లు, సీట్లు, గార్డ్లు, సామాను వాహకాలు మొదలైనవి అమర్చడం చేస్తారు.

లైఫ్స్టైల్ గ్యారేజ్ను 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన ఒక సౌకర్యం భవనంలో స్థాపించారు మరియు కంపెనీ ఇప్పటికే రాష్ట్రంలో పవర్ టూల్స్, సిసర్ లిఫ్టులు, మొదలైన పరికరాలను కలిగి ఉంది.

వెర్దెంచి వ్యవస్థాపకుడు అక్షయ్ వర్దె చెప్పినదాని ప్రకారం, "వెర్దెంచి లైఫ్స్టయిల్ గ్యారేజ్ అనేది మా సుదీర్ఘమైన ఆలోచన 'ప్రతి మోటారుసైకిల్' యొక్క మార్కెట్లో బాగా అమ్ముడు అవ్వడం కోసం మేము చాలా ఫ్రాంచైజ్ దుకాణాలను స్థాపించడం చాలా సంతోషాన్ని ఇస్తోంది."

డ్రివెస్పార్క్ యొక్క అభిప్రాయం
వెర్దెంచి లైఫ్స్టైల్ గ్యారేజ్ ఒక బైకర్ కోసం పెటినటువంటి ఒక ప్రత్యేకమైన స్థలంగ చెప్పవచ్చును. ఇది ఒక ఓల్డ్ స్కూల్ బైకర్ వాతావరణాన్ని కలిగి ఉంటుంది, ప్రత్యేకించి వారిచే నిర్మించబడిన మోటార్ సైకిల్స్తో ఆ భావన కలుగుతుంది. వెర్దెంచి యొక్క ప్రొఫైల్, బబ్బర్స్, హెవీ క్రూయిజర్లు మరియు స్ట్రీట్ క్రూయిజర్లకు చెందినవి.


Click it and Unblock the Notifications








