టూ వీలర్లపై బిఎస్-6 ప్రమాణాలను తీసుకొస్తున్న యమహా మోటార్స్

యమహా మోటార్స్ ఇండియా నవంబర్ 2019 నాటికి బిఎస్-6 మోటార్ సైకిల్స్ మరియు స్కూటర్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇటీవల బిఎస్-6 మోడల్స్ రాకను ధృవీకరిస్తూ ఒక ప్రకటన చేసింది, ఏప్రిల్ 2020 ఉద్గార నిబంధనల గడువు కంటే ముందుగా వారి అన్ని టూ వీలర్స్ అప్డేట్ చేయనుంది, వివరాలలోకి వెళితే..

టూ వీలర్లపై బిఎస్-6 ప్రమాణాలను తీసుకొస్తున్న యమహా మోటార్స్

యమహా సంస్థ ముందుగానే ప్రకటించిన దాని ప్రకారం నవంబర్ 2019 నాటికి భారత మార్కెట్లో బిఎస్-6 మోటార్ సైకిల్స్ ను కంపెనీ ప్రవేశపెట్టనుండగా, స్కూటర్ల పై బిఎస్-6 వెర్షన్లు జనవరి 2020 నుంచి అమ్మకానికి వెళుతుందని తెలిపింది.

టూ వీలర్లపై బిఎస్-6 ప్రమాణాలను తీసుకొస్తున్న యమహా మోటార్స్

యమహా మోటార్ సైకిల్స్ మరియు స్కూటర్ల యొక్క బిఎస్-6 వేరియంట్ల యొక్క ఉత్పత్తి వ్యయంలో పెంపుదల కూడా మార్కెట్లో ఉత్పత్తుల యొక్క తుది వ్యయంపై ప్రభావం చూపుతుందని చెప్పటానికి ఈ ప్రకటన చేసింది.

టూ వీలర్లపై బిఎస్-6 ప్రమాణాలను తీసుకొస్తున్న యమహా మోటార్స్

ఈ ధరల పెరుగుదల మోడల్ మరియు వేరియంట్ ను బట్టి 12-15 శాతం మధ్య ఉంటుందని తెలిపింది. యమహా ' సైడ్ స్టాండ్ స్విచ్ ' అనే కొత్త ఫీచర్ ను ఎంపిక చేసిన వేరియెంట్ లపై స్టాండర్డ్ గా ఈ ఫీచర్ ను పెట్టనుంది.

టూ వీలర్లపై బిఎస్-6 ప్రమాణాలను తీసుకొస్తున్న యమహా మోటార్స్

ఈ అదనపు సేఫ్టీ ఫీచర్ ఏమిటంటే సైడ్ స్టాండ్ పూర్తిగా విత్ డ్రా అయ్యేంత వరకు ఇంజిన్ స్టార్ట్ కాకుండా నిరోధిస్తుంది. అయితే, యమహా ఇంకా ఏ మోడళ్లలో అప్డేటెడ్ బిఎస్-6 స్పెక్ ఇంజన్లను అందుకోనుందో ముందుగా ప్రకటించనుంది.

టూ వీలర్లపై బిఎస్-6 ప్రమాణాలను తీసుకొస్తున్న యమహా మోటార్స్

యమహా మోటార్స్ ఇండియా మార్కెట్లో పలు ఉత్పత్తులను విడుదల చేస్తూ 2019 లో కొంత మార్కెట్ను దక్కించుకుంది. ఇది కొత్త ఎఫ్జెడ్ఎస్ వి 3.0 మరియు ఎంటి-15 తో పాటు వారి ప్రముఖ ఆర్15 వి 3.0, ఎఫ్జెడ్ 25 మరియు ఫజర్ 25 లు ఏబిఎస్ వెర్షన్లతో పాటు మార్కెట్ లో ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది.

Most Read: ఒక్క ఆటోలో 24 మంది (వీడియో): తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన నెటిజన్లు

టూ వీలర్లపై బిఎస్-6 ప్రమాణాలను తీసుకొస్తున్న యమహా మోటార్స్

ఈ సంస్థ ఇటీవలే ఆర్15, ఎఫ్జడ్25, రే-జడ్ స్కూటర్ కు చెందిన ' మాన్స్టర్ ఎడిషన్ ' వేరియంట్లను కూడా ప్రవేశపెట్టింది. యమహా కాకుండా హీరో మోటోకార్ప్ ఇప్పటికే దేశీయంగా తొలి బిఎస్-6 ప్రామాణిక ద్విచక్ర వాహనాన్ని స్ప్లెండర్ ఐస్మార్ట్ కమ్యూటర్ మోటార్ సైకిల్ రూపంలో ఇప్పటికే విడుదల చేసింది.

Most Read: రైల్వే ట్రాక్‌ పై వైరల్ వీడియో చేసిన బి-టెక్ విద్యార్థి తరువాత ఏమి జరిగిందంటే!

టూ వీలర్లపై బిఎస్-6 ప్రమాణాలను తీసుకొస్తున్న యమహా మోటార్స్

హోండా ఈ ఏడాది చివరికల్లా భారత మార్కెట్లో కొంతమేర అమ్మకానికి వెళ్లాల్సి ఉందని, యాక్టివా 125 కు చెందిన బిఎస్-6 వర్షన్ ను కూడా ఒక షో లో ఇప్పటికే ప్రదర్శించారు.

Most Read: కూల్ కెప్టెన్.. కొత్త కారు ధర ఎంతో తెలుసా...!

టూ వీలర్లపై బిఎస్-6 ప్రమాణాలను తీసుకొస్తున్న యమహా మోటార్స్

ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి ఉన్న మోడళ్లలో చాలా వరకు బిఎస్-6 వర్షన్ ను త్వరలోనే అనుసరించనుంది. ఈ జపనీస్ బ్రాండ్ నుంచి అమ్మకానికి వెళ్లాల్సిన మొదటి బిఎస్-6 ఉత్పత్తులు ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్నాయి.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha To Introduce BS-VI Motorcycles & Scooters In India By End-2019 - Read in Telugu
Story first published: Wednesday, August 14, 2019, 10:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X