యమహా FZ & FZS-Fi బైకులు ఇప్పుడు బిఎస్6 వెర్షన్‌లో..

యమహా మోటార్ సైకిల్స్ ఇండియా FZ మరియు FZS-Fi బైకులను బిఎస్-6 వెర్షన్‌లో మార్కెట్లోకి లాంచ్ చేసింది. నవంబర్ 2019 నుండి బిఎస్-6 ప్రమాణాలను పాటించే కొత్త మోడళ్లను విపణిలోకి ప్రవేశపెడతామని యమహా ఇండియా గతంలోనే పేర్కొంది.

యమహా FZ & FZS-Fi బైకులు ఇప్పుడు బిఎస్6 వెర్షన్‌లో..

యమహా విడుదల చేసిన యమహా FZ బైక్ ధర రూ. 99,200 మరియు యమహా FZS-Fi బైక్ ధర రూ. 1.01 లక్ష ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఖరారు చేసింది. యమహా ప్రారంభించిన "కాల్ ఆఫ్ బ్లూ" అనే క్యాంపెయిన్‌లో భాగంగా ఈ రెండు మోటార్ సైకిళ్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

యమహా FZ & FZS-Fi బైకులు ఇప్పుడు బిఎస్6 వెర్షన్‌లో..

యమహా ఈ రెండు బైకులను బిఎస్-6 వెర్షన్‌లో విడుదల చేయడంతో పాటు యమహా FZS-Fi బైకులో రెండు సరికొత్త పెయింట్ స్కీమ్‌లను కూడా పరిచయం చేసింది. అవి, డార్క్ నైట్ మరియు మెటాలిక్ రెడ్. రెగ్యులర్ వెర్షన్ కంటే డార్క్‌నైట్ పెయింట్ స్కీమ్ వేరియంట్ ధర రూ. 1.02 లక్షలు, ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

యమహా FZ & FZS-Fi బైకులు ఇప్పుడు బిఎస్6 వెర్షన్‌లో..

యమహా FZS-Fi బిఎస్-6 ఈ రెండు అదనపు కలర్ ఆప్షన్లతో పాటు డార్క్ మ్యాట్, మ్యాట్ బ్లాక్, గ్రే మరియు కేయాన్ బ్లూ అనే మరో నాలుగు పెయింట్ స్కీమ్‌లలో కూడా ఇది లభ్యమవుతోంది. ఇదే తరహాలో యమహా FZ బిఎస్-6 బైకు కూడా మెటాలిక్ బ్లాక్ మరియు రేసింగ్ బ్లూ రంగుల్లో లభిస్తోంది.

యమహా FZ & FZS-Fi బైకులు ఇప్పుడు బిఎస్6 వెర్షన్‌లో..

యమహా రెండు బైకుల్లో 149సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, బిఎస్-6 ప్రమాణాలను పాటించే 12బిహెచ్‌పి పవర్ మరియు 13.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ కాంస్టెంట్ మెష్ గేర్‌బాక్స్‌ ఉంది.

రెండు బైకుల్లో కూడా పైన పేర్కొన్న మార్పులు మినహాయిస్తే, మరెలాంటి మార్పులు జరగలేదు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఎల్‌సీడీ డిస్ల్పే, సింగల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

యమహా FZ & FZS-Fi బైకులు ఇప్పుడు బిఎస్6 వెర్షన్‌లో..

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎస్-6 వెర్షన్ బైకులను నవంబర్ 2019 నుండి మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు యమహా ఇండియా గతంలోనే ప్రకటించింది. ఏప్రిల్ 01, 2020 నుండి బిఎస్-6 విధానం అమల్లోకి రావడానికి నాలుగు నెలల ముందే కంపనీ బిఎస్-6 బైకులను లాంచ్ చేయడం ప్రారంభించింది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha FZ & FZS-Fi BS6 Motorcycles Launched In India: Prices Start At Rs 99,200. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X