2020 యమహా ఎంటీ-15 బిఎస్-6 వచ్చేసింది.. పూర్తి వివరాలు

యమహా ఇండియా తమ లేటెస్ట్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్ సైకిల్ యమహా ఎంటీ-15 బైక్ బిఎస్-6 వెర్షన్‌ను ఆవిష్కరించింది. సరికొత్త ఫ్యాసినో 125 FI మరియు రే-జడ్ఆర్ 125 FI స్కూటర్లను విడుదల చేసినప్పుడే 2020 యమహా ఎంటీ-15 బిఎస్-6 బైకును ప్రవేశపెట్టారు.

2020 యమహా ఎంటీ-15 బిఎస్-6 వచ్చేసింది.. పూర్తి వివరాలు

యమహా కథనం ప్రకారం, సరికొత్త 2020 ఎంటీ-15 బిఎస్-6 మోటార్‌ సైకిల్‌‌ను ఫిబ్రవరి 2020 నుంచి విక్రయించనున్నారు. సరికొత్త 2020 యమహా ఎంటీ-15 బైకులో అత్యాధునిక బిఎస్-6 ఇంజన్ అందించారు. దీంతో పాటు మరో కొత్త కలర్ స్కీమ్ కూడా ఇందులో పరిచయం చేశారు.

2020 యమహా ఎంటీ-15 బిఎస్-6 వచ్చేసింది.. పూర్తి వివరాలు

సాంకేతికంగా 2020 యమహా ఎంటీ-15 బిఎస్-6 బైకులో అదే మునుపటి 155సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ అందించారు. యమహా పాపులర్ మోటార్ సైకిల్ వైజడ్ఎఫ్-ఆర్15 వి3.0 బైకులో కూడా ఇదే ఇంజన్ ఉంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఈ ఇంజన్ గరిష్టంగా 18.3బిహెచ్‌పి పవర్ మరియు 14.1ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2020 యమహా ఎంటీ-15 బిఎస్-6 వచ్చేసింది.. పూర్తి వివరాలు

బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఇంజన్‌ అప్‌డేట్ మినహాయిస్తే సాంకేతికంగా మరియు మెకానికల్‌గా ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. బిఎస్-4 వెర్షన్‌తో పోల్చుకుంటే బిఎస్-6 యమహా ఎంటీ-15 బైక్ ధర కాస్త పెరిగే అవకాశం ఉంది.

2020 యమహా ఎంటీ-15 బిఎస్-6 వచ్చేసింది.. పూర్తి వివరాలు

2020 యమహా ఎంటీ-15 బైకులో సస్పెన్షన్ పరంగా ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ వచ్చింది. ఇరువైపులా డిస్క్ బ్రేకులు, మెరుగైన బ్రేకింగ్ కోసం సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరిగా వచ్చింది.

2020 యమహా ఎంటీ-15 బిఎస్-6 వచ్చేసింది.. పూర్తి వివరాలు

ప్రస్తుతం ఉన్న మోడల్‌లోని అన్ని ఫీచర్లు అప్‌డేటెడ్ వెర్షన్ యమహా ఎంటీ-15 బైకులో యధావిధిగా వస్తున్నాయి. సైడ్-స్టాండ్ ఇంజన కట్-ఆఫ్, ఎల్ఈడీ లైటింగ్, హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్, ఫుల్లీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా ఎన్నో ఉన్నాయి.

2020 యమహా ఎంటీ-15 బిఎస్-6 వచ్చేసింది.. పూర్తి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యమహా ఇటీవల విడుదల చేసిన ఆర్15 వి3.0 బిఎస్-6 బైకులో 155సీసీ బిఎస్-6 ఇంజన్‌ను ఇది వరకే అందించింది. ఇప్పుడు ఇదే ఇంజన్‌ను ఎంటీ-15 బైకులో అందించింది. లేటెస్ట్ బిఎఎస్-6 వెర్షన్ యమహా ఎంటీ-15 మోటార్ సైకిల్‌ను ఫిబ్రవరి నుండి విక్రయిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బిఎస్-6 ప్రమాణాలను తప్పనిసరి చేసిన నేపథ్యంలో యమహా ఇండియా తమ అన్ని బైకుల్లో బిఎస్-6 ఇంజన్‌ను అప్‌‌గ్రేడ్ చేస్తోంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
2020 Yamaha MT-15 BS-VI Unveiled: Here Are All The Details! Read in Telugu.
Story first published: Sunday, December 22, 2019, 10:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X