అరు నెలల్లోనే అదరగొట్టిన యమహా MT-15 సేల్స్: ఎందుకింత డిమాండ్?

యమహా ఎంటీ-15 మోటార్ సైకిల్ ఇండియన్ మార్కెట్లో సరికొత్త మైలురాయిని సాధించింది. విపణిలోకి విడుదలైన కేవలం ఆరు నెలల్లోనే ఏకంగా 15,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయి సరికొత్త రికార్డు సృష్టించింది. యమహా ఇండియన్ కంపెనీ తమ ఎంటీ-15 బైకును ఈ ఏడాది మార్చిలో విడుదల చేసింది. సరిగ్గా ఆరు నెలల వ్యవధిలో 15,298 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.

అరు నెలల్లోనే అదరగొట్టిన యమహా MT-15 సేల్స్: ఎందుకింత డిమాండ్?

యమహా ఇండియా లైనప్‌లో కొత్తగా తీసుకొచ్చిన బ్రాండ్ ఎంటీ-15 (MT-15). సరికొత్త నేక్డ్-స్ట్రీట్ ఫైటర్ వెర్షన్ యమహా ఎంటీ-15 మార్చి 2019లో సుమారు రూ. 1.36 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్(దిల్లీ) ధరతో విక్రయాలకు సిద్దంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

అరు నెలల్లోనే అదరగొట్టిన యమహా MT-15 సేల్స్: ఎందుకింత డిమాండ్?

యమహా ఎంటీ-15 మోటార్ సైకిల్‌కు ఊహించని స్పందన లభించింది. తొలి నెలలోనే ఏకంగా 5,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఇటీవల కాలంలో ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ బైక్ సేల్స్ కూడా కాస్త తగ్గముఖం పట్టాయి.

అరు నెలల్లోనే అదరగొట్టిన యమహా MT-15 సేల్స్: ఎందుకింత డిమాండ్?

యమహా నేక్డ్-స్ట్రీట్ ఫైటర్ విభాగంలో ఉన్న పెద్ద వెర్షన్ ఎంటీ-09 డిజైన్ ప్రేరణతో ఎంటీ బైకుల సిరీస్‌లో ఎంటీ-15 మోటార్ సైకిల్‌ను ప్రవేశపెట్టారు. సాంకేతికంగా ఇందులో యమహా ఆర్15 నుండి సేకరించిన 155సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ కలదు. యమహా ఆర్15 లేటెస్ట్ వెర్షన్ వి3.0 (V3.0)లో కూడా ఇదే ఇంజన్ కలదు.

అరు నెలల్లోనే అదరగొట్టిన యమహా MT-15 సేల్స్: ఎందుకింత డిమాండ్?

శక్తివంతమైన 155సీసీ ఇంజన్ గరిష్టంగా 19.1బిహెచ్‌పి పవర్ మరియు 14.7ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి వేరిబుల్ వాల్వ్ యాక్టివేషన్‌తో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. ఇందులో స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ కూడా కలదు.

అరు నెలల్లోనే అదరగొట్టిన యమహా MT-15 సేల్స్: ఎందుకింత డిమాండ్?

ఏప్రిల్ 2020 నుండి అమల్లోకి రానున్న నూతన ఉద్గార ప్రమాణాల (Emission Norms)కు అనుగుణంగా యమహా ఇండియా లైనప్‌లో లభించే అన్ని మోడళ్లలో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన బిఎస్-6 ప్రమాణాలను పాటించే ఇంజన్‌లను ఈ ఏడాది నవంబరులోపే అందించేందుకు యమహా సంస్థ ప్రయత్నిస్తోంది.

అరు నెలల్లోనే అదరగొట్టిన యమహా MT-15 సేల్స్: ఎందుకింత డిమాండ్?

యమహా ఎంటీ-15 బైకులో ఫీచర్ల విషయానికి వస్తే బై-ఫంక్షనల్‌ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌సీడీ డిస్ల్పే, షార్ట్ రైజింగ్ టెయిల్, రేడియటర్ సైడ్ ఫిన్స్ మరియు ముందువైపున వింగ్‌లెట్స్ ఉన్నాయి.

అరు నెలల్లోనే అదరగొట్టిన యమహా MT-15 సేల్స్: ఎందుకింత డిమాండ్?

కానీ ఈ బైకులో ముందువైపున ఇన్వర్టెడ్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మిస్సయ్యాయి, అంతర్జాతీయ మార్కెట్లో లభించే ఇదే వెర్షన్‌లో ఈ ఫీచర్ రావడం గమనార్హం. ఇండియన్ వెర్షన్ యమహా ఎంటీ-15 బైకులో ముందువైపున కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుకవైపున మోనోషాక్ అబ్జార్వర్ ఉన్నాయి. బ్రేకింగ్ డ్యూటీ కోసం రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు మరియు సురక్షితమైన బ్రేకింగ్ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరిగా అందించారు.

అరు నెలల్లోనే అదరగొట్టిన యమహా MT-15 సేల్స్: ఎందుకింత డిమాండ్?

ఇండియన్ మార్కెట్లోని 150సీసీ నేక్డ్-స్ట్రీట్ ఫైటర్ సెగ్మెంట్లో యమహా ఎంటీ-15 మోస్ట్ పాపులర్ బైక్. అగ్రెసివ్ ఫ్రంట్ డిజైన్ బైక్ మొత్తానికి స్పోర్టివ్ మరియు కండలు తిరిగిన రూపాన్నిచ్చింది. యమహా ఎంటీ-15 విపణిలో ఉన్న బజాజ్ పల్సర్ ఎన్ఎస్200, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి, సుజుకి జిక్సర్ 155 మరియుకేటీఎమ్ 125 డ్యూక్ వంటి మోడళ్లకు గట్టిపోటీనిస్తోంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha MT-15 Sales Crosses 15,000 Units Within Six Months Of Its Launch In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X