యమహా మోస్ట్ పాపులర్ బైక్.. ఇప్పుడు ఒక్కటి కూడా అమ్ముడవ్వలేదు

బడ్జెట్ రేంజ్ స్పోర్ట్స్ బైకులకు యమహా టూ వీలర్స్ పేరుగాంచిన సంస్థ. జపాన్‌కు చెందిన యమహా ఇండియా విభాగం తమ మోస్ట్ పాపులర్ మోడల్ వైజడ్ఎఫ్-ఆర్3 గత నెలలో సున్నా విక్రయాలను నమోదు చేసుకుంది. ఇండియాలోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉన్న ఈ మోడల్ ఈ తరహా ఫలితాలు సాధించడం ఇదే తొలిసారి. దీంతో వీటిని దిగుమతి చేసుకోవడం యమహా ఇండియా ఆపేసింది.

యమహా వైజడ్ఎఫ్-ఆర్3 ఒక్క బైక్ కూడా అమ్ముడవ్వకపోవడానికి గల కారణాలేంటో చూద్దాం రండి..

యమహా మోస్ట్ పాపులర్ బైక్.. ఇప్పుడు ఒక్కటి కూడా అమ్ముడవ్వలేదు

ప్రస్తుతం దేశీయ విపణిలో ఉన్న యమహా వైజడ్ఎఫ్-ఆర్3 మోడల్ కాస్త పాతది. అంతే కాకుండా దీని స్థానంలో పలు అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే అప్‌డేటెడ్ వైజడ్ఎఫ్-ఆర్3 బైక్ విడుదలయ్యింది. కొత్త మోడల్ అతి త్వరలో విడుదల అవుతుందనే ఉద్దేశ్యంతో ఆర్3 ఫ్యాన్స్ ఈ పాత మోడల్‌ను ఎంచుకునేందుకు వెనుకాడుతున్నారు.

యమహా మోస్ట్ పాపులర్ బైక్.. ఇప్పుడు ఒక్కటి కూడా అమ్ముడవ్వలేదు

యమహా వైజడ్ఎఫ్-ఆర్3 2019 ఇంటర్నేషనల్ మోడల్‌ నూతన ఫెయిరింగ్ మరియు డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్‌తో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ డిజైన్‌తో వస్తోంది. యమహా "క్రాస్-లేయర్డ్‌"గా ఈ నూతన ఫెయిరింగ్ పరిచయం అవుతోంది.

యమహా మోస్ట్ పాపులర్ బైక్.. ఇప్పుడు ఒక్కటి కూడా అమ్ముడవ్వలేదు

ట్రాక్ వెర్షన్ మరియు స్పోర్ట్స్ పర్పస్ ఆర్3 బైకులో సరికొత్త విండ్ షీల్డ్ కూడా కలదు. ప్రత్యేకంగా డిజైన్ మరియు డెవలప్ చేసిన ఈ విండ్ షీల్డ్ గాలి ద్వారా కలిగే ఘర్షణను దాదాపు 7% తగ్గించింది. ఏరోడైనమిక్‌గా రూపొందించిన ఈ విండ్ షీల్డ్ ద్వారా మునుపటి వైజడ్ఎఫ్-ఆర్3 కంటే ఇది గంటకు 8కిమీ అధిక వేగాన్ని కలిగి ఉంది.

యమహా మోస్ట్ పాపులర్ బైక్.. ఇప్పుడు ఒక్కటి కూడా అమ్ముడవ్వలేదు

సరికొత్త 2019 యమహా వైజడ్ఎఫ్-ఆర్3 బైకులో అత్యాధునిక 321సీసీ కెపాసిటి గల ట్విన్-సిలిండర్ ఇన్-లైన్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 42పిఎస్ పవర్ మరియు 29.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

యమహా మోస్ట్ పాపులర్ బైక్.. ఇప్పుడు ఒక్కటి కూడా అమ్ముడవ్వలేదు

వైజడ్ఎఫ్-ఆర్ హార్డ్‌వేర్ విషయానికి వస్తే.. అంతర్జాతీయ మోడల్‌లో ముందువైపున కేవైబి నుండి సేకరించిన అప్-సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్, సింగల్ డిస్క్ బ్రేక్ వేగాన్ని నియంత్రించి, వెంటనే బైకును నిలిపేందుకు సహాయపడుతుంది, సురక్షితమైన రైడింగ్ కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ తప్పనిసరిగా వచ్చింది.

యమహా మోస్ట్ పాపులర్ బైక్.. ఇప్పుడు ఒక్కటి కూడా అమ్ముడవ్వలేదు

యమహా సంస్థకు ఇండియా అతి ముఖ్యమైన మార్కెట్ కానీ అత్యంత ప్రజాదరణ మరియు డిమాండ్ ఉన్న మోడళ్లను ఇండియాలో తయారుచేయకుండా దిగుమతి చేసుకోవడం వలన వీటి మీద దిగుమతి సుంకం అధికంగా ఉంటోంది. దాంతో వీటి సేల్స్ మీద తీవ్ర ప్రభావం చూపుతోంది.

యమహా మోస్ట్ పాపులర్ బైక్.. ఇప్పుడు ఒక్కటి కూడా అమ్ముడవ్వలేదు

కానీ సెగ్మెంట్లో ఉన్న కవాసకి నింజా 300 మోడల్‌ను కవాసకి దాదాపుగా ఇండియాలోనే తయారైన విడి భాగాలను మరియు పలు దిగుమతి చేసుకున్న విడి భాగాలతో దేశీయంగా తయారు చేస్తోంది. దీంతో వీటి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గతంలో 3.60 లక్షల ధరతో లభించే కవాసకి నింజా 300 ఏబిఎస్ ప్రస్తుతం రూ. 2.98 లక్షలు ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తోంది. దీంతో కవాసకి ఇండియా సేల్స్ మంచి ఫలితాలను సాధిస్తోంది.

యమహా మోస్ట్ పాపులర్ బైక్.. ఇప్పుడు ఒక్కటి కూడా అమ్ముడవ్వలేదు

యమహా ఇండియా కూడా ఇదే ప్రణాళికను పాటిస్తే వైజడ్ఎఫ్-ఆర్3 సేల్స్ గణనీయంగా పుంజుకుంటాయి. పూర్తి స్థాయిలో ఇండియాలోనే ఉత్పత్తి చేయడం అత్యంత పోటీతత్వంతో కూడిన ధరలకు కారణమవుతుంది. ప్రస్తుతం ఉన్న ఏబీఎస్ వైజడ్ఎఫ్-ఆర్3 ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.49 లక్షలుగా ఉంది. భవిష్యత్తులో ఇది 3 లక్షల రేంజ్‌లోకి వస్తే యమహా ఇండియా మంచి ఫలితాలను పొందడం ఖాయం.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha R3 sales May 0 units facelift launch expected soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X