మార్కెట్లోకి మరో రెండు బైకులను విడుదల చేసిన యమహా:వాటి ఫీచర్స్

ప్రఖ్యాత యమహా మోటార్ ఇండియా ఇప్పుడు సరికొత్త మోడల్ లను విడుదల చేసింది వాటిని గురించి తెలుసుకుందాం. యమహా ఇప్పుడు ఇండియా మార్కెట్లోకి రెండు కొత్త మోడళ్లను విడుదలచేసింది. అవి ఒకటి రే జెడ్ఆర్ 125 మరియు రే జెడ్ఆర్ 125స్ట్రీట్ ర్యాలీ. ప్రస్తుతమున్న 125 సిసి స్కూటర్లు రే జెడ్ఆర్ స్కూటర్ మోడళ్లను భర్తీ చేస్తుంది.

మార్కెట్లోకి మరో రెండు బైకులను విడుదల చేసిన యమహా:వాటి ఫీచర్స్

యమహా రే జెడ్ఆర్ స్కూటర్ 113సిసి సింగల్ సిలిండర్ ఇంజిన్ ని కలిగి ఉంటాయి. ఇది 7.2 బిహెచ్‌పి శక్తి మరియు 8.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన 125 సిసి ఇంజిన్ల యొక్క పనితీరు 8.2 హెచ్‌పి శక్తి మరియు 9.7 ఎన్ఎమ్ టార్క్ వద్ద ఉన్నాయి. యమహా రే జెడ్ఆర్ 125 మరియు రే జెడ్ఆర్ 125 స్ట్రీట్ ర్యాలీ స్కూటర్ మోడళ్లలో కొత్త 125 సిసి ఇంజన్లు ఇంధన-ఇంజెక్ట్ చేయబడ్డాయి.

మార్కెట్లోకి మరో రెండు బైకులను విడుదల చేసిన యమహా:వాటి ఫీచర్స్

యమహా బ్రాండ్ నుంచి విడుదలైన రే జెడ్ఆర్ 125 మరియు రే జెడ్ఆర్ 125 స్ట్రీట్ ర్యాలీలు రెండు కూడా 125 సిసి ఇంజిన్లను కలిగి ఉంటాయి. ఈ ఇంజిన్లు సాధారణమైనవాటికంటే కూడా 16 శాతం ఎక్కువ ఇంధన సామర్త్యాన్ని కలిగి ఉంటుంది అని యమహా చెప్పింది. వరల్డ్ మోటార్‌సైకిల్ టెస్ట్ ద్వారా ఈ వాహనాలలో ఇంజిన్ల యొక్క సామర్త్యాన్ని పరీక్షించడం జరిగింది.

మార్కెట్లోకి మరో రెండు బైకులను విడుదల చేసిన యమహా:వాటి ఫీచర్స్

కొత్తగా ప్రారంభించిన యమహా లో సైలెంట్ ఇంజిన్ వ్యవస్థ ఉంటుంది. ఇంకా ఇందులో స్టాప్ మరియు స్టార్ట్ సిస్టమ్ కూడా అమర్చబడి ఉంటుంది. యమహా స్ట్రీట్ ర్యాలీలో డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. విస్తృతంగా ఉండే టైర్లు కూడా ఇందులో ఉంటాయి. టైర్ల యొక్క వ్యాసం 110 మిమీ ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల రైడింగ్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. వెనుక భాగంలో క్రాష్ గార్డుతో సహా మిగిలిన పరికరాలు అమర్చబడి ఉంటాయి.

మార్కెట్లోకి మరో రెండు బైకులను విడుదల చేసిన యమహా:వాటి ఫీచర్స్

మార్కెట్లో కొత్త యమహా రే జెడ్ఆర్ 125 మరియు రే జెడ్ఆర్ 125 ర్యాలీ స్ట్రీట్ స్కూటర్లు విడుదల చేసినప్పటికీ వాటి యొక్క నిర్దిష్ట ధర మనకు తెలియడం లేదు. కొత్తగా వచ్చిన ఈ వాహనాలు కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ స్కూటర్ల ధర దాదాపుగా రూ. 85,000 నుండి రూ. 1.15 లక్షల వరకు ఉండవచ్చు అని సామాజికవర్గాల అంచనా. ఈ ధర ఎక్స్ షూరూమ్ యొక్క నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది అని మనకు తెలుస్తుంది.

మార్కెట్లోకి మరో రెండు బైకులను విడుదల చేసిన యమహా:వాటి ఫీచర్స్

యమహాకు సంబంధించి మనకు తెలిసిన వార్తల ప్రకారం 2020 ఫాసినో 125 ఎఫ్ఐ ని 66,430 రూపాయలకు విడుదల చేసింది. ఇప్పుడు యమహా ఫాసినో ప్రస్తుత తరం మార్కెట్లో ఉంది. ఇది ప్రస్తుతం రెండు వేరియంట్లలో లభిస్తుంది. అన్ని కొత్త ఫాసినోలలో 125 సిసి బ్లూ కోర్ సింగిల్ సిలిండర్ ఇంజన్ తో 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ఇంకా మల్టీ-ఫంక్షన్ కీ మరియు సైడ్-స్టాండ్ కట్-ఆఫ్ స్విచ్ వంటివి కలిగి ఉన్నాయి.

మార్కెట్లోకి మరో రెండు బైకులను విడుదల చేసిన యమహా:వాటి ఫీచర్స్

యమహా రే ZR 125 మరియు రే ZR 125 ర్యాలీ స్ట్రీట్ గురించి ఆలోచనలు:

ఇప్పుడు విడుదలయిన కొత్త యమహా రే జెడ్ఆర్ 125 మరియు రే జెడ్ఆర్ 125 ర్యాలీ స్ట్రీట్ లు చూడటానికి ఒక కొత్తరకం డిజైన్ ని కలిగి ఉంటాయి. ఇవి ఇంతకు ముందు వున్న వాటికంటే కూడా కొంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది. నిర్మాణపరంగా ఇందులో అన్ని కచ్చితంగా ఉంటాయి. ఇంజిన్ వాహనానికి తగినట్లుగా ఉంటుంది. ఇది కచ్చితమైన వేగం మరియు మైలేజ్ ని కూడా ఇస్తుంది.

మార్కెట్లోకి మరో రెండు బైకులను విడుదల చేసిన యమహా:వాటి ఫీచర్స్

ఏది ఏమైనప్పటికి యమహా నుండి ఒక కొత్త స్టైలిష్ లో వాహనం మార్కెట్లో విడుదలయింది. మొత్తానికి యమహా ఒక అందమైన స్కూటర్ ని నిర్మించింది అని చెప్పడంలో ఆశ్చర్యపడవలసినపనిలేదు. ఎందుకంటే యమహా రాబోయే తరాన్ని ఆకర్షించడంకోసమే ఈ రకమైన స్కూటర్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ వాహనాన్ని వినియోగించడానికి వినియోగదారులంతా ఎదురుచూస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, December 20, 2019, 15:10 [IST]
English summary
Yamaha Ray ZR 125 And ZR 125 Street Rally Unveiled: Features 125cc BS6 Compliant Engine-Read in Telugu
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+