ఇండియాలో త్వరలో ప్రారంభించనున్న యమహా ఎలక్రిక్ స్కూటర్లు
భారతదేశంలో ఉన్న ప్రముఖ సంస్థల్లో యమహా ఒకటి. ఇది జపాన్ దేశానికి చెందిన వాహనాదిగ్గజం. ఇది జపాన్ ఆధారిత సంస్థ అయినప్పటికీ భారతదేశంలో కూడా చాలా వాహనాలను ప్రవేశపెట్టింది. కానీ దేశం ఇప్పుడు ప్రగతివైపు పరుగులుపెడుతోంది. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణాంగా వాహనాలలోకూడా చిన్నచిన్న మార్పులు రాకతప్పడంలేదు. ఈ విధమైన మార్పులవల్ల పుట్టుకొచ్చిన చాల రకాలైన వాహనాలు వినియోగదారులకు ఉపయోగపడటమే కాకుండా టెక్నాలిజీలో కూడా ముందడుగులు వేస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలోపెట్టుకుని యమహా సంస్థ మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదలచేయాలని యోచిస్తోంది.

యమహా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేయాలని ఆలోచిస్తోంది. ఈ తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేయడానికి అయ్యే ఖర్చులు, వాటి యొక్క మౌలిక సదుపాయాలు, వెహికల్ పాలసీలు, ఇంకా ఫైనాన్స్ వంటి విషయాలను గురించి ఆలోచనలు చేస్తుంది.

యమహా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ గురించి యమహా మోటార్ ఇండియా ఛైర్మన్ 'మోటోఫుమి షితారా' మాట్లాడుతూ గతకొంతకాలంగా మేము ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విషయమై కొన్ని అధ్యయనాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాలపై అధ్యనాలు పూర్తయిన తర్వాత వాహనాల యొక్క విడుదల, ధరలు మొదలైనవి వెల్లడిస్తాము అని చెప్పారు. ఇప్పటికైతే యమహా ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో ప్రవేశించే అవకాశం లేదని ప్రకటించారు.

జపాన్‌లో పాసోల్ ని లాంచ్ చేసేటప్పుడు యమహా ఈ ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ప్రవేశపెట్టబోతోంది. ఎలక్ట్రిక్ వాహనాలను ఈ ఏడాది ఆగస్ట్ లో తైవాన్ లో ప్రారంభించబడింది. ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రారంభించేముందు కొన్ని అధ్యయనాలు చేస్తుందని తెలియజేసింది. ఈ రకమైన అధ్యయనాలవల్ల రాబోయే తరానికి ఒక మంచి వాహనాన్ని అందించినట్లవుతుంది. కావున ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించేముందు కొన్ని అధ్యయనాలు అవసరం.

ఇసి-05 అనేది యమహా యొక్క ఐదవ ఎలక్ట్రిక్ వాహనం. ఇంకా యమహా కంపెనీ 2050 నాటికల్లా కార్బన్-ఎమిషన్ ఫ్రీ వాహనాల విడుదలే లక్ష్యంగా కట్టుబడి ఉంది. యమహా గురించి ఇప్పటివరకు మనకు తెలిసిన వార్తల ప్రకారం ఈ కంపెనీ ఇండియాలో ఫాసినో 125 ఎఫ్ఐ స్కూటర్‌ను ప్రారంభించింది. దీని ధరను 66,430 రూపాయలుగా నిర్దారించింది. ప్రస్తుతం 113సిసి స్కూటర్ స్థానంలో న్యూ ఫాసినో 125 సెట్ చేయబడింది. ఈ కొత్త ఫాసినో ఇప్పుడు రెండు వేరియంట్లలో లభిస్తుంది.

యమహా ప్రస్తుత 113 సిసి రే జెడ్ఆర్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేయడానికి కొత్త రే జెడ్ఆర్ 125 మరియు రే జెడ్ఆర్ 125 స్ట్రీట్ ర్యాలీ స్కూటర్లను ఆవిష్కరించనుంది. 125 సిసి స్కూటర్లో 3 ఇంజిన్లు ఉంటాయి. అందులో రెండు పెట్రోల్ మిగిలిన ఒకటి డీజిల్ ఉంటాయి. ఈ రకమైన 125 సిసి స్కూటర్లు చూడటానికి చాలా స్టైల్ గా మరియు రహదారులలో ప్రయాణించడానికి అనుకూలంగా వినియోగదారులకు సహకరిస్తూ ఉంటాయి. వీటిలో ఉన్న ఎల్ఇడి లైట్లు,మరియు టైర్లకున్న వ్యాసం మొదలైనవన్నీ ఇందులో కొంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది. 125 సిసి లో వచ్చిన ఈ రెండు ద్విచక్ర వాహనాలు కూడా బిఎస్-వి ఇంజిన్లను కలిగి ఉంటుంది. రే జెడ్ఆర్ 125 మరియు రే జెడ్ఆర్ 125 స్ట్రీట్ ర్యాలీ స్కూటర్లు రెండు కూడా యమహా యొక్క అద్భుత సృష్టిలో ఒక భాగం అని చెప్పవచు.

కొత్త రే జెడ్ఆర్ 125 మరియు జెడ్ఆర్ 125 ర్యాలీ స్ట్రీట్ ఇంజన్లు 16 శాతం ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉన్నాయని కంపెనీ పేర్కొంది మరియు స్కూటర్‌లో నిశ్శబ్ద ఇంజిన్-స్టార్ట్ సిస్టమ్ తో పాటు స్టాప్ & స్టార్ట్ సిస్టమ్ లు కూడా ఉన్నాయి. ర్యాలీ స్ట్రీట్ వేరియంట్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది.

ఇండియాలో యమహా ఎలక్ట్రిక్ వాహనం గురించి ఆలోచనలు:
ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఆలోచనలు అంటే, ఒక వాహన తయారీదారు ఏవిధంగా ఉండాలి అనే విషయం గమనిస్తే...?మొదట వాహనం గురించి తెలుసుకోవాలి. తరువాత మార్కెట్ గురించి, తయారీదారుకి అయ్యే ఖర్చులు మరియు అమ్మకాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ద్విచక్ర వాహన శ్రేణిలోనే ఒక గొప్ప పేరు సాధించిన సంస్థ యమహా. మనదేశంలో అన్ని సౌకర్యాలు కపించుకుని తరవాత ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలు మనదేశంలో ప్రవేశపెట్టడం ఆనందించదగ్గ విషయమే కానీ దానికి కావలసినన్ని సౌకర్యాలు కూడా ప్రవేశపెట్టాలి. దీనికి కావలసిన సహకారాన్ని ప్రభుత్వాలుకూడా అందించాలి. ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టినప్పుడు ఆ సదస్సులో పాల్గొన్న రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఎలక్ట్రిక్ వాహనాలను మేము ఆహ్వాన్నిస్తున్నాం. దీనికి కావలసిన సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుంది అని ప్రకటించారు.

ఎలక్ట్రిక్ వాహనాలవల్ల ప్రకృతికి ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఇవి ఎటువని ఇంధనం అవసరం లేదు. కాబట్టి ఇవి పర్యావరణ హితాలుగా ఉంటాయి. పర్యావరణాన్ని కాపాడే ఇలాంటి వాహనాలను ఎంతైనా ప్రోత్సహించవచ్చు. ఏ ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధిపరచానికి ఆంధ్రప్రదేశ్ లో కూడా కియా సంస్థను నెలకొల్పి ప్రభుత్వం తనవంతు సహాయ సహకారాలను అందిస్తుంది.
Source: ET Auto


Click it and Unblock the Notifications








