ఇండియాలో మల్టీస్ట్రాడా 950 ఎస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన డుకాటీ, ఎప్పుడో తెలుసా?

డుకాటీ త్వరలో రానున్నతన బిఎస్ 6 కంప్లైంట్ మోటారుసైకిల్, మల్టీస్ట్రాడా 950 ఎస్ కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభించినట్లు ప్రకటించింది. డుకాటీ మల్టీస్ట్రాడా 950 ఎస్ యొక్క కొత్త బిఎస్ 6-కంప్లైంట్ వెర్షన్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో లేదా బ్రాండ్ డీలర్‌షిప్‌లలో రూ. 1 లక్ష రూపాయలకు బుక్ చేసుకోవచ్చు.

ఇండియాలో మల్టీస్ట్రాడా 950 ఎస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన డుకాటీ

ప్రీ-బుకింగ్స్ ప్రారంభించడమే కాకుండా, కొత్త బిఎస్ 6-కంప్లైంట్ మల్టీస్ట్రాడా 950 ఎస్ 2020 నవంబర్ 2 న భారత మార్కెట్లో విక్రయించబడుతుందని డుకాటీ ధృవీకరించింది. ఈ మోటారుసైకిల్ కోసం డెలివరీలు నవంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతాయి మరియు ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నైలోని అన్ని డుకాటీ డీలర్‌షిప్‌లలో మోటారుసైకిల్ అందుబాటులో ఉంటుంది.

ఇండియాలో మల్టీస్ట్రాడా 950 ఎస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన డుకాటీ

దీని గురించి డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర మాట్లాడుతూ, "కొత్త మల్టీస్ట్రాడా 950 ఎస్ మా ఐకానిక్ స్కైహూక్ EVO సస్పెన్షన్, DQS, కార్నరింగ్ ఎబిఎస్, కార్నరింగ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్ వంటి మరెన్నో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అధునాతన టెక్నాలజీని కలిగి ఉంటామే కాకుండా మంచి పనితీరుని కూడా అందిస్తుంది అన్నారు.

MOST READ:నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన మహిళ.. ఎందుకో తెలుసా

ఇండియాలో మల్టీస్ట్రాడా 950 ఎస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన డుకాటీ

"కొత్త మోటారుసైకిల్ స్పోర్ట్స్ టూరింగ్‌లో పెద్దగా ఉన్న మోటారుసైకిలిస్టుల కోసం రూపొందించబడింది, అయితే పర్ఫామెన్స్, హ్యాండ్లింగ్, కంఫర్ట్ మరియు సేఫ్టీ విషయంలో ఎటువంటి రాజీ పడకూడదనుకుంటున్నాము. భారతదేశంలోని రైడర్‌లతో ఇది పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నామన్నారు.

ఇండియాలో మల్టీస్ట్రాడా 950 ఎస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన డుకాటీ

డుకాటీ మల్టీస్ట్రాడా 950 ఎస్ యొక్క కొత్త బిఎస్ 6-కంప్లైంట్ వెర్షన్ బ్రాండ్ యొక్క 937 సిసి టెస్టాస్ట్రెట్టా ఎల్-ట్విన్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 9000 ఆర్‌పిఎమ్ వద్ద 113 బిహెచ్‌పి మరియు 7500 ఆర్‌పిఎమ్ వద్ద 96 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాన్ని డ్రైవ్ చేసిన మైనర్ బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?

ఇండియాలో మల్టీస్ట్రాడా 950 ఎస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన డుకాటీ

మోటారుసైకిల్ బ్రాండ్ యొక్క మల్టీస్ట్రాడా శ్రేణి యొక్క సరికొత్త డిజైన్ కలిగి ఉంటుంది. 950 ఎస్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, కార్నరింగ్ ఎల్‌ఈడీ లైట్లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, స్కైహూక్ EVO సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, అప్ / డౌన్ క్విక్-షిఫ్టర్, కార్నరింగ్ ఎబిఎస్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 5.0-అంగుళాల టిఎఫ్‌టి డిస్ప్లే మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఇండియాలో మల్టీస్ట్రాడా 950 ఎస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన డుకాటీ

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా 950 ఎస్ భారత మార్కెట్లో అమ్మకలకు రానుంది. లాంచ్ అయిన తర్వాత మల్టీస్ట్రాడా 950 ఎస్ ధర రూ. 12 లక్షలు [ఎక్స్-షోరూమ్,ఇండియా] ఉండే అవకాశం ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో ట్రయంఫ్ టైగర్ 900 మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్ 900 ఎక్స్‌ఆర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ఇదే

Most Read Articles

Read more on: #ducati
English summary
New Ducati Multistrada 950 S India Launch Date Announced. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X