పబ్లిక్ రోడ్‌లో బిఎస్ 6 కవాసకి నింజా 300 టెస్ట్ డ్రైవ్!

జపాన్ వాహనదిగ్గజం అయిన కవాసాకి తన బ్రాండ్ లో ఒకటైన నింజా 300 భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన వాహనాలలో ఒకటి. ఇటీవల కాలంలో కవాసాకి ఇండియా బిఎస్-4 నింజా 300 ను నిలిపివేసింది. ఈ స్థానంలో బిఎస్ 6 కవాసకి నింజా 300 ని ప్రవేశపెట్టింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

పబ్లిక్ రోడ్‌లో బిఎస్ 6 కవాసకి నింజా 300 టెస్ట్ డ్రైవ్!

బిఎస్-4 కవాసకి నింజా 300 మార్కెట్లో నిలిపివేయబడింది. బిఎస్-4 స్థానంలో ఇప్పుడు బిఎస్-6 నింజా 300 ని మార్కెట్లోకి విడుదల చేయాలను యోచిస్తోంది. ఇప్పుడు రాబోయే బిఎస్-6 కంప్లైంట్ వెర్షన్ పూణేలో ఒక ఆటోమోటివ్ ఔత్సాహికుడు అయిన ఆకాష్ ఒంబాలే నడుపుతున్నట్లు ఒక వీడియో కెమెరాకి చిక్కింది.

పబ్లిక్ రోడ్‌లో బిఎస్ 6 కవాసకి నింజా 300 టెస్ట్ డ్రైవ్!

మార్కెట్లో నింజా 300 వాహనాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ సంస్థ నింజా 300 యొక్క స్థానాన్ని శక్తివంతమైన నింజా 400 తో భర్తీ చేయనుంది. మార్కెట్లో నింజా 400 యొక్క అధిక ధర మరియు నింజా 300 కి ఉన్న అధిక డిమాండ్ కారణంగా బిఎస్-6 వెర్షన్ విడుదలవ్వడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

పబ్లిక్ రోడ్‌లో బిఎస్ 6 కవాసకి నింజా 300 టెస్ట్ డ్రైవ్!

బిఎస్ 4 వెర్షన్ కవాసకి నింజా 300 ధర దాదాపు రూ. 3 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) వరకు ఉంటుంది. కానీ కొత్త నవీనీకరణలతో వస్తున్న బిఎస్-6 నింజా ధర బిఎస్-4 కంటే కూడా 10,000 నుంచి 15,000 రూపాయలు అధికంగా ఉండే అవకాశం ఉంది.

పబ్లిక్ రోడ్‌లో బిఎస్ 6 కవాసకి నింజా 300 టెస్ట్ డ్రైవ్!

కవాసాకి నింజా 300, 296 సిసి లిక్విడ్-కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. బిఎస్-4 వెర్షన్ లో 38 బిహెచ్‌పి మరియు 27 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అయితే నింజా 400 లో 399 సిసి ఇంజిన్ తో 47.5 బిహెచ్‌పి మరియు 38 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.ఈ రెండు వెర్షన్లలోని ఇంజన్లు 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడతాయి.

పబ్లిక్ రోడ్‌లో బిఎస్ 6 కవాసకి నింజా 300 టెస్ట్ డ్రైవ్!

కవాసకి నింజా 400 కఠినమైన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా నవీనీకరించడం జరిగింది. ఈ విధంగా నవీనీకరించబడిన ఈ మోటార్ సైకిల్స్ రైడర్లకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

పబ్లిక్ రోడ్‌లో బిఎస్ 6 కవాసకి నింజా 300 టెస్ట్ డ్రైవ్!

భారతీయ మోటారుసైకిల్ మార్కెట్లో కవాసాకి నింజా 300 ప్రధానంగా యమహా వైజెడ్ఎఫ్-ఆర్ 3 కి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది 300 సిసి ఇంజిన్ కేటగిరీలో మరొక మోటార్ సైకిల్.

Source: Rushlane

Most Read Articles

English summary
Kawasaki Ninja 300 BS6 spied testing before launch. Read in Telugu.
Story first published: Thursday, January 23, 2020, 12:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X