కొత్త కలర్స్ తో రానున్న కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్ 6 బైక్స్

ఆస్ట్రియా దేశానికి చెందిన వాహన దిగ్గజం కెటియం. ఇప్పుడు కెటియం నుంచి డ్యూక్ 250 బిఎస్ 6 మార్కెట్లోకి కొత్త రంగులతో రానుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

కొత్త కలర్స్ తో రానున్న కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్ 6 బైక్స్

బజాజ్ ఆటో ఆస్ట్రియన్ బ్రాండ్‌ అయిన కెటిఎమ్ 200 డ్యూక్ ని 2012 లో లాంచ్‌ చేసి ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. 200 డ్యూక్ ని లాంచ్ చేసిన తరువాత 390 డ్యూక్‌ను విడుదల చేయడం జరిగింది. కానీ ఈ మోటారుసైకిల్ల మధ్య ధరలు మరియు పనితీరులో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది.

కొత్త కలర్స్ తో రానున్న కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్ 6 బైక్స్

కెటిఎం ఇండియా రాబోయే బిఎస్-6 కంప్లైంట్ 250 డ్యూక్ యొక్క వెర్షన్లను నిశ్శబ్దంగా విడుదల చేసింది. కెటిఎమ్ ఇండియా తన మొదటి బిఎస్ 6 ఉత్పత్తి అయిన కెటిఎం 390 అడ్వెంచర్ ను కూడా ఇటీవల కాలంలో విడుదల చేసింది.

కొత్త కలర్స్ తో రానున్న కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్ 6 బైక్స్

అయితే 250 డ్యూక్ యొక్క అధికారిక ప్రయోగం ఇంకా జరగలేదు మరియు ధరలు కూడా ఇంకా తెలియలేదు. ఏదేమైనా కెటిఎమ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు సిద్ధంగా ఉండటానికి కొన్ని డీలర్‌షిప్‌లు తాజా స్టాక్‌తో ఉన్నాయి.

కొత్త కలర్స్ తో రానున్న కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్ 6 బైక్స్

బిఎస్ 6 కెటిఎం 250 డ్యూక్ ఇప్పుడు మూడు రంగులతో రాబోతున్నాయి. అవి ఒకటి బ్లాక్/ఆరంజ్, రెండు సిల్వర్/ఆరెంజ్ మరియు మూడు సిల్వర్/బ్లాక్. ఇందులో ఉండే ప్రధాన ట్రేల్లిస్ ఫ్రేమ్ ఆరెంజ్‌ కలర్ తో పూర్తవుతుంది.

కొత్త కలర్స్ తో రానున్న కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్ 6 బైక్స్

కెటిఎం 250 డ్యూక్ లో పరికరాలను గమనించినట్లైతే ఇది ఎటువంటి మార్పులకు లోను కాలేదని మనకు తెలుస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు హెడ్‌ల్యాంప్ లకు కూడా ఎటువంటి నవీనీకరణలు జరగలేదు.

కొత్త కలర్స్ తో రానున్న కెటిఎమ్ డ్యూక్ 250 బిఎస్ 6 బైక్స్

కఠినమైన బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అప్‌డేట్ చేయడం వల్ల ఉత్పత్తి కొద్దిగా తగ్గుతుంది. కాని KTM ఈ విషయంలో ఇలాంటివి జరిగే అవకాశం లేదు. 390 అడ్వెంచర్‌లోని 373 సిసి బిఎస్-6 యూనిట్ బిఎస్-4 కంప్లైంట్ 390 డ్యూక్ మాదిరిగానే ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల 250 డ్యూక్ యొక్క అవుట్ పుట్ దాని 248.8 సిసి మోటారు నుండి 30 బిహెచ్‌పి మరియు 24 ఎన్ఎమ్ వద్ద ఒకే విధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటుంది.

కొత్త కలర్స్ తో రానున్న కెటిఎం డ్యూక్ 250 బిఎస్ 6 బైక్స్

కెటిఎం బిఎస్ 4 మోడల్ ధరలు సుమారు రూ. 1.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) కలిగి ఉన్నాయి. కానీ బిఎస్ 6 వెర్షన్ బిఎస్ 4 వెర్షన్ కంటే సుమారు రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
2020 KTM Duke 250 BS6 in new colours – Arrives at dealer. Read in Telugu.
Story first published: Wednesday, January 22, 2020, 16:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X