2020 హోండా ఆఫ్రికా ట్విన్ విడుదల: ధర రూ. 15.35 లక్షలు

హోండా మోటార్ సైకిల్స్ సరికొత్త 2020 హోండా ఆఫ్రికా ట్విన్ CRF1100L బైకుని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. సరికొత్త 2020 హోండా ఆఫ్రికా ట్విన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.35 లక్షలుగా నిర్ణయించారు. కొత్త తరం అడ్వెంచర్ మోటార్ సైకిల్ అత్యాధునిక ఎలక్ట్రానిక్స్, ఫీచర్లు మరియు కనెక్టెడ్ టెక్నాలజీతో వచ్చింది.

2020 హోండా ఆఫ్రికా ట్విన్ విడుదల: ధర రూ. 15.35 లక్షలు

2020 హోండా ఆఫ్రికా ట్విన్ మోటార్ సైకిల్ ఇండియన్ మార్కెట్లో రెండు విభిన్న వేరియంట్లలో లభించనుంది. అవి, స్టాండర్డ్ మరియు స్పోర్ట్. రెండు వేరియంట్లలో కూడా అత్యంత శక్తివంతమైన 1084సీసీ కెపాసిటీ గల ప్యార్లల్-ట్విన్ పెట్రోల్ ఇంజన్ కలదు.

2020 హోండా ఆఫ్రికా ట్విన్ విడుదల: ధర రూ. 15.35 లక్షలు

అదనంగా టాప్ ఎండ్ వేరియంట్ "అడ్వెంచర్ స్పోర్ట్"లో ప్రొటెక్టివ్ ఫ్రేమ్‌వర్క్, ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే వీలున్న విండ్ స్క్రీన్, అతి పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, ట్యూబ్-లెస్ టైర్లు, వైర్ స్పోక్ వీల్స్ మరియు ఇంజన్ బాష్ ప్లేట్స్ వంటివి స్టాండర్డ్ ఫీచర్లుగా వచ్చాయి.

2020 హోండా ఆఫ్రికా ట్విన్ విడుదల: ధర రూ. 15.35 లక్షలు

ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్‌కార్ ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ గల 6.5-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హోండా సెలెక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్, 6-యాక్సిస్ ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్, త్రీ-లెవల్ వీలీ కంట్రోల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, కార్నరింగ్ లైట్లు, డీసీటీ కార్నరింగ్ డిటెక్షన్ వంటి ఎన్నో లేటెస్ట్ ఫీచర్లు రెండు వేరియంట్లలో తప్పనిసరిగా వచ్చాయి.

2020 హోండా ఆఫ్రికా ట్విన్ విడుదల: ధర రూ. 15.35 లక్షలు

2020 ఆఫ్రికా ట్విన్ మోటార్ సైకిల్‌లో 4-లెవల్ ఇంజన్ పవర్ అవుట్‌పుట్, త్రీ-లెవల్ ఎలక్ట్రానిక్ ఇంజన్ బ్రేకింగ్ టెక్నాలజీ కూడా కలదు. సాంకేతికంగా ఇందులోని 1084సీసీసీ కెపాసిటీ గల ప్యార్లల్-ట్విన్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 101బిహెచ్‌పి పవర్ మరియు 105ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

2020 హోండా ఆఫ్రికా ట్విన్ విడుదల: ధర రూ. 15.35 లక్షలు

2020 హోండా ఆఫ్రికా ట్విన్ మోటార్ సైకిల్‌లో ఇప్పుడు అల్యూమినియం సిలిండర్ స్లీవ్స్ మరియు రీడిజైన్ చేసిన ఇంజన్ కేసింగ్ తీసుకొచ్చారు. దీంతో ఆఫ్రిటా ట్విన్ బైక్ బరువు ఏకంగా రెండున్నర కేజీలు తగ్గింది. మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ 2.5-కిలోల బరువు తగ్గి 226కిలోల బరువు ఉండగా, 2.2-కిలోల బరువు తగ్గిన డీసీటీ గేర్‌‌బాక్స్ వేరియంట్ బరువు 236కిలోలుగా ఉంది.

2020 హోండా ఆఫ్రికా ట్విన్ విడుదల: ధర రూ. 15.35 లక్షలు

హోండా ఆఫ్రికా ట్విన్ బైకులో నాలుగు విభిన్న రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి, టూర్, అర్బన్, గ్రావెల్ మరియు ఆఫ్-రోడ్. వీటితో మరో రెండు అదనపు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. రైడర్ రైడింగ్ విధానం మరియు సరళిని బట్టి తమకు నచ్చినట్లుగా సెట్ చేసుకోవచ్చు.

2020 హోండా ఆఫ్రికా ట్విన్ విడుదల: ధర రూ. 15.35 లక్షలు

2020 హోండా ఆఫ్రికా ట్విన్ బైకులో 18.8-లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ గల అతిపెద్ద ఫ్యూయల్ ట్యాంక్ కలదు. ఈ అడ్వెంచర్ బైకులో ముందువైపున 45మిమీ ట్రావెల్ గల క్యాడ్రిడ్జ్ టైప్ షోవా ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున 220మిమీ ట్రావెల్ గల మోనోబ్లాక్ అల్యూమినియం ప్రో-లింక్ మరియు షోవా గ్యాస్-ఛార్జ్‌డ్ డ్యాంపర్ సస్పెన్షన్ కలదు.

2020 హోండా ఆఫ్రికా ట్విన్ విడుదల: ధర రూ. 15.35 లక్షలు

బ్రేకింగ్ విధులు నిర్వర్తించేందుకు ముందువైపున రేడియల్-ఫిట్ 4-పిస్టన్ కాలిపర్లతో 310మిమీ చుట్టుకొలత ఉన్న డ్యూయల్ డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున సింగల్ పిస్టన్ కాలిపర్ సెటప్ గల 256మిమీ సింగల డిస్క్ బ్రేక్ వచ్చింది. మెరుగైన బ్రేకింగ్ కోసం స్టాండర్డ్ డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చింది. వెనుక చక్రానికి అవసరం లేదనుకుంటే ఏబీఎస్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ కూడా కలదు.

2020 హోండా ఆఫ్రికా ట్విన్ విడుదల: ధర రూ. 15.35 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2020 హోండా ఆఫ్రికా ట్విన్ ఇండియన్ మార్కెట్లో మోస్ట్ పాపులర్ అడ్వెంచర్ మోటార్ సైకిల్. అత్యాధునిక అప్‌డేట్స్‌తో వచ్చిన 2020 హోండా ఆఫ్రికా ట్విన్ బైక్ ఇదే సెగ్మెంట్లో ఉన్న డుకాటి మల్ట్రీస్ట్రాడా, ట్రయంప్ టైగర్ మరియు బీఎమ్‌డబ్ల్యూ జీఎస్1250 మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. ఈ బైకు మీద ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మే 2020 నుండి డెలివరీలు ప్రారంభకానున్నట్లు హోండా ప్రతినిధులు పేర్కొన్నారు.

Most Read Articles

English summary
2020 Honda Africa Twin (CRF1100L) Launched In India: Prices Start At Rs 15.35 Lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X