కొత్త డిజైన్ తో రానున్న 2021 బెనెల్లి టిఎన్‌టి 600 ఐ మోటార్ సైకిల్
చైనా ద్విచక్ర వాహన సంస్థ అయిన బెనెల్లి తన సరికొత్త శ్రేణి స్పోర్ట్స్ బైక్ టిఎన్‌టి 600 ఐ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కొత్త బైక్ రూపకల్పనకు సంబంధించి చిత్రాలు ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు. బెనెల్లి యొక్క టిఎన్‌టి 600 ఐ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

కొత్త 2021 టిఎన్‌టి 600 ఐ రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంది. ఇది 3 లైట్ సెటప్‌ను కలిగి ఉండటమే కాకుండా కొత్త హెడ్‌ల్యాంప్‌ను కూడా కలిగి ఉంది. ఇరు వైపులా రెండు ప్రొజెక్టర్ లైట్లు కలిగి ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ కొత్త హెడ్‌లైట్ సెటప్‌తో మరింత దూకుడుగా ఉంటుంది. అంతే కాకుండా ఈ కాంపాక్ట్ పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కలిగి ఉంటుంది.

బెనెల్లి ఫ్యూయెల్ ట్యాంక్ మునుపటి మోడల్లో కంటే కూడా కొంత పొడవుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా స్పోర్టియర్ గా కనిపిస్తుంది. ఈ కొత్త మోటారుసైకిల్ యొక్క టైల్ భాగం కూడా కొంత అప్డేట్ చేయబడింది. ఇది చిన్నదిగా కనిపిస్తుంది. బెనెల్లి టిఎన్‌టి 600 ఐ సింగిల్ పీస్ సీటును కలిగి ఉంది. కాబట్టి ఇది ఇప్పటికీ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

కొత్త టిఎన్‌టి 600 ఐలో ఎగ్జాస్ట్ సిస్టమ్ కొన్ని మార్పులకు గురై ఉంటుంది. ఇది మునుపటి మోడెల్లో మాదిరిగా కాకుండా, డ్యూయల్ ఎగ్జాస్ట్‌లను పిలియన్ సీటు కింద ఉంచారు. ఈ కొత్త ఎగ్జాస్ట్ సెటప్‌తో, టిఎన్‌టి 600 ఐ అద్భుతమైన ఎగ్జాస్ట్ నోట్‌ను కలిగి ఉందని ఆశించవచ్చు.

వెనుక నుండి టిఎన్‌టి 600 ఐ స్పోర్టియర్‌గా కనిపించడానికి బెనెల్లి వెనుక టైర్ హగ్గర్ మౌంటెడ్ లైసెన్స్ ప్లేట్ హోల్డర్‌ను జోడించబడి ఉంటుంది. ఇది నిలువుగా వున్న వెనుక వైపు టర్న్ సిగ్నల్‌లను కూడా కలిగి ఉంది.

ప్రస్తుతానికి 2021 టిఎన్‌టి 600 ఐ కి సంబంధించినంతవరకు ఇంజిన్ మరియు హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ కొత్త బైక్ 4 సిలిండర్ ఇంజిన్‌ను మాత్రమే కలిగి ఉంటుందని ఆశించవచ్చు. ఈ ఇంజిన్ 81 హార్స్‌పవర్ ఉత్పత్తి చేస్తుంది. 2021 బెనెల్లి టిఎన్‌టి 600 ఐ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
Source: Indianautosblog


Click it and Unblock the Notifications








