కొత్త డిజైన్ తో రానున్న 2021 బెనెల్లి టిఎన్‌టి 600 ఐ మోటార్ సైకిల్

చైనా ద్విచక్ర వాహన సంస్థ అయిన బెనెల్లి తన సరికొత్త శ్రేణి స్పోర్ట్స్ బైక్‌ టిఎన్‌టి 600 ఐ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కొత్త బైక్ రూపకల్పనకు సంబంధించి చిత్రాలు ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు. బెనెల్లి యొక్క టిఎన్‌టి 600 ఐ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

కొత్త డిజైన్ తో రానున్న 2021 బెనెల్లి టిఎన్‌టి 600 ఐ మోటార్ సైకిల్

కొత్త 2021 టిఎన్‌టి 600 ఐ రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంది. ఇది 3 లైట్ సెటప్‌ను కలిగి ఉండటమే కాకుండా కొత్త హెడ్‌ల్యాంప్‌ను కూడా కలిగి ఉంది. ఇరు వైపులా రెండు ప్రొజెక్టర్ లైట్లు కలిగి ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ కొత్త హెడ్‌లైట్ సెటప్‌తో మరింత దూకుడుగా ఉంటుంది. అంతే కాకుండా ఈ కాంపాక్ట్ పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కలిగి ఉంటుంది.

కొత్త డిజైన్ తో రానున్న 2021 బెనెల్లి టిఎన్‌టి 600 ఐ మోటార్ సైకిల్

బెనెల్లి ఫ్యూయెల్ ట్యాంక్ మునుపటి మోడల్లో కంటే కూడా కొంత పొడవుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా స్పోర్టియర్ గా కనిపిస్తుంది. ఈ కొత్త మోటారుసైకిల్ యొక్క టైల్ భాగం కూడా కొంత అప్డేట్ చేయబడింది. ఇది చిన్నదిగా కనిపిస్తుంది. బెనెల్లి టిఎన్‌టి 600 ఐ సింగిల్ పీస్ సీటును కలిగి ఉంది. కాబట్టి ఇది ఇప్పటికీ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

MOST READ: కరోనా బాధితుల సహాయం కోసం మరో అడుగు ముందుకు వేసిన ఓలా

కొత్త డిజైన్ తో రానున్న 2021 బెనెల్లి టిఎన్‌టి 600 ఐ మోటార్ సైకిల్

కొత్త టిఎన్‌టి 600 ఐలో ఎగ్జాస్ట్ సిస్టమ్ కొన్ని మార్పులకు గురై ఉంటుంది. ఇది మునుపటి మోడెల్లో మాదిరిగా కాకుండా, డ్యూయల్ ఎగ్జాస్ట్‌లను పిలియన్ సీటు కింద ఉంచారు. ఈ కొత్త ఎగ్జాస్ట్ సెటప్‌తో, టిఎన్‌టి 600 ఐ అద్భుతమైన ఎగ్జాస్ట్ నోట్‌ను కలిగి ఉందని ఆశించవచ్చు.

కొత్త డిజైన్ తో రానున్న 2021 బెనెల్లి టిఎన్‌టి 600 ఐ మోటార్ సైకిల్

వెనుక నుండి టిఎన్‌టి 600 ఐ స్పోర్టియర్‌గా కనిపించడానికి బెనెల్లి వెనుక టైర్ హగ్గర్ మౌంటెడ్ లైసెన్స్ ప్లేట్ హోల్డర్‌ను జోడించబడి ఉంటుంది. ఇది నిలువుగా వున్న వెనుక వైపు టర్న్ సిగ్నల్‌లను కూడా కలిగి ఉంది.

MOST READ:లాక్‌డౌన్ లో కొడుకుని తీసుకురావడానికి 1400 కిలోమీటర్లు ప్రయాణించిన తల్లి

కొత్త డిజైన్ తో రానున్న 2021 బెనెల్లి టిఎన్‌టి 600 ఐ మోటార్ సైకిల్

ప్రస్తుతానికి 2021 టిఎన్‌టి 600 ఐ కి సంబంధించినంతవరకు ఇంజిన్ మరియు హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ కొత్త బైక్ 4 సిలిండర్ ఇంజిన్‌ను మాత్రమే కలిగి ఉంటుందని ఆశించవచ్చు. ఈ ఇంజిన్ 81 హార్స్‌పవర్ ఉత్పత్తి చేస్తుంది. 2021 బెనెల్లి టిఎన్‌టి 600 ఐ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Source: Indianautosblog

Most Read Articles

English summary
2021 Benelli TNT 600i design leaked via patent images. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X