హెల్మెట్ లేకుండా బైక్ రైడింగ్ చేసిన అక్షయ్ కుమార్.. ఎందుకిలా చేసాడో చూడండి
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ ని నడపటం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు ఎం జరిగింది, అక్షయ్ కుమార్ ఎందుకు హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్ళాడు అనే దానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

బాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప పేరు సంపాదించిన అక్షయ్ కుమార్ తన సహ నటి అయిన కత్రినా కైఫ్‌తో కలిసి హోండా సిబిఆర్ 6 ఎఫ్ మిడ్ కెపాసిటీ మోటార్‌సైకిల్‌పై స్వారీ చేస్తున్నట్లు గుర్తించారు.

ఇక్కడ అసలు విషయాన్ని గమనించినట్లయితే అక్షయ్ కుమార్ రాబోయే సినిమా కోసం రోహిత్ శెట్టి సూర్యవంశీ నేతృత్వంలో జరుగుతున్నప్పుడు సెట్స్ నుండి వీడియో లీక్ అయింది. ఈ లీక్ అయిన వీడియోలో అక్షయ్ కుమార్ తన సహనటి అయిన కత్రినా కైఫ్ తో హెల్మెట్ లేకుండా రైడ్ చేయడం చూడవచ్చు.

ఈ వీడియోలో రైడింగ్ చేస్తున్నప్పుడు అక్షయ్ కుమార్ మరియు కత్రినా కైఫ్ ఇద్దరు హెల్మెట్ ధరించలేదు. అక్షయ్ కుమార్ డ్రైవ్ చేసిన సిబిఆర్ 650 ఎఫ్ మిడ్ కెపాసిటీ మోటార్‌సైకిల్ కి ఇటీవల కాలంలోనే లాంచ్ చేయడం జరిగింది. దీని ధర దాదాపు రూ. 7.70 లక్షలు (ఎక్స్-షోరూమ్).

సాధారణంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించడం చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. ఒక పాపులర్ సినిమా నటుడు ఇటువంటి సీన్స్ చేయడం వల్ల యువత మరియు అభిమానులంతా దీనిని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు సాధారణంగా ప్రమాదాలు లెక్కకు మించి జరిగే అవకాశం ఉంటుంది. భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉన్న ఒక ప్రముఖ నటుడు ఈ విధానగా చేయడం వల్ల అతని అనుచరులకు తప్పుడు సందేశాన్ని పంపుతుంది.

హెల్మెట్ లేకుండా మోటారుసైకిల్‌ను నడుపుతూ గుర్తించడం ఇది మొదటి సారి కాదు. అదే చిత్రం కోసం బ్యాంకాక్ రోడ్లపై స్టంట్ దృశ్యం కోసం డుకాటీ మాన్స్టర్ మోటార్ సైకిల్ నడుపుతూ అక్షయ్ కనిపించాడు. తరువాత రోహిత్ శెట్టి భద్రత ముఖ్యమని ఇంస్టాగ్రామ్ లో ఈ విధంగా చెప్పారు, దయచేసి ఈ స్టంట్‌ను ప్రయత్నించకండి. ఇవన్నీ నియంత్రిత ప్రదేశాలలో జరుపుతాము అని తన సందేశాన్ని పంచారు.

హెల్మెట్ ధరించకుండా మోటారు సైకిళ్లపై స్టంట్ చేసిన ఏకైక స్టార్ అక్షయ్ కుమార్ మాత్రమే కాదు. నిజానికి టామ్ క్రూజ్ వంటి హాలీవుడ్ స్టార్ తన మిషన్ ఇంపాజిబుల్ మూవీలో హెల్మెట్ లేకుండా బిఎండబ్ల్యు మోటార్ సైకిల్ నడుపుతూ కనిపించాడు.

సాధారణంగా అక్షయ్ కుమార్ చాలా కాలంగా రహదారి భద్రతకు మద్దతుదారుడు మరియు సురక్షితమైన రైడింగ్‌ను ప్రోత్సహించడానికి అనేక ప్రచారాలు చేస్తున్నట్లు చూడవచ్చు. ముఖ్యంగా అక్షయ్ కుమార్ సినిమా షూట్స్ కోసం హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే ఇది ఒక్కసారిగా విస్తృత ప్రచారానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక సెలబ్రెటీని చూసి చాలా మంది ఇటువంటి వాటిని ఫాలో అవుతారు కాబట్టి, సినిమాలు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీయాలి.


Click it and Unblock the Notifications








