ఈ సైకిళ్ల ప్రారంభ ధర రూ.30,000; వీటిలో అంత స్పెషల్ ఏంటంటే..

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న సైకిళ్లు చాలా ప్రత్యేకమైనవి. వీటిని ప్రముఖ భారత కన్జ్యూమర్ సైకిల్ బ్రాండ్ 'ఆల్ఫావెక్టర్' దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ సైకిళ్లన్నీ కూడా పాపులర్ ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ అయిన 'కెటిఎమ్'కి చెందినవి.

ఈ సైకిళ్ల ప్రారంభ ధర రూ.30,000; వీటిలో అంత స్పెషల్ ఏంటంటే..

మార్కెట్లో ఈ కొత్త కెటిఎమ్ సైకిళ్ల ధరలు రూ.30,000 నుంచి ప్రారంభమై రూ.10 లక్షల వరకు ఉన్నాయి. కెటిఎమ్ భారతదేశంలో తమ సైకిళ్లను ప్రత్యేకంగా ఆల్ఫావెక్టర్ రీటైలర్ ద్వారా విక్రయించనున్నారు. భారత మార్కెట్లో కెటిఎమ్ సైకిళ్ల ప్రత్యేక పంపిణీదారుగా ఆల్ఫావెక్టర్ కొనసాగనుంది.

ఈ సైకిళ్ల ప్రారంభ ధర రూ.30,000; వీటిలో అంత స్పెషల్ ఏంటంటే..

కెటిఎమ్ నుండి లభిస్తున్న సైకిళ్ల రేంజ్‌లో మౌంటైన్ బైక్‌లు (ఎమ్‌టిబి) ఆల్ టెర్రైన్ బైక్‌లు (ఏటిబి) ఫ్యాట్ టైర్ బైక్‌లు (ఎఫ్‌టిబి) హైబ్రిడ్ బైక్‌లు (సిటీ) మొదలైనవి ఉన్నాయి. ఈ కెటిఎమ్ రేంజ్ సైకిళ్ళన్నీ కూడా ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు డిస్క్ బ్రేక్‌తో అల్ట్రా-లైట్ ఫ్రేమ్‌ను కలిగి ఉండి, చాలా తేలికగా ఉంటాయి.

MOST READ:భార్యని 90 కిమీ రిక్షా మీద తీసుకెళ్లిన భర్త.. ఎందుకో తెలుసా ?

ఈ సైకిళ్ల ప్రారంభ ధర రూ.30,000; వీటిలో అంత స్పెషల్ ఏంటంటే..

ఈ సైకిళ్లలో షిమనో గేర్ మరియు డీరైల్లూర్‌ను కూడా ఉపయోగించారు. భారతదేశంలో విశిష్టమైన ఓమ్నిచానెల్ బిజినెస్ మోడల్‌ని కలిగి ఉన్న ఆల్ఫావెక్టర్ స్టోర్‌లలో ఈ కెటిఎమ్ రేంజ్ సైకిళ్లు అందుబాటులో ఉంటాయి. ఆల్ఫావెక్టర్ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫారమ్‌తో పాటుగా దేశవ్యాప్తంగా విస్తృతమైన సేల్స్ నెట్‌వర్క్‌ను కూడా కలిగి ఉంది.

ఈ సైకిళ్ల ప్రారంభ ధర రూ.30,000; వీటిలో అంత స్పెషల్ ఏంటంటే..

ప్రతి ఆన్‌లైన్ కొనుగోలు ఆల్ఫావెక్టర్ యొక్క 91కేర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఆఫ్‌లైన్‌లో డీలర్‌కు మ్యాప్ చేయబడుతుంది. దీని సాయంతో కస్టమర్‌కు ఇబ్బంది లేని అసెంబ్లింగ్ మరియు సర్వీస్ లభిస్తుంది. అంతేకాకుండా, ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో ఇది కస్టమర్‌కు ఇబ్బంది లేని కొనుగోలు అనుభవాన్ని కూడా కల్పిస్తుంది.

MOST READ:జరభద్రం గురూ.. కారులో ఇలా చేసారంటే ప్రాణాలే పోవచ్చు.. కావాలంటే ఇది చూడండి

ఈ సైకిళ్ల ప్రారంభ ధర రూ.30,000; వీటిలో అంత స్పెషల్ ఏంటంటే..

ఆల్ఫావెక్టర్ బ్రాండ్ భారతదేశంలో 350కి పైగా నగరాల్లో, 700కి పైగా దుకాణాలతో బలమైన రీటైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారతదేశంలో సైక్లింగ్ భవిష్యత్తును పునర్నిర్వచించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజలు కేవలం సోఫాలు మరియు డిజిటల్ స్క్రీన్‌లకు మాత్రమే పరిమితం కాకుండా, బయటకు వచ్చి చురుకైన జీవనశైలిని అనుభవించేలా, తద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందేలా వారిని ప్రేరేపించాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఈ సైకిళ్ల ప్రారంభ ధర రూ.30,000; వీటిలో అంత స్పెషల్ ఏంటంటే..

భారతదేశంలో కెటిఎమ్ సైకిళ్ల శ్రేణిని ప్రారంభించడం ద్వారా ఆల్ఫావెక్టర్ బ్రాండ్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇన్నోవేషన్ మరియు పెర్ఫార్మెన్స్ డ్రైవెన్ ప్రీమియం విభాగంలోకి ప్రవేశించనుంది. మిలీనియల్స్ మరియు జెన్-జెడ్లను చురుకైన జీవనశైలికి పరిచయం చేయాలన్న ఆల్ఫావెక్టర్ లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రకటన ఉంటుంది.

MOST READ:పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కొత్త వీడియో.. చూసారా !

ఈ సైకిళ్ల ప్రారంభ ధర రూ.30,000; వీటిలో అంత స్పెషల్ ఏంటంటే..

కెటిఎమ్ యొక్క హై-క్వాలిటీ మరియు పెర్ఫార్మెన్స్ డ్రైవెన్ పోర్ట్‌ఫోలియోను ఆల్ఫావెక్టర్ యొక్క ప్రత్యేకమైన ఓమ్నిచానెల్ బిజినెస్ ఛానెల్‌తో కలిపి ఈ విభాగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చాలని ఇరు కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆల్ఫావెక్టర్ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పూణే, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల నుండి ఈ ప్రీమియం సైకిళ్ల విభాగానికి 75 శాతం డిమాండ్ రావచ్చని కంపెనీ ఆశిస్తోంది.

ఈ సైకిళ్ల ప్రారంభ ధర రూ.30,000; వీటిలో అంత స్పెషల్ ఏంటంటే..

ఇక కెటిఎమ్ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కెటిఎమ్ తమ కొత్త ఎంట్రీ లెవల్ అడ్వెంచర్-టూరర్ మోటార్‌సైకిల్ 'కెటిఎమ్ 250 అడ్వెంచర్'ను ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ.2.48 లక్షలు (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ)గా ఉంది.

MOST READ:బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న బిఆర్ శెట్టి లగ్జరీ కార్స్.. చూసారా !

ఈ సైకిళ్ల ప్రారంభ ధర రూ.30,000; వీటిలో అంత స్పెషల్ ఏంటంటే..

కెటిఎమ్ అడ్వెంచర్ 250 మోటార్‌సైకిల్‌ను దాని బిగ్ బ్రదర్ అయిన అడ్వెంచర్ 390 నుండి ప్రేరణ పొంది తయారు చేశారు. కెటిఎమ్ అడ్వెంచర్ 250లో 248 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 30 బిహెచ్‌పి శక్తిని మరియు 24 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పవర్ అసిస్ట్ స్లిప్పర్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఈ సైకిళ్ల ప్రారంభ ధర రూ.30,000; వీటిలో అంత స్పెషల్ ఏంటంటే..

భారత్‌లో కెటిఎమ్ ప్రీమియం సైకిళ్ల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 కారణంగా, ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు ఇంటి వద్ద నుండే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఫిట్‌నెస్ అత్యంత ప్రాధమిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడానికి ఫిట్నెస్ విధానాల్లో సైక్లింగ్ అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిల్లో ఒకటి. కొత్తగా ప్రారంభించిన కెటిఎమ్ శ్రేణి సైకిళ్లతో దేశంలో పెరుగుతున్న సైకిళ్ల డిమాండ్ తీరగలదని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
AlphaVector has launched a new range of KTM bicycles in the Indian market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X