భారత్‌లో ఆంపియర్ మాగ్నస్ 60 ఎలక్ట్రిక్ స్కూటర్ నిలిపివేత, వివరాలు

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ భారత మార్కెట్లో విక్రయిస్తున్న 'ఆంపియర్ మాగ్నస్ 60'లో లీడ్-యాసిడ్ వేరియంట్‌ను కంపెనీ దేశీయ విపణిలో నిలిపివేసింది. ఈ స్కూటర్ స్థానంలో 'ఆంపియర్ మాగ్నస్ ప్రో' అని పిలువబడే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఇందులో మరింత మెరుగైన లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు.

భారత్‌లో ఆంపియర్ మాగ్నస్ 60 ఎలక్ట్రిక్ స్కూటర్ నిలిపివేత, వివరాలు

ఆంపియర్ అందిస్తున్న తక్కువ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో మాగ్నస్ 60 కూడా ఒకటి, దేశీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.44,699 (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. ఇప్పటి వరకూ ఆంపియర్ మాగ్నస్ 60 ఎలక్ట్రిక్ స్కూటర్‌ 60 వోల్ట్ 20 ఏహెచ్ లీడ్-యాసిడ్ బ్యాటరీ ప్యాక్‌తో లభించేది.

భారత్‌లో ఆంపియర్ మాగ్నస్ 60 ఎలక్ట్రిక్ స్కూటర్ నిలిపివేత, వివరాలు

ఈ స్కూటర్ స్టాండర్డ్ వాల్ ఛార్జర్‌తో వచ్చేది, ఇది 8 నుండి 10 గంటల వ్యవధిలో బ్యాటరీ మొత్తాన్ని పూర్తిగా చార్జ్ చేయగలిగేది. పూర్తి ఛార్జ్‌పై ఈ స్కూటర్‌తో 50 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. ఇది గరిష్టంగా గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్‌లో హబ్-మౌంటెడ్ 250 వాట్స్ బ్రష్‌లెస్ డిసి మోటార్‌ని ఉపయోగించారు.

భారత్‌లో ఆంపియర్ మాగ్నస్ 60 ఎలక్ట్రిక్ స్కూటర్ నిలిపివేత, వివరాలు

ఆంపియర్ మాగ్నస్ 60 గరిష్టంగా 130 కిలోల పేలోడ్ మోస్తుంది. దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్-షాక్ అబ్జార్వర్స్ ఉంటాయి. దీని బ్రేకింగ్ విషయానికి వస్తే, రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఇంకా ఇందులో ట్యూబ్‌లెస్ టైర్లు అల్లాయ్ వీల్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండేది.

భారత్‌లో ఆంపియర్ మాగ్నస్ 60 ఎలక్ట్రిక్ స్కూటర్ నిలిపివేత, వివరాలు

ఆంపియర్ మాగ్నస్ 60 స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చిన కొత్త ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ ఇటీవలే సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ .73,990* గా ఉంది. ఇప్పుడు ఆంపియర్ నుంచి లభిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ కూడా ఇదే కావటం విశేషం.

భారత్‌లో ఆంపియర్ మాగ్నస్ 60 ఎలక్ట్రిక్ స్కూటర్ నిలిపివేత, వివరాలు

ఈ కొత్త స్కూటర్ దాని మునుపటి వెర్షన్లతో పోల్చుకుంటే మరిన్ని అధునాతన ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బీజ్ కలర్ సీట్ అప్‌హోలెస్ట్రీ, విశాలమైన లెగ్‌రూమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో వేరు చేయగలిగిన బ్యాటరీ ప్యాక్, యాంటీ-తెఫ్ట్ అలారం సిస్టమ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

భారత్‌లో ఆంపియర్ మాగ్నస్ 60 ఎలక్ట్రిక్ స్కూటర్ నిలిపివేత, వివరాలు

ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 60 వోల్ట్, 30 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఈ బ్యాటరీ ప్యాక్‌ను 1.2 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారుకు జత చేయబడి ఉంటుంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే ఛార్జీపై గరిష్టంగా 80 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ని కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇది గరిష్టంగా గంటకు 55 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది.

భారత్‌లో ఆంపియర్ మాగ్నస్ 60 ఎలక్ట్రిక్ స్కూటర్ నిలిపివేత, వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 60 వోల్ట్ ఛార్జర్‌తో వస్తుంది, ఇది బ్యాటరీని 0 నుండి 100 శాతం ఛార్జ్ చేయడానికి 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ గరిష్ట పేలోడ్ 150 కిలోలు, దీని మొత్తం బరువు 82 కిలోలు.

భారత్‌లో ఆంపియర్ మాగ్నస్ 60 ఎలక్ట్రిక్ స్కూటర్ నిలిపివేత, వివరాలు

భారత్‌లో ఆంపియర్ మాగ్నస్ 60 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నిలిపివేయటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత్‌లో లాక్‌డౌన్ అనంతరం ఆంపియర్ దేశవ్యాప్తంగా 10 కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సంస్థ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ 60,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. లీడ్-యాసిడ్ బ్యాటరీలతో పోల్చుకుంటే లిథియం అయాన్ బ్యాటరీలతో నడిచే స్కూటర్లు మెరుగైన రేంజ్‌ను ఆఫర్ చేస్తాయి, వాటి మెయింటినెన్స్ కూడా తక్కువగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, June 29, 2020, 9:53 [IST]
English summary
The Ampere Magnus 60 lead-acid variant has been discontinued from the Indian market. The company has replaced the scooter with a new and better-equipped Lithium-Ion model of the electric scooter, called the Ampere Magnus Pro. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+