Just In
Don't Miss
- Lifestyle
సోమవారం దినఫలాలు : అనవసరమైన పనులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు...!
- News
వ్యవసాయ చట్టాల రద్దు తప్ప.. ఏదైనా అడగండి: కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్
- Movies
ట్రెండింగ్ : కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. పైకి కనపడేది నిజం కాదు.. మళ్లీ బుక్కైన నాగబాబు
- Finance
పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
- Sports
సెహ్వాగ్ చెప్పిన ప్రకారం గబ్బాలో భారత్‌దేనా విజయం..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో లాంచ్ అయిన ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ : ధర & ఇతర వివరాలు
భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆంపియర్ వెహికల్స్ మాగ్నస్ ప్రో అనే కొత్త ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 73,990, ఎక్స్-షోరూమ్ (ఇండియా).

బెంగళూరు నగరంలో సరికొత్త మాగ్నస్ ప్రో అమ్మకం ప్రారంభించినట్లు ఆంపియర్ ప్రకటించింది. రాబోయే రెండు నెలల్లో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇతర నగరాల్లో విస్తరిస్తుంది. మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఆంపియర్ వెహికల్స్ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించాయి. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ 60 వి, 30 ఎహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో 1.2 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడుతుంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే ఛార్జ్‌లో గరిష్టంగా 180 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది.
అంతే కాకుండా ఇది గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణింస్తుంది. ఆంపియర్ మాగ్నస్ ప్రో 60 వి ఛార్జర్‌తో వస్తుంది, ఇది ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 నుండి 6 గంటలు పడుతుంది.
MOST READ:మాకొక కొత్త పార్ట్నర్ కావాలి: మహీంద్రా అండ్ మహీంద్రా

డిజైన్ పరంగా, ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి డిజైన్ కలిగి ఉంటుంధి. ఇది ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది.

రీజనరేటివ్ బ్రేకింగ్ సహాయంతో బ్రేకింగ్‌ను ఇరువైపులా డ్రమ్ బ్రేక్‌లు కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఇతర సాంకేతిక వివరాలలో గరిష్టంగా 150 కిలోల లోడింగ్ సామర్థ్యం, 150 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 1415 మిమీ వీల్‌బేస్ ఉన్నాయి.
MOST READ:టొయోటా గ్లాంజా, యారిస్ కార్లపై స్పెషల్ డిస్కౌంట్స్, వివరాలు

ఆంపియర్ మాగ్నస్ ప్రో అనేక ఫీచర్స్ కలిగి ఉంటుంది. వీటిలో కొన్ని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టైల్లైట్, కీలెస్ ఎంట్రీ, యాంటీ-తెఫ్ట్ అలారం, ఎల్ఈడీ లైట్‌తో అండర్ సీట్ స్టోరేజ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లింప్-హోమ్ మోడ్ మరియు కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ వంటివి ఉంటాయి.

కొత్త ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆకర్షణీయమైన రంగులలో అందించబడుతుంది. ఇందులో మెటాలిక్ రెడ్, గోల్డెన్ ఎల్లో, బ్లూయిష్ పెర్ల్ వైట్ & గ్రాఫైట్ బ్లాక్ కలర్స్ లో లభిస్తాయి.
MOST READ:ముంబై పోలీసులకి సెగ్వే ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎందుకో తెలుసా ?

భారతదేశంలో ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం :
ఆల్-న్యూ ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో బ్రాండ్ యొక్క సరికొత్త ఫ్లాగ్షిప్ మోడల్. మాగ్నస్ ప్రో మార్కెట్లో సాంప్రదాయక పెట్రోల్-శక్తితో పనిచేసే 110 సిసి స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది వాహనదారునికి మంచి డ్రైవింగ్ అనుభూతిని కలిగిస్తుంది.