భారత్‌కు రానున్న ఆప్రిలియా ఆర్ఎస్ 660; బుకింగ్స్ ఎప్పుండంటే?

మిడిల్-వెయిట్ మోటార్‌సైకిల్ విభాగంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఆప్రిలియా ఆర్ఎస్ 660 ఒకటి. ఇటాలియన్ మోటార్‌సైకిల్ కంపెనీ పోస్ట్ చేసిన తాజా టీజర్ ప్రకారం, తమ బ్రాండ్ నుండి రాబోయే ఈ సరికొత్త మోటార్‌సైకిల్ కోసం ప్రీ-బుకింగ్స్‌ను అక్టోబర్ 2020 నుండి ఓపెన్ చేయనున్నట్లు పేర్కొంది.

భారత్‌కు రానున్న ఆప్రిలియా ఆర్ఎస్ 660; బుకింగ్స్ ఎప్పుండంటే?

ఆప్రిలియా ఆర్‌ఎస్ 660 గ్లోబల్ మార్కెట్లతో పాటుగా భారత మార్కెట్లో కూడా విడుదల కానున్నట్లు సమాచారం. ఇది వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఆర్ఎస్ 660 మోడల్‌ను చేర్చడాన్ని చూస్తుంటే, ఇది ఖచ్చితంగా భారత్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

మార్కెట్లో విడుదల కావటానికి ముందే ఈ మోడల్‌కు సంబంధించి అనేక వివరాలను వెల్లడయ్యాయి. వాస్తవానికి ఆప్రిలియా ఆర్ఎస్ 660 ఈ ఏడాది ఆరంభంలోనే అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయాలని భావించారు. అయితే, కోవిడ్-19తో ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో ఇటలీ ఉండటం వలన ఈ మోడల్ విడుదల వాయిదా పడింది.

MOST READ:ల్యాండ్ రోవర్ ని కాపాడిన మహీంద్రా థార్, ఎలాగో వీడియో చూడండి

భారత్‌కు రానున్న ఆప్రిలియా ఆర్ఎస్ 660; బుకింగ్స్ ఎప్పుండంటే?

ఆప్రిలియా అందిస్తున్న ఆర్ఎస్‌వి4 మోడల్ నుండి ఆర్ఎస్ 660 మోడల్‌ను డిజైన్ చేశారు. ఆర్ఎస్‌వి4 మోటార్‌సైకిల్‌లో అగ్రెసివ్‌గా కనిపించే పూర్తి ఫెయిరింగ్ మరియు ఏరో వింగ్లెట్ వంటి డిజైన్ ఫీచర్లను ఆర్ఎస్ 600 మోడల్‌లోనూ గమనించవచ్చు. ఇందులోని రేస్-స్పెక్ స్టైల్ వింగ్లెట్స్ అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు మెరుగైన ఏరోడైనమిక్ స్థిరత్వాన్ని అందించడంలో సహకరిస్తాయి.

భారత్‌కు రానున్న ఆప్రిలియా ఆర్ఎస్ 660; బుకింగ్స్ ఎప్పుండంటే?

ఆర్ఎస్ 660లో ఆప్రిలియా సిగ్నేచర్ త్రీ-పార్ట్ ఎల్ఈడి హెడ్‌లైట్‌ను కలిగి ఉంటుంది, ఇందులో ఇరువైపులా ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయి. దీని స్కల్ప్‌టెడ్ ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్, షార్ప్ క్రీజ్ లైన్స్ మోటార్‌సైకిల్ అగ్రెసివ్ లుక్‌ని మరింత మెరుగుపరుస్తాయి. ఆర్ఎస్ 660 వెనుక డిజైన్ చూడటానికి ఆర్ఎస్‌వి4 మాదిరిగానే అనిపిస్తుంది.

MOST READ:కారులో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లండి

భారత్‌కు రానున్న ఆప్రిలియా ఆర్ఎస్ 660; బుకింగ్స్ ఎప్పుండంటే?

ఇంజన్ విషయానికి వస్తే, ఆప్రిలియా ఆర్ఎస్ 660లో 660సిసి, పారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ సుమారు 100 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఇది స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌కు అనుసంధానం చేయబడి ఉంటుంది. ఆర్ఎస్ 660 బరువు 165 కిలోలు మాత్రమే ఉంటుంది, ఫలితంగా ఇది ఈ విభాగంలో అత్యంత తేలికైన బైక్‌లో ఒకటిగా ఉంటుంది.

భారత్‌కు రానున్న ఆప్రిలియా ఆర్ఎస్ 660; బుకింగ్స్ ఎప్పుండంటే?

ఆప్రిలియా ఆర్ఎస్ 660 ఫుల్లీ లోడెడ్ ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్స్ ఉంటాయి. వీటిలో వీలీ కంట్రోల్, కార్నరింగ్ ఏబిఎస్, క్రూయిజ్ కంట్రోల్, ఐదు వేర్వేరు రైడింగ్ మోడ్స్ మరియు బై-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:పవిత్రమైన కాబాపై విమానాలు ప్రయాణించవు, ఎందుకో తెలుసా ?

భారత్‌కు రానున్న ఆప్రిలియా ఆర్ఎస్ 660; బుకింగ్స్ ఎప్పుండంటే?

ఇందులో 5 ఇంచ్ టిఎఫ్‌టి స్ప్లిట్-స్క్రీన్ ఉంటుంది. ఇది మోటార్‌సైకిల్‌లోని అన్ని ఎలక్ట్రానిక్ అసిస్టెన్స్‌ను కంట్రోల్ చేయటంలో సహకరిస్తుంది. దీనిని బ్లూటూత్ సాయంతో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకునే సౌలభ్యం ఉంటుందని అంచనా.

భారత్‌కు రానున్న ఆప్రిలియా ఆర్ఎస్ 660; బుకింగ్స్ ఎప్పుండంటే?

ఆప్రిలియా ఆర్‌ఎస్ 600 సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు కయాబా బ్రాండ్ నుంచి గ్రహించిన 41 మిమీ, యుఎస్‌డి ఫోర్కులు, వెనుక వైపు మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్‌లు ఉంటాయి. ఈ రెండింటినీ పూర్తిగా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయెల్ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక వైపున సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఈ రెండింటినీ బ్రెంబో బ్రాండ్ నుండి సేకరించాలు.

MOST READ:త్వరలో రానున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ; చూసారా ?

భారత్‌కు రానున్న ఆప్రిలియా ఆర్ఎస్ 660; బుకింగ్స్ ఎప్పుండంటే?

ఆర్ఎస్250 రెగ్గియాని రెప్లికా మోటార్‌సైకిల్ నుండి ప్రేరణ పొందిన ఆప్రిలియా ఆర్ఎస్ 660 మోడల్‌ను రెండు కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు. అవి - మ్యాట్ బ్లాక్ విత్ రెడ్, పర్పల్ విత్ రెడ్. ఈ మోటార్‌సైకిల్ కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియు) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకుని ఇక్కడే అసెబ్లింగ్ చేసే అవకాశం ఉంది.

భారత్‌కు రానున్న ఆప్రిలియా ఆర్ఎస్ 660; బుకింగ్స్ ఎప్పుండంటే?

ఆప్రిలియా ఆర్ఎస్ 660 మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

గ్లోబల్ మార్కెట్లలో మాదిరిగానే భారత్‌లో కూడా మిడిల్-వెయిట్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ విభాగం అత్యంత ప్రాచురాన్ని సంతరించుకుంటోంది. స్పోర్టీ లుక్స్, అద్భుతమైన ఎలక్ట్రానిక్స్ మరియు సాటిలేని పనితీరుతో రూపుదిద్దుకున్న ఆప్రిలియా ఆర్ఎస్ 660 భారత్‌లో మంచి విజయం సాధించవచ్చనేది మా అభిప్రాయం.

Most Read Articles

English summary
The Aprilia RS 660 is among the most anticipated middle-weight motorcycle in the world. According to the latest teaser posted by the company, pre-bookings for the upcoming motorcycle will be open in October 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X