Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అలెర్ట్... ఎప్రిలియా సూపర్ బైక్ పొందటానికి ఇక గడువు 45 రోజులు మాత్రమే
ఎప్రిలియా తన బ్రాండ్ అయిన ఆర్‌ఎస్‌వి 4 1100 బైక్ ని 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఈ ఎప్రిలియా ఆర్‌ఎస్‌వి 4 కి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఎప్రిలియా సూపర్ బైక్ అయిన ఆర్‌ఎస్‌వి 4 ను దాదాపు ఒక శతాబ్దం తరువాత గత సంవత్సరంలో అప్డేట్ చేసింది. ఆర్‌ఎస్‌వి 4 1100 గా పిలవబడే ఈ బైక్ చూడటానికి సూపర్ స్పోర్ట్స్ బైక్ లాగా ఉంటుంది. ఇందులో శక్తివంతమైన ఇంజిన్ ఉంటుంది.

ఎప్రిలియా, ఆర్‌ఎస్‌వి 4 బైక్ గురించి బహిరంగ ప్రకటన చేయనప్పటికీ ఇండియన్ మార్కెట్లో దీనిని రూ. 22.4 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకి అమ్మబడుతోందని తెలిపింది. ప్రస్తుతానికి ఈ బైక్ ని బుకింగ్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తరువాత 45 రోజులకి కస్టమర్ ని చేరుకుంటుందని కంపెనీ వర్గాలు తెలియజేశాయి.

ఆర్‌ఎస్‌వి 4 బైక్ ఆర్ఎఫ్ 1,100 సిసి ఇంజిన్ ని కలిగి ఉంటుంది. అప్రిలియా తన బోర్‌ను 81 మిమీకి పెంచింది. ఇదే కాకుండా కూలింగ్ కోసం ఇది కొత్త ఆయిల్ పంప్ మరియు సెకండరీ ఆయిల్ ఇంజెక్టర్‌ను అమర్చింది. ఇది 13,200 rpm వద్ద 217 hp మరియు 11,000 rpm వద్ద 122 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

ఎప్రిలియా బైక్ లో ఒక్క ఇంజిన్ ని మాత్రమే కాకుండా బైక్ ప్రేమ్ మరియు సస్పెన్షన్ సెటప్‌తో పాటు ఎర్గోనామిక్స్‌ను కూడా సవరించడం జరిగింది. ఈ బైక్ యొక్క టాప్-స్పెక్ హార్డ్‌వేర్‌లో అహ్లిన్స్ నిక్స్ ఫోర్క్స్ మరియు మోనోషాక్ మరియు స్టీరింగ్ డంపర్ ఉన్నాయి.

ఇవే కాకుండా 1100 ఆర్‌ఎఫ్‌లో కార్బన్-ఫైబర్ మోటోజిపి లాంటి ఏరో వింగ్లెట్స్ కూడా లభిస్తాయి. ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు స్పీడ్ లిమిటర్ వంటి తయారీదారుల APRC సిస్టమ్ (ఎప్రిలియా పెర్ఫార్మెన్స్ రైడ్ కంట్రోల్) కూడా ఉంది, ఇవన్నీ స్వతంత్రంగా కాన్ఫిగర్ చేయబడతాయి. ఇవన్నీ కూడా స్వతంత్రంగా డీ ఆక్టివేట్ చేయటానికి అనుకూలంగా ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం ఈ బైక్ అమ్మకానికి ఉంది. ఇది బిఎస్-6 ఉద్గారా నిబంధనలకు అనుకూలంగా లేదు కాబట్టి ఈ అమ్మకాలు కేవలం ఏప్రిల్ 1 దాకా మాత్రమే అంటే ఇంకా 45 రోజులు మాత్రమే అమ్మకం జరుగుతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఎప్రిలియా ఆర్‌ఎస్‌వి 4 బైక్ చూడటానికి స్పోర్ట్స్ బైక్ లాగ ఉంది. ఇది కేవలం స్పోర్ట్స్ బైక్ లాగ మాత్రమే కాకుండా వాటిలో ఉండే చాలా ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. వినియోగదారులకి ఇది మంచి తరుణం, ఇప్పుడు ఈ బైక్ ని పొందాలంటే కేవలం 45 రోజుల గడువు మాత్రమే ఉంది.