Just In
- 5 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 6 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 6 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 8 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎస్ఆర్125 మోడల్‌ను నిలిపివేయనున్న ఆప్రిలియా; ఎందుకో తెలుసా?
ఇటాలియన్ టూవీలర్ బ్రాండ్ ఆప్రిలియా ప్రస్తుతం భారత మార్కెట్లో 125 సిసి నుండి 160 సిసి విభాగంలో వివిధ రకాల స్కూటర్లను విక్రయిస్తోంది. ఇందులో 125 సిసి లైనప్‌లో ఎస్ఆర్ 125 మరియు స్టోర్మ్ అనే రెండు మోడళ్లను ఆప్రిలియా అందిస్తోంది.

తాజాగా, జిగ్వీల్స్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, భారత మార్కెట్లో ఎస్ఆర్ 125 స్కూటర్‌ను నిలిపివేయాలని ఆప్రిలియా యోచిస్తోంది. ఎస్ఆర్ 125 మరియు స్టోర్మ్ మోడళ్ల మధ్య అతి తక్కువ ధర వ్యత్యాసం కారణంగా ఈ స్కూటర్‌ను భారత మార్కెట్ నుంచి తొలగించాలని కంపెనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దేశీయ విపణిలో ఎస్ఆర్ 125 స్కూటర్ ధర రూ.87,082 లుగా ఉండదా, స్టోర్మ్ స్కూటర్ ధర రూ.92,602 లుగా ఉంది. ఈ రెండు మోడళ్ల మధ్య ధరల వ్యత్యాసం కేవలం రూ.5,520 మాత్రమే. అంతేకాకుండా, కంపెనీ ఇటీవలే రూ.95,148 ధరతో స్టోర్మ్ మోడల్లో డిస్క్ వేరియంట్‌ను విడుదల చేసింది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
MOST READ:ప్రమాదకరమైన నీటి ప్రవాహం నుంచి బయట పడిన మహీంద్రా స్కార్పియో, ఎలాగో మీరే చూడండి

అయితే, ఈ నివేదిక ప్రకారం, కంపెనీ ‘ఎస్ఆర్' పేరును టాప్-స్పెక్ మోడళ్లకు ఉంచవచ్చని తెలుస్తోంది. ఇది స్కూటర్‌కు మరింత ప్రత్యేకత మరియు ప్రీమియం-నెస్ టచ్‌ను జోడిస్తుంది. ఎస్ఆర్125 నిలిపివేతతో, 125 సిసి స్కూటర్ విభాగంలో ఇకపై స్టోర్మ్ మోడల్ మాత్రమే కొనసాగనుంది.

ఆప్రిలియా ఎస్ఆర్ 125 ప్రస్తుతం రెండు వేరియంట్లలో లభిస్తోంది. అందులో మొదటిది అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కలిగినది మరియు రెండవది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కలిగినది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మార్పులు మినహా, ఈ రెండు వేరియంట్లలో వేరే ఎలాంటి మార్పులు లేవు.
MOST READ:అందరిని అబ్బురపరుస్తున్న ఇరుకైన ప్రేదేశంలో ఇన్నోవా పార్కింగ్ [వీడియో]

ఆప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్లో అప్డేట్ చేసిన బిఎస్6 కంప్లైంట్ 125 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7750 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 9.8 బిహెచ్పి పవర్‌ను మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 9.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఫ్యూయెల్-ఇంజెక్షన్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది.

ఈ స్కూటర్ ముందు భాగంలో ట్విన్ హెడ్‌ల్యాంప్స్ సెటప్ ఉంటుంది, దీనిని ఓ ఆప్రాన్లో అమర్చబడి ఉంటుంది. టర్న్-సిగ్నల్ ఇండికేటర్లను హ్యాండిల్ బార్ కౌల్‌పై అమర్చారు. ఎస్ఆర్ 125 యువ-తరం కొనుగోలుదారులను ఆకట్టుకునే అగ్రెసివ్ అండ్ స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
MOST READ:షోరూమ్‌కి చేరుకున్న కియా సోనెట్ టెస్ట్ డ్రైవ్ మోడల్.. చూసారా !

ఎస్ఆర్ 125 స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సెటప్ ఉంటాయి. అలాగే, బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉంటాయి. ఇది కంబైన్డ్-బ్రేకింగ్ సిస్టమ్‌ను (సిబిఎస్) సపోర్ట్ చేస్తుంది.

ఆప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్లోని 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు ట్యూబ్‌లెస్ టైర్లు మంచి హ్యాండ్లింగ్ సామర్థ్యాలను అందిస్తాయి. అయితే, ధర పరంగా చూసుకుంటే, ఆప్రిలియా ఎస్ఆర్ 125 భారత మార్కెట్లో అత్యంత ఖరీదైన 125 సిసి స్కూటర్‌గా ఉంది.
MOST READ:అదిరిపోయే ఫీచర్స్ తో మోడిఫైడ్ చేయబడిన ఫోర్స్ ట్రావెలర్, దీని ముందు లిమోలిన్ కూడా దిగదుడుపే

ఆప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్ నిలిపివేతపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో ఆప్రిలియా ఎస్ఆర్ 125 నిలిపివేత గురించి ఆ కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఎస్ఆర్ 125 మరియు స్టోర్మ్ (డిస్క్ వేరియంట్) మధ్య ధరల వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ‘ఎస్ఆర్' బ్రాండింగ్‌ను ఆప్రిలియా ఎస్ఆర్ 160 వంటి శక్తివంతమైన మోడళ్ల కోసం రిజర్వు చేసుకోవడం మంచిదనేది మా అభిప్రాయం.