Just In
- 4 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 5 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 5 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 7 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో విడుదల కానున్న ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్
పియాజ్జియోకి చెందిన ప్రీమియం టూవీలర్ బ్రాండ్ ఆప్రిలియా భారత మార్కెట్లో పెద్ల స్కూటర్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో అత్యంత పాపులర్ అయిన ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ ఇండియా లాంచ్ టైమ్‌లైన్‌ను కంపెనీ వెల్లడించింది. పియాజియో ఇండియా చైర్మన్ మరియు ఎమ్‌డి డియెగో గ్రాఫి, వెస్పా రేసింగ్ సిక్స్టీస్ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఈ ఏడాది నవంబర్‌లో ఎస్ఎక్స్ఆర్ 160 మ్యాక్సీ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. వాస్తవానికి ఈ మాక్సీ స్కూటర్‌ను ఈ ఏడాది అగస్ట్-సెప్టెంబర్ మధ్యలో ఎప్పుడైనా విడుదల చేయాల్సి ఉంది. అయితే, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా, ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ విడుదల జాప్యమైందని కంపెనీ పేర్కొంది.

ఈ స్కూటర్‌ను మొదటిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచారు. అప్పటి నుండి ఈ మోడల్‌పై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎస్ఎక్స్ఆర్ 160తో పాటుగా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్‌ను కూడా భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆప్రిలియా వెల్లడించింది. అయితే, ఎస్ఎక్స్ఆర్ 125 వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
MOST READ:ట్రాక్టర్ వెనుకవైపు పెద్ద టైర్లు ఉండటానికి కారణం ఏంటో తెలుసా ?

ఈ రెండు స్కూటర్లు చూడటానికి డిజైన్ పరంగా ఒకేలా అనిపిస్తాయి. స్కూటర్ ముందు భాగంలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్లతో కూడిన ఆప్రిలియా బ్రాండ్ సిగ్నేచర్ ట్రిపుల్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంటుంది. ఇంకా భారీ ఫ్రంట్ ఆప్రాన్, పెద్ద వైజర్, ఎల్ఈడి టెయిల్ లైట్స్, అల్లాయ్స్ వీల్స్, మజిక్యులర్ ఎగ్జాస్ట్ వంటి ఫీచర్లతో ఇవి సరికొత్త మరియు ఆధునిక రూపాన్ని కలిగి ఉంటాయి.

ఈ స్కూటర్లలోని ఇతర ఫీచర్లలో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రైడర్ మరియు పిలియన్ రైడర్ కోసం విశాలమైన సీట్లు, ఫ్రంట్ ఆప్రాన్‌కు ఇరువైపులా గ్లౌవ్‌బాక్స్, యుఎస్బి ఛార్జర్ మరియు లైటింగ్‌తో కూడిన పెద్ద అండర్-సీట్ స్టోరేజ్ మొదలైనవి ఉన్నాయి.
MOST READ:హెలికాఫ్టర్లు చేసే ఈ పనులు విమానాలు ఎందుకు చేయలేవు.. మీకు తెలుసా ?

ఇంజన్ విషానికి వస్తే, ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బిఎస్6 160 సిసి సింగిల్ సిలిండర్ ఫ్యూయెల్-ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ పవర్ఫుల్ ఇంజన్ గరిష్టంగా 7600 ఆర్‌పిఎమ్ వద్ద 10.8 బిహెచ్పి శక్తిని మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 11.6 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇకపోతే, ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్లో బిఎస్6 125 సిసి సింగిల్-సిలిండర్ ఫ్యూయెల్-ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 7250 ఆర్‌పిఎమ్ వద్ద 9.5 బిహెచ్పి శక్తిని మరియు 6250 ఆర్‌పిఎమ్ వద్ద 9.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:త్వరలో భారత్‌కి రానున్న రూ. 6.95 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ సెడాన్.. మీరు చూసారా

అంతే కాకుండా, ఈ రెండు స్కూటర్లలో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్-షాక్ అబ్జార్బర్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉంటాయి. ఇవి రెండూ సింగిల్-ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

ఆప్రిలియా పవర్ఫుల్ స్కూటర్లపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ఆప్రిలియా నుండి రానున్న ఎస్ఎక్స్ఆర్ 125 మరియు ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ల ఈ విభాగంలో ప్రధానంగా సుజుకి బర్గ్మ్యాన్కు పోటీగా నిలుస్తాయి. ఈ కొత్త మ్యాక్సీ స్కూటర్లు ట్రెడిషనల్ స్కూటర్ల కంటే మెరుగైన ప్రాక్టికాలిటీని అందిస్తాయి. రెగ్యులర్ స్కూటర్ల కంటే ఇవి మరింత కంఫర్ట్‌గా ఉండే అవకాశం ఉంది.
MOST READ:మినీ క్లబ్‌మన్ స్పెషల్ ఎడిషన్ కారు కొన్న మలయాళ సినిమా యాక్టర్, ఎవరో తెలుసా ?