ఏప్రిలియా టుయానో 125 : ఇండియాలో లాంచ్ సాధ్యమేనా.. ?

ఏప్రిలియా తమ అధికారిక ఇండియన్ వెబ్‌సైట్‌లో టుయానో 125 మోటార్‌సైకిల్‌ జాబితాను విడుదల చేసింది. ఇది దాని టుయానో వి 4 ఆర్ఆర్ నుండి ప్రేరణ పొందింది. ఈ ఏప్రిలియా కొత్త బైక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

ఏప్రిలియా టుయానో 125 : ఇండియాలో లాంచ్ సాధ్యమేనా.. ?

ఏప్రిలియా బ్రాండ్ అయిన టుయానో 125 భారత మార్కెట్లోకి రావడం గురించి అధికారిక సమాచారం లేనప్పటికీ, అధికారిక వెబ్‌సైట్‌లో మోటారుసైకిల్ జాబితా గురించి వెల్లడించడం జరిగింది.

ఏప్రిలియా టుయానో 125 : ఇండియాలో లాంచ్ సాధ్యమేనా.. ?

సాధారణంగా ఏప్రిలియా తన బ్రాండ్ వాహనాలయిన టుయానో 150 మరియు ఆర్‌ఎస్‌ 150 లను 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించడానికి సన్నాహాలు చేసింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వాహనాలను ప్రదర్శించలేకపోయింది.

ఏప్రిలియా టుయానో 125 : ఇండియాలో లాంచ్ సాధ్యమేనా.. ?

ఏప్రిలియా కంపెనీ నుంచి టుయోనో 125 చిన్న డిస్ప్లేస్‌మెంట్ మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టే పనిలో ఉంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం ఇది 124 సిసి సింగల్ సిలిండర్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. కానీ దీని శక్తీ మరియు టార్క్ గురించి సరైన వివరాలు వెల్లడి కాలేదు. ఇది 14 bhp మరియు 11 ఎన్ఎమ్ టార్క్ ని ఉతపట్టి చేస్తుందని ఆశించవచ్చు. అంతే కాకుండా ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

ఏప్రిలియా టుయానో 125 : ఇండియాలో లాంచ్ సాధ్యమేనా.. ?

ఏప్రిలియా టుయానో 125 లో మునుగు భాగంలో ఒకే 300 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు 218 మిమీ డిస్క్ సింగిల్-పిస్టన్ కాలిపర్‌తో బ్రేకింగ్ నిర్వహించబడుతుంది. అప్రిలియా టుయోనో 125 లోని టైర్లు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, 100/80 మరియు 130/70 ఫ్రంట్ మరియు రియర్ ప్రొఫైల్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

ఏప్రిలియా టుయానో 125 : ఇండియాలో లాంచ్ సాధ్యమేనా.. ?

ఏప్రిలియా టుయానో 125 లో ఫీచర్స్ గమనించినట్లయితే ఇందులో ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టం, క్విక్-షిఫ్టర్, రేసింగ్-ప్రేరేపిత ఎగ్జాస్ట్, వైడ్ అండ్ హై హ్యాండిల్ బార్ పొజిషన్, కొంచెం ఫార్వర్డ్ సెట్ ఫుట్‌పెగ్స్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్ మరియు డిఆర్‌ఎల్‌ఎస్ వాణివి కలిగి ఉంటుంది.

ఏప్రిలియా టుయానో 125 : ఇండియాలో లాంచ్ సాధ్యమేనా.. ?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

భారత మార్కెట్లో అప్రిలియా టుయానో 125 ప్రవేశపెట్టడం గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు. కానీ మోటారుసైకిల్ గురించి అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా చేయబడింది. భారతీయ మార్కెట్లో ప్రవేశపెడితే అప్రిలియా టుయోనో 125 ధర రూ. 1.10 లక్షలు ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఇండియన్ మార్కెట్లో కెటిఎమ్ డ్యూక్ 125 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Aprilia Tuono 125 Listed On Company’s Official Website: India Launch Possible. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X