కేవలం 10 మందికి మాత్రమే ఈ బైక్‌ను పొందే లక్కీ ఛాన్స్!

ప్రముఖ ఇటాలియన్ సూపర్‌బైక్ తయారీ కంపెనీ ఆప్రిలియా తమ సరికొత్త అల్ట్రా-లిమిటెడ్ ఎడిషన్ టుయోనో వి4 ఎక్స్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిళ్ల ఉత్పత్తిని కేవలం 10 యూనిట్లకు మాత్రమే ఉత్పత్తి చేశారు. అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఇవి 10 మోడళ్లు మాత్రమే లభ్యం కానున్నాయన్నమాట.

కేవలం 10 మందికి మాత్రమే ఈ బైక్‌ను పొందే లక్కీ ఛాన్స్!

ఆప్రిలియా టుయోనో వి4 ఎక్స్ ఆల్ట్రా-లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిల్ ధర 34,900 యూరోలు (ప్రస్తుత మారకపు రేట్ల ప్రకారం మన దేశ కరెన్సీలో సుమారు రూ.30.51 లక్షలు). కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ మార్కెట్లో విడుదల కావటానికి ముందే, ఇప్పటి 10 యూనిట్లు అమ్ముడైపోయాయి.

కేవలం 10 మందికి మాత్రమే ఈ బైక్‌ను పొందే లక్కీ ఛాన్స్!

ఆప్రిలియా టుయోనో వి4 ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ స్ట్రీట్ లీగల్ మోడల్ కాదు. అంటే, దీనిని సిటీ రోడ్లపై నడపటానికి అనుమతి ఉండదు. కేవలం రేస్ ట్రాక్స్‌పై ఉపయోగించడానికి మాత్రమే దీనిని తయారు చేశారు. ఈ మోటార్‌సైకిల్‌లో వివిధ పాపులర్ బ్రాండ్ల నుండి టాప్-ఆఫ్-ది-లైన్ విడిభాగాలతో ట్రాక్-స్పెక్ మోడల్‌గా తయారు చేశారు.

కేవలం 10 మందికి మాత్రమే ఈ బైక్‌ను పొందే లక్కీ ఛాన్స్!

ఆప్రిలియా ఈ లిమిటెడ్ ఎడిషన్ టుయోనో వి4 ఎక్స్‌ను అభివృద్ధి చేయడానికి మోటోజిపి బృందం మరియు జిపి-స్పెక్ బైక్ యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించింది. ప్రస్తుత-రేసర్ అలిక్స్ ఎస్పార్గారో మరియు జట్టు యొక్క టెస్ట్ రైడర్ లోరెంజో సాల్వడోరి టువోనో వి4 ఎక్స్‌ను నడిపి పరీక్షించారు.

కేవలం 10 మందికి మాత్రమే ఈ బైక్‌ను పొందే లక్కీ ఛాన్స్!

ఈ మోటార్‌సైకిల్ చాలా లైట్ వెయిట్‌ను కలిగి ఉంటుంది, దీని మొత్తం బరువు 166 కిలోలు మాత్రమే. ఇది ఆప్రిలియా ఎర్ఎస్‌వి4 ఎక్స్ కన్నా 1 కిలో తక్కువగా ఉంటుంది. ఆప్రిలియా ఎర్ఎస్‌వి4 ఎక్స్ బ్రాండ్ నుండి లభిస్తున్న మరొక లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిల్. టుయోనో వి4 ఎక్స్‌లోని చాలా భాగాలు కార్బన్-ఫైబర్‌ను ఉపయోగించి తయారు చేశారు.

కేవలం 10 మందికి మాత్రమే ఈ బైక్‌ను పొందే లక్కీ ఛాన్స్!

దానికి అదనంగా, ఇందులో మరికొన్ని భాగాలను అల్యూమినియంతో తయారు చేశారు. వీటిలో క్లచ్ మరియు బ్రేక్ లివర్లు, క్రాంక్‌కేస్ గార్డ్, ఫుట్‌రెస్ట్ మరియు ఫ్యూయెల్ ఉన్నాయి. ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్ బరువును తగ్గించేందుకు ఇందులో పిరెల్లి రేసింగ్ స్లిక్ టైర్లను మరియు మర్చెసిని మెగ్నీషియం ఫోర్జ్డ్ వీల్స్‌ను ఉపయోగించారు.

కేవలం 10 మందికి మాత్రమే ఈ బైక్‌ను పొందే లక్కీ ఛాన్స్!

ఆప్రిలియా టుయోనో వి4 ఎక్స్ మోడల్‌లో ఆర్‌ఎస్‌వి4 1100 ఫ్యాక్టరీ నుండి గ్రహించిన 1077సిసి వి4 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 218 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ప్రతి టన్నుకు 1208 హెచ్‌పిల పవర్-టూ-వెయిట్ రేషియోని కలిగి ఉంటుంది.

కేవలం 10 మందికి మాత్రమే ఈ బైక్‌ను పొందే లక్కీ ఛాన్స్!

స్ప్రింగ్ ఎయిర్ ఫిల్టర్, అక్రపోవిక్ టైటానియం ఎగ్జాస్ట్ సిస్టమ్, స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో కూడిన ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు టూ-వే క్విక్ షిఫ్టర్ మరియు ఇతర రేస్-ట్యూన్డ్ ఎలక్ట్రానిక్స్ సాయంతో ఆప్రిలియా టుయోనో వి4 ఎక్స్ ఇంతటి అధిక శక్తిని ఉత్పత్తి చేయగలుగుతుంది.

కేవలం 10 మందికి మాత్రమే ఈ బైక్‌ను పొందే లక్కీ ఛాన్స్!

ఇందులో ఓహ్లిన్స్ నుండి సేకరించిన సెమీ-యాక్టివ్ ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ కూడా ఉంటుంది. ఈ మోటారుసైకిల్ బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో ఏర్పాటు చేసిన బ్రెంబో టి-డ్రైవ్ ట్విన్ డిస్క్‌లు మరియు వెనుక వైపున ఉన్న ఒకే ఒక డిస్క్ బ్రేక్ ఉంటాయి. రెండు చివర్లలో అమర్చిన బ్రెంబో జిపి 4-ఎమ్ఎస్ కాలిపర్‌ల ద్వారా పనిచేస్తాయి.

కేవలం 10 మందికి మాత్రమే ఈ బైక్‌ను పొందే లక్కీ ఛాన్స్!

ఆప్రిలియా టుయోనో వి4 ఎక్స్‌లో కలర్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, ఇది ల్యాప్ టైమర్‌ను కలిగి ఉండి ఇంటిగ్రేటెడ్ జిపిఎస్ సెన్సార్‌లతో పనిచేస్తుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిల్ "బోల్ డి ఓర్" గ్రాఫిక్స్‌ను కలిగి ఉంటుంది, ఈ డిజైన్‌ను ఆప్రిలియా ఆర్ఎస్‌వి 1000 ఆర్ ఫ్యాక్టరీ మోడల్ నుండి ప్రేరణ పొంది డిజైన్ చేశారు.

కేవలం 10 మందికి మాత్రమే ఈ బైక్‌ను పొందే లక్కీ ఛాన్స్!

ఆప్రిలియా టుయోనో వి4 ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రపంచంలోని 10 మంది అదృష్టవంతులు మాత్రమే ఈ మోటార్‌సైకిల్‌ను నేరుగా ఫ్యాక్టరీ నుండి ఇంటికి తెచ్చుకోనున్నారు. వీరికి నోయెల్ రేసింగ్ విభాగంలో పాల్గొనేందుకు కూడా ప్రత్యేకమైన ప్రవేశ అర్హత ఉంటుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిల్‌తో పాటుగా కంపెనీ రేసింగ్ నుండి ప్రేరణ పొందిన కెవైటి-ఎన్ఎక్స్ రేస్ హెల్మెట్‌ను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 1, 2020, 13:40 [IST]
English summary
Aprilia has unveiled its ultra-limited-edition Tuono V4 X motorcycle for the world. Only 10 examples of the motorcycle are being made by the brand. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+