ఆకర్శణీయధరలకే ఏథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ఫీచర్స్, పెరఫామెన్స్, రేంజ్ మరియు ఛార్జింగ్ వంటి మెరుగైన ఎంపికలను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు భారతదేశం అంతటా పలు నగరాలలో లభిస్తాయి. ఈ స్కూటర్ యొక్క ప్రారంభ ధర ఢిల్లీలో రూ. 85,000. కానీ ఇతర నగరాలలో దీని ధర 99,000 రూపాయలు ఉంటుంది.

ఏథర్ 450 ఎక్స్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఏథర్ 450 ఎక్స్ ప్లస్ మరియు ఏథర్ 450 ఎక్స్ ప్రో. ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఖచ్చితమైన పనితీరు గణాంకాలను కలిగి ఉంటాయి. ఇది మెరుగైన బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంటుంది. అంటే కాకుండా 6 కిలోవాట్ల గరిష్ట శక్తిని మరియు 26 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేసే పెద్ద ఎలక్ట్రిక్ మోటారు ఇందులో ఉంటుంది.

ఏథర్ ఎక్స్ 2.9 కిలో వాట్ల బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఒకే చార్జిపై దాదాపు 85 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. సాధారణ 450 వెహికల కంటే ఎలక్ట్రిక్ వెహికల్ 10 కిలోమీటర్ల ఎక్కువ పరిధిని ఇస్తుంది. ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇండియన్ మార్కెట్లో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదంటే ప్రస్తుతం ఏథర్ 450 అనే చెప్పాలి.

ఏథర్ 450 ఎక్స్ లో ఫీచర్స్ కొంతవరకు అప్‌డేట్ చేయబడి ఉంటుంది. ఇందులోని డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇప్పుడు ఓపెన్-సోర్స్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 212 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించి 1.3 GHz, 1 జిబి ర్యామ్ మరియు 8 జిబి స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ ఫీచర్స్ కోసం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 4 జి ఇ-సిమ్‌తో వస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లూటూత్ మరియు యాప్ బేస్డ్ కనెక్షన్‌తో సహా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఏథర్ 450 ఎక్స్‌లోని డాష్‌బోర్డ్ ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్, ఇన్ బిల్ట్ నావిగేషన్, లైవ్ లొకేషన్ మరియు వెహికల్ స్టేటస్, దొంగతనం / టో డిటెక్షన్, మ్యూజిక్ మరియు కాల్ కంట్రోల్ ని కూడా అందిస్తుంది.

ఏథర్ 450 ప్రస్తుతం మూడు రంగులలో లభిస్తుంది. అవి ఎక్స్ గ్రే, వైట్, మరియు గ్రీన్ కలర్స్. మూడు రంగులు రెండు వేరియంట్లలో లభిస్తాయి. ఇది ప్రామాణిక మోడల్ నుండి ముందుకు తీసుకెళ్ళబడిన స్పోర్ట్స్, రైడ్ మరియు ఏకోలతో పాటు ఆల్- న్యూ వార్ప్ మోడ్ ల తో పాటు వివిధ రైడింగ్ మోడ్‌లను కూడా ఈథర్ 450 ఎక్స్ అందిస్తుంది.

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రారంభించడమే కాకుండా , హొసూరులో తన కొత్త ప్రొడక్షన్ ప్లాంట్ ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ఉత్పత్తి సంవత్సరానికి 1 లక్ష యూనిట్లకు పెంచడానికి వీలు కల్పిస్తుంది. ఈ సంవత్సరం భారతదేశంలో 10 నగరాల్లో విస్తరించనుంది. రాబోయే సంవత్సరానికల్లా వీటిని మరింత విస్తరించడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:
ఇండియన్ మార్కెట్లో బెంగళూరుకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ దారు అయిన ఏథర్ 450 ఎక్స్ మోడల్ ను బాగా మెరుగుపరుస్తుంది. అంటే కాకుండా కొత్త ఫీచర్స్ ని కూడా అందిస్తుంది. ఏథర్ 450 ఎక్స్ ఫ్రీ బుకింగ్స్ కొంతకాలం క్రితమే ప్రారంభమయ్యాయి. కాగా డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఏథర్ 450 ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ మరియు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండబోతోంది.


Click it and Unblock the Notifications








