ఇండియాలో ఏథర్ ఎనర్జిని ప్రారంభించనున్న నాలుగు నగరాలు ఇవే..!

బెంగళూరు ఆధారిత సంస్థ అయిన ఏథర్ తన బ్రాండ్ అయిన ఏథర్ ఎనర్జి ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇటీవల కాలంలోనే లాంచ్ చేసింది. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్న ఏథర్ ఎనర్జి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు భారతదేశంలో నాలుగు నగరాలలో అధికారికంగా ప్రవేశించింది. ఈ కొత్త ఏథర్ ఎనర్జి గురించి మరిన్ని వివరాలును తెలుసుకుందాం.. రండి.

ఇండియాలో ఏథర్ ఎనర్జిని ప్రారంభించనున్న నాలుగు నగరాలు ఇవే..!

బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జి భారతదేశంలోని నాలుగు కొత్త నగరాల్లోకి ప్రవేశిస్తుందని అధికారికంగా ప్రకటించింది. అవి అహ్మదాబాద్, కోయంబత్తూర్, కొచ్చి, కోల్‌కతా. ఈ కొత్త నగరాలలో ఏథర్ ఎనర్జిని ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఇండియన్ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మరింత విస్తరించాలనే ఆలోచనే.

ఇండియాలో ఏథర్ ఎనర్జిని ప్రారంభించనున్న నాలుగు నగరాలు ఇవే..!

భారతదేశంలోని నాలుగు నగరాల్లోకి ప్రవేశించడం వల్ల సంస్థ యొక్క 450 మరియు 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లపై చాలా ఆసక్తి ఉన్న ఎక్కువ మంది వినియోగదారులను చేరుకోవడానికి ఈథర్ ఎనర్జీ అనుమతిస్తుంది.

ఇండియాలో ఏథర్ ఎనర్జిని ప్రారంభించనున్న నాలుగు నగరాలు ఇవే..!

జనవరిలో చేసిన ఒక ప్రకటనలో, ఏథర్ ఎనర్జి పూణే, ముంబై, ఢిల్లీ మరియు హైదరాబాద్‌లోకి విస్తరించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఏథర్ ఎనర్జి వారి సమర్పణల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా అహ్మదాబాద్, కోయంబత్తూర్, కొచ్చి మరియు కోల్‌కతాలో స్టోర్స్ ప్రారంభించింది. ఈ నగరాలలో బుకింగ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ నగరాలలో ప్రారంభించడం జరిగింది.

ఇండియాలో ఏథర్ ఎనర్జిని ప్రారంభించనున్న నాలుగు నగరాలు ఇవే..!

వచ్చే నాలుగు నెలల్లో నాలుగు నగరాల్లోనూ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఏథర్ ఎనర్జి ప్రకటించింది. సంస్థ వాహనాల పంపిణీని ప్రారంభించిన తర్వాత ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడతాయి.

ఇండియాలో ఏథర్ ఎనర్జిని ప్రారంభించనున్న నాలుగు నగరాలు ఇవే..!

2000 కి పైగా రిటైల్ భాగస్వామ్య అభ్యర్థనలతో పాటు ఇతర నగరాల నుండి తమకు డీలర్షిప్ అభ్యర్థనలు వచ్చాయని కంపెనీ తెలిపింది. 2022 చివరి నాటికి మొత్తం 30 నగరాలకు విస్తరించే ముందు ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 10 నగరాల్లో విస్తరించాలని ఏథర్ ఎనర్జి యోచిస్తోంది.

ఇండియాలో ఏథర్ ఎనర్జిని ప్రారంభించనున్న నాలుగు నగరాలు ఇవే..!

కంపెనీ 450 ఎక్స్ మోడల్‌కు అధిక డిమాండ్ ఉంది, మరియు ఏథర్ వెబ్‌సైట్ ద్వారా 2,500 రూపాయలకు బుక్ చేసుకునే అవకాశం కల్పించబడింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 6 కిలోవాట్ల పిఎంఎస్‌ఎం మోటారు, 2.9 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఇండియాలో ఏథర్ ఎనర్జిని ప్రారంభించనున్న నాలుగు నగరాలు ఇవే..!

స్కూటర్ ఒకే ఛార్జ్ తో 116 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది, మరియు 3.3 సెకన్లలో 0 కిలోమీటర్ల నుండి 40 కిలోమీటర్ల వేగవంతం చేయగలదు. స్కూటర్ ఎకో, రైడ్, స్పోర్ట్ మరియు వార్ప్ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది.

ఇండియాలో ఏథర్ ఎనర్జిని ప్రారంభించనున్న నాలుగు నగరాలు ఇవే..!

4 జి సిమ్ కార్డ్, బ్లూటూత్ కనెక్టివిటీ, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మ్యాప్ నావిగేషన్ కోసం ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్, ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్ మరియు ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ నవీకరణలు ఏథర్ ఎనర్జి 450 ఎక్స్‌లో ఉన్నాయి.

ఇండియాలో ఏథర్ ఎనర్జిని ప్రారంభించనున్న నాలుగు నగరాలు ఇవే..!

స్కూటర్ ఆటో ఇండికేటర్ ఆఫ్, మరియు గైడ్-మీ-హోమ్ లైట్లతో వస్తుంది. 450 ఎక్స్ స్మార్ట్ హెల్మెట్లకు కూడా మద్దతు ఇస్తుంది. ఏథర్ ఎనర్జీలో స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ కూడా ఉంది. ఇది వినియోగదారులకు ఛార్జింగ్ స్థితి, రైడింగ్ స్టాటిస్టిక్స్, లైవ్ లొకేషన్ మరియు వెహికల్ ట్రాకింగ్‌ను తనిఖీ చేయడానికి అనుమతిస్తుంది.

ఇండియాలో ఏథర్ ఎనర్జిని ప్రారంభించనున్న నాలుగు నగరాలు ఇవే..!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఏథర్ ఎనర్జి ఈ సంవత్సరం మరో నాలుగు నగరాలకు విస్తరించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, కొచ్చి, హైదరాబాద్ లలో స్టోర్స్ ఉన్నాయి. త్వరలో ఏథర్ ఎనర్జి ఎలక్ట్రిక్ స్కూటర్లు రోడ్లపై చూడవచ్చు. ఇది ఏథర్ ఎనర్జి లవర్స్ కి ఒక గుడ్ న్యూస్.

Most Read Articles

English summary
Ather Energy Expands Into Four New Cities In India: Ahmedabad, Coimbatore, Kochi, And Kolkata. Read in Telugu.
Story first published: Saturday, February 22, 2020, 12:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X