దేశంలోని మరిన్ని నగరాలకు ఎథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా మరిన్ని కొత్త నగరాల్లో తమ సేవలు విస్తరించాలని యోచిస్తోంది. దేశంలోని మరిన్ని ప్రధాన నగరాల్లో తమ అమ్మకాల కార్యకలాపాలను దశల వారీగా వేగంగా విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

దేశంలోని మరిన్ని నగరాలకు ఎథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ విషయాన్ని ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు మరియు సిఈఓ స్వయంగా వెల్లడించారు. ఓ ఫ్యూచర్ కస్టమర్ నుంచి వచ్చిన ప్రశ్నకు సమాధానంగా, ఈ ఏడాది నవంబర్ నాటికి పూణేలో కార్యకలాపాలు ప్రారంభించాలని చూస్తున్నట్లు సమాధానమిచ్చారు. అలాగే, ప్రతిదీ సరిగ్గా జరిగితే, 2020 డిసెంబర్ నాటికి ముంబైలో కూడా తమ వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

దేశంలోని మరిన్ని నగరాలకు ఎథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్

రాబోయే వారాల్లో ఢిల్లీ మార్కెట్లోకి కూడా ప్రవేశించనున్నట్లు కంపెనీ ఇటీవలే తెలిపింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా ఈవీ విధానంతో, ఆ రాష్ట్రంలో వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనే సంస్థ ప్రణాళికలకు గట్టి ప్రోత్సాహాన్నిచ్చింది.

MOST READ:మీకు తెలుసా.. సచిన్ టెండూల్కర్ మొదటి కార్, ఇదే

దేశంలోని మరిన్ని నగరాలకు ఎథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్

ఢిల్లీ సర్కారు ప్రవేశపెట్టిన కొత్త ఈవీ పాలసీ వలన ఈవీల తయారీదారులు మరియు ఈవీల కొనుగోలుదారులు ఇద్దరికీ లబ్ధి చేకూరుతుంది. ఈ కొత్త ప్రయోజనాలు ఫేమ్-2 పథకం ద్వారా అందుబాటులో ఉన్న వాటికి అదనంగా ఉంటాయి. ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా వేగంగా ఈవీలను విస్తరింపజేయాలనే లక్ష్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు.

దేశంలోని మరిన్ని నగరాలకు ఎథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానం వలన ఇతర నగరాలతో పోల్చితే ఢిల్లీ మార్కెట్లో కంపెనీ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.15,000 తక్కువగా ఉంటుందని ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా ఇటీవల ఓ సందర్భంలో ధృవీకరించారు.

MOST READ:కొత్త వాహనాలకు పాత వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ; ఎక్కడో తెలుసా ?

దేశంలోని మరిన్ని నగరాలకు ఎథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్

ఏథర్ ఎనర్జీ 2021 చివరి నాటికి 20 నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తోంది. దీనికి అదనంగా, కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా, ప్రస్తుతం హోసూర్‌లో ఏర్పాటు చేయబడుతున్న కొత్త ఉత్పాదక ప్లాంట్ సామర్థ్యాన్ని కూడా పెంచను్ననారు.

దేశంలోని మరిన్ని నగరాలకు ఎథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్

ఈథర్ ఎనర్జీ ప్రకారం, ఈ కొత్త ప్లాంట్ 400,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది, ఇది ఏటా 100,000 యూనిట్లను ఉత్పత్తి చేసేలా రూపొందించబడింది మరియు ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని కావాలనుకుంటే 5,00,000 యూనిట్లకప విస్తరించుకునే సౌకర్యం ఉంది. ఈ ఏడాది చివరినాటికి వ్యాపార కార్యకలాపాల కోసం ఈ ప్లాంట్‌ను పూర్తి చేసి, దశల వారీగా విస్తరణ చేపట్టాలని కంపెనీ యోచిస్తోంది.

MOST READ:కొడుకు పరీక్ష రాయించడానికి 105 కి.మీ సైకిల్ పై తీసుకెళ్లిన తండ్రి

దేశంలోని మరిన్ని నగరాలకు ఎథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్

సిరీస్ సి రౌండ్ నిధుల పొడిగింపుగా కంపెనీ, హీరో మోటోకార్ప్ మద్దతుతో సంస్థ ఇటీవలో రూ.84 కోట్ల నిధులను సమీకరించింది. కొత్త నిధులు దేశంలో తమ భవిష్యత్ విస్తరణ ప్రణాళికల కోసం ఉపయోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

దేశంలోని మరిన్ని నగరాలకు ఎథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్

దశల వారీగా విస్తరణ మరియు ఉత్పత్తి పెరుగుదలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయడం ద్వారా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కంపెనీ యోచిస్తోంది. ఏథర్ ఎనర్జీ రాబోయే ఐదేళ్ళలో దేశవ్యాప్తంగా ఏథర్ గ్రిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది, దీనివల్ల పబ్లిక్ ఛార్జింగ్ మరింత సులభతరం కావటమే కాకుండా, అన్ని రకాల బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహన యజమానులకు సైతం ఇది అందుబాటులో ఉండనుంది.

MOST READ:సెక్యూరిటీ లేకుండా రోడ్ మీద బెంజ్ కారు డ్రైవ్ చేస్తున్న రతన్ టాటా [వీడియో]

దేశంలోని మరిన్ని నగరాలకు ఎథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్

మరోవైపు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సులువుగా సొంతం చేసుకునేందుకు కంపెనీ ఆకర్షణీయమైన మార్గాలను ప్రకటించింది. ఇందులో అనేక ఫైనాన్సింగ్ ఆప్షన్లతో పాటుగా మరియు ప్రత్యేకమైన ఓనర్‌షిప్ మోడల్స్ కూడా ఉన్నాయి.

ఏథర్ ఎనర్జీ మార్కెట్ విస్తరణపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దేశంలో, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ శరవేగంగా పెరుగుతోంది. ఏథర్ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ 450 ఎక్స్ ఈ విభాగంలో మంచి ప్రాచుర్యం పొందిన మోడల్. మరికొద్ది రోజుల్లోనే ఏథర్ హైదరాబాద్ నగరంలోకి కూడా ప్రవేశించనుంది.

Most Read Articles

English summary
Bangalore-based electric two-wheeler, Ather Energy plans to enter new cities across the country. The company aims to rapidly expand its sales operations in a phase-wise manner to other cities. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X