2W ఎక్సేంజ్ ప్రోగ్రామ్ కోసం క్రెడ్ఆర్‌తో చేతులు కలిపిన ఏథర్ ఎనర్జీ

ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' తమ కస్టమర్ల కోసం ఓ అధునాతన స్కీమ్‌ను పరిచయం చేసింది. ఇందుకో కోసం ప్రముఖ ప్రీ-ఓన్డ్ ద్విచక్ర వాహన బ్రాండ్ 'క్రెడ్ఆర్'తో ఏథర్ ఎనర్జీ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మీ వద్ద ఎలాంటి స్కూటర్, మోటారుసైకిల్ లేదా సూపర్ బైక్ ఉన్నా వాటిని మీరు ఇప్పుడు సరికొత్త ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎక్సేంజ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

2W ఎక్సేంజ్ ప్రోగ్రామ్ కోసం క్రెడ్ఆర్‌తో చేతులు కలిపిన ఏథర్ ఎనర్జీ

క్రెడ్ఆర్ పాత పెట్రోల్ ద్విచక్ర వాహనాల కోసం తక్షణమే ధర కోట్ చేస్తుంది, ఇలా కోట్ చేసిన ధర కొత్త ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుకు అయ్యే మొత్తం ధర నుంచి తగ్గించుకోవచ్చు. ఈ భాగస్వామ్యంలో భాగంగా వాహన యజమానులు తమ పాత ద్విచక్ర వాహనాలను త్వరగా మరియు సులువుగా ట్రేడ్-ఇన్ చేసి ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది.

2W ఎక్సేంజ్ ప్రోగ్రామ్ కోసం క్రెడ్ఆర్‌తో చేతులు కలిపిన ఏథర్ ఎనర్జీ

ఈ భాగస్వామ్యంపై ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ సింగ్ ఫోకెలా మాట్లాడుతూ, "2018 లో ప్రారంభించినప్పటి నుండి, మేము మా వాహనాల కోసం కొత్త మరియు వినూత్న యాజమాన్య విధానాల కోసం నిరంతరం వెతుకుతున్నాము, ఆ దిశలో భాగంగానే ఈ కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఈ ఎక్సేంజ్ స్కీమ్ ద్వారా వాహన యజమానులు చాలా సులువుగా, త్వరగా తమ పాత వాహనాలను మార్పిడి చేసుకొని కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని పొందవచ్చు. క్రెడ్ఆర్ సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాల విభాగంలో గొప్పగా పని చేస్తోంది మరియు చాలా పోటీ రేట్లు అందిస్తోంది, మొత్తం కొనుగోలు అనుభవాన్ని పారదర్శకంగా మరియు తేలికగా చేస్తుందని" అన్నారు.

MOST READ: ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ రైడ్ రివ్యూ.. దీనినే ఎందుకు కొనాలంటే ?

2W ఎక్సేంజ్ ప్రోగ్రామ్ కోసం క్రెడ్ఆర్‌తో చేతులు కలిపిన ఏథర్ ఎనర్జీ

ఈ ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పొందాలనుకునే కస్టమర్లు ముందుగా తమ పాత ద్విచక్ర వాహనాలను భౌతిక తనిఖీ కోసం ఏథర్ స్పేస్‌కు తీసుకురావాలి, ఇక్కడ క్రెడ్ఆర్ ఆధారిత అప్లికేషన్ ద్వారా తక్షణ ప్రైస్ కోట్ / ఎస్టిమేషన్‌ను వేస్తారు. ఇంకా, క్రెడ్ఆర్ అవసరమైన డాక్యుమెంట్లు, వెహికల్ హెల్త్‌ను ధృవీకరిస్తుంది. ఇలా కోట్ చేసిన మొత్తాన్ని ఏథర్ స్కూటర్ల తుది ధర నుండి తగ్గించడం జరుగుతుంది. ప్రస్తుతం, ఈ కార్యక్రమం బెంగళూరు, చెన్నైలకు మాత్రమే వర్తిస్తుంది. రానున్న రోజుల్లో దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో ఈ సేవలను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది.

2W ఎక్సేంజ్ ప్రోగ్రామ్ కోసం క్రెడ్ఆర్‌తో చేతులు కలిపిన ఏథర్ ఎనర్జీ

క్రెడ్ఆర్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ శశిధర్ నందిగాం మాట్లాడుతూ.. "మేము గత 5 సంవత్సరాలలో 3 లక్షలకు పైగా సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాల లావాదేవీలు చేసాము మరియు ఈ సమయంలో వాడిన ద్విచక్ర వాహనాల మార్కెట్‌ను మాకంటే ఎక్కువగా మరెవ్వరూ అర్థం చేసుకోలేదు. 20 లక్షలకు పైగా డేటా పాయింట్లు, ప్రైసింగ్ ఇంటెలిజెన్స్‌తో మేము ఏదైనా ద్విచక్ర వాహన విక్రేతకు ఉత్తమమైన విలువను అందిస్తాము.

MOST READ: ఇవే మేడ్ ఇన్ ఇండియా స్కూటర్స్ - ఫుల్ డిటేల్స్

2W ఎక్సేంజ్ ప్రోగ్రామ్ కోసం క్రెడ్ఆర్‌తో చేతులు కలిపిన ఏథర్ ఎనర్జీ

అన్ని ప్రముఖ 2W తయారీదారులతో కలిసి పనిచేసిన తరువాత, మేము ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులతో కూడా అదే విధంగా పనిచేయనున్నాము. చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలన వైపుకు మళ్లుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఒప్పందం మంచి ఫలితాలను అందిస్తుందని ఆశిస్తున్నామ"ని అన్నారు.

2W ఎక్సేంజ్ ప్రోగ్రామ్ కోసం క్రెడ్ఆర్‌తో చేతులు కలిపిన ఏథర్ ఎనర్జీ

క్రెడ్ఆర్‌తో ఏథర్ ఒప్పందంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ కార్యక్రమం ద్వారా, వినియోగదారులు తమ పాత ద్విచక్ర వాహనాన్ని సులువుగా వదిలించుకొని త్వరితగతిన ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయగలరు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో ఏథర్ అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్, కాబట్టి కస్టమర్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అనేది మా అభిప్రాయం.

Most Read Articles

English summary
Ather Energy has come up with a purchase option in association with CredR (pre-owned two-wheeler brand). Under this scheme no matter which scooter, motorcycle or superbike you own, you can now switch to electric by exchanging it for a brand new Ather scooter. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X