కొత్త 2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, త్వరలో ఇండియా లాంచ్

పాపులర్ జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి, అందిస్తున్న క్యూ5 ఎస్‌యూవీలో కంపెనీ సరికొత్త 2021 వెర్షన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. మునుపటి వెర్షన్లతో పోల్చుకుంటే మరింత అధునాతనంగా తీర్చిదిద్దిన కొత్త ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని ఆడి ఆవిష్కరించింది. వచ్చే ఏడాది నాటికి ఇది భారత మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

కొత్త 2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, త్వరలో ఇండియా లాంచ్

ఇప్పటి వరకూ వచ్చిన ఆడి క్యూ5 మోడళ్లతో పోల్చుకుంటే ఈ కొత్త 2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరింత అగ్రెసివ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. ముందు భాగంలో రీడిజైన్ చేసిన గ్రిల్‌తో ఇది సరికొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది, ఇది మునుపటి మోడల్‌తో పోలిస్తే ఇప్పుడు చాలా పెద్దదిగా కనిపిస్తుంది.

కొత్త 2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, త్వరలో ఇండియా లాంచ్

రీడిజైన్ చేసిన డేటైమ్ రన్నింగ్ లైట్లతో రూపొందించిన కొత్త ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ మరింత సన్నగా కనిపిస్తాయి. ఇవి మునుపటి కంటే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇకపోతే ముందు వైపు బంపర్‌లోని రెండు చివర్లలో ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ ఉన్న పెద్ద హౌసింగ్ మరింత స్పోర్టీ లుక్‌ని జోడిస్తుంది. వెనుక వైపు బంపర్‌లో రెండు టెయిల్ ల్యాంప్స్‌ను కలుపుతూ స్మోక్ కలర్‌లో ఉండే ట్రిమ్ కారుకి మరింత స్టైల్‌ని జోడిస్తుంది.

MOST READ:కెజిఎఫ్ స్టార్ యష్ లగ్జరీ కార్లు, ఎలా ఉన్నాయో చూసారా ?

కొత్త 2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, త్వరలో ఇండియా లాంచ్

కొత్త ఆడి క్యూ5 కారులో హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ రెండింటినీ రీడిజైన్ చేశారు. వీటిలో ముఖ్యంగా వెనుక భాగంలోని లైట్స్‌ను కొత్త ఓలెడ్ టెక్నాలజీతో తయారు చేశారు. కొత్త క్యూ5 కారును కొనుగోలు చేసేటప్పుడు ఆడి తమ అంతర్జాతీయ కస్టమర్లకు వివిధ లైటింగ్ ఆప్షన్స్‌ను ఆఫర్ చేస్తోంది, ఇందులో ఆడి బ్రాండ్ మ్యాట్రిక్స్ టెక్నాలజీతో వచ్చే లైట్స్ కూడా ఉన్నాయి.

కొత్త 2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, త్వరలో ఇండియా లాంచ్

లోపలి వైపు గమనిస్తే, ఇందులో పెద్ద 10.1 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉంటుంది, ఇది ఆడి బ్రాండ్ ఎమ్ఐబి3 ప్లాట్‌ఫామ్ నుండి గ్రహించారు. ఇది మునుపటి తరం కంటే 10 రెట్లు వేగంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇందులో వివిధ కమాండ్స్ కోసం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో పనిచేసే అమెజాన్ అలెక్సా మరియు బ్రాండ్ యొక్క కనెక్టింగ్ టెక్నాలజీలు కూడా ఉంటాయి.

MOST READ:ప్రయాణికులకు గుడ్ న్యూస్ : తత్కాల్ సర్వీస్ ప్రారంభించిన ఇండియన్ రైల్వే

కొత్త 2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, త్వరలో ఇండియా లాంచ్

ఈ కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ గూగుల్ ఎర్త్ నుండి గ్రహించిన హై-రెజల్యూషన్ చిత్రాలతో అప్‌గ్రేడ్ చేయబడిన నావిగేషన్‌ను కూడా అందిస్తుంది. మరిన్ని ఫీచర్లను అందించడానికి కంపెనీ తమ ‘మై ఆడి' స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను కూడా ఇందులో అప్‌డేట్ చేసింది.

కొత్త 2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, త్వరలో ఇండియా లాంచ్

ఇంకా ఇందులో ప్రీమియం లెథర్ సీట్స్, అప్‌గ్రేడెడ్ మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పానరోమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త ఆడి క్యూ5 క్యాబిన్‌ను లగ్జరీ మరియు స్పోర్టినెస్ కలయికతో డిజైన్ చేశారు.

MOST READ:లగ్జరీ బైక్‌పై కనిపించిన భారత సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి

కొత్త 2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, త్వరలో ఇండియా లాంచ్

అంతర్జాతీయ మార్కెట్లలో, కొత్త ఆడి క్యూ5 కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. అయితే, భారత్‌లో ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే రావచ్చని సమాచారం. పెట్రోల్ వెర్షన్‌లో 2.0 లీటర్ 45 టిఎఫ్‌ఎస్‌ఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 245bhp శక్తిని, 370Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, త్వరలో ఇండియా లాంచ్

ఆడి బ్రాండ్ ఫోర్-వీల్ సిస్టమ్‘క్వాట్రో' సాయంతో ఇంజన్ నుంచి వచ్చే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది. ఇందులో 7-స్పీడ్ ‘ఎస్-ట్రానిక్' డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ఈ కొత్త ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లోని పవర్ గణాంకాలను చూస్తుంటే, ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న ఆడి ఎ6 సెడాన్‌లోని పవర్ గణాంకాలతో సమానంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

MOST READ:వాహదారులు అక్కడ 2 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా ?

కొత్త 2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, త్వరలో ఇండియా లాంచ్

కొత్త ఆడి క్యూ5 భారత మార్కెట్లో విడుదలైతే, ఇది ఈ సెగ్మెంట్లోని మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3, వోల్వో ఎక్స్‌సి60 మరియు ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో అందిస్తున్న అధనపు ఫీచర్ల కారణంగా ఈ కొత్త మోడల్ ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న దాని కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

కొత్త 2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ, త్వరలో ఇండియా లాంచ్

కొత్త ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కొత్త ఆడి క్యూ 5 మునుపటి మోడల్‌తో పోలిస్తే చాలా మరింత అగ్రెసివ్‌గా, స్పోర్టీగా కనిపిస్తుంది. ప్రయాణీకులకు మెరుగైన అనుభవాన్ని, అత్యుత్తమ సౌకర్యాన్ని అందించేందుకు ఆడి ఈ కారు ఇంటీరియర్ క్యాబిన్‌ను మరింత లగ్జరీగా తీర్చిదిద్దింది. దేశంలో కోవిడ్ -19 మహమ్మారి కొనసాగుతున్న కారణంగా ఈ కొత్త మోడల్ ఇండియా మార్కెట్లోకి విడుదల కావటానికి మరికొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
audi q5 facelift unveiled india launch expected next year details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X